Site icon Sanchika

భరతమాత

[box type=’note’ fontsize=’16’] భరతమాత సొగసును, సౌభాగ్యాన్ని ఎలా పొగడగలను అంటున్నారు మట్ట వాసుదేవమ్ ఈ కవితలో. [/box]

[dropcap]హి[/dropcap]మశిఖరమే నీదు ఘనకిరీటమ్మయ్యే
దట్టమగు హిమగిరులు జుట్టుగా మారే
కాశ్మీరులోయ నీ నుదిటి తిలకమ్మయ్యె
సింధు బ్రహ్మపుత్ర చెవికమ్మలై వెలసె
గంగయమునలు నీదు ముత్యాల హారములు
ఏమి నీ సొగసహెూ తల్లి! ఎట్లు పొగిడెద కల్పవల్లి!!

వింద్య సాత్పురలు విలువైన వడ్డాణంబు
గోదావరీ మాత గొప్పదగు మొలనూలు
కోహినూరదే నీకు కొప్పులో నాగరము
కోలారు నైవేళి కోశగారము నీకు
గోలుకొండదె నీకు కొంగు బంగారము
ఏమి నీ భాగ్యమూ తల్లి! ఎట్లుపొగిడెద కల్పవల్లి!!

కన్యాకుమారి నీకమనీయ పాదములు
హిందు సముద్రము నీకు పాదపీఠమ్మయ్యె
ఇరువంక సంద్రాలు నీకుర్చి చేతులు
మలయపర్వతమే నీ మైచందనమ్మయ్యె
ఏమి సౌభాగ్యమహెూ తల్లి! ఎట్లు పొగిడెద కల్పవల్లి!!

Exit mobile version