భయం

1
1

[dropcap]భ[/dropcap]యం… భయం… భయం
ఈ సమాజం అంటే నాకు భయం
తాను చేసిన తప్పు నా మీద వేస్తుందని!
భయం… భయం… భయం
తాను చేసిన అన్యాయం నా పై రుద్దేస్తుందని!
నాకు తగని భయం – భయం
నన్ను తన వైపు లాక్కుంటుందని
నా పై నిందల వర్షం కురిపిస్తుందని
తెలిసి ఆ మాయలో పడిపోతానేమోనని
భయం భయం భయం

వివేకం సూర్యుడిలా నడినెత్తి మీద కొస్తే
ఈ భయాల  నీడలు పారిపోతాయని ధైర్యం
మహనీయుల త్యాగాలు గుర్తుకొచ్చి
స్వార్థ మేఘాలు చెదిరిపోతాయని ధైర్యం
ఆశయమే దీపంగా అందుకే ఈ ప్రయాణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here