Site icon Sanchika

భయం

[dropcap]న[/dropcap]ది సాగరంతో కలిసే ముందట
భయంతో ఒకసారి వణుకుతుందట
కొండలూ కోనలనుంచి
అడవులూ పల్లెలకు విస్తరించి
తను చుట్టపెట్టిన దూరాలను
వెనుకకు తిరిగి చూసుకుంటుందట
తను ముందున్న అనంత సాగరంలో
కలిసి అదృశ్యం కాబోవడాన్ని
ఒక్కసారిగా తలుచుకుంటుంటే
కానీ వేరే యితర మార్గం లేనేలేదు
నది వెనుకకు మరలటం జరుగదు
వెనుకకు ఎవరూ మరల లేరు
కోల్పోయిన అస్తిత్వం తిరిగి పొందలేరు

నది సాగరంతో కలిసే
ప్రమాదం తప్పక ఎదుర్కోవాలి
తను భయాన్ని అక్కడే కోల్పోవాలి
అప్పుడే నది తెలుసుకుంటుంది
తను సాగరంలో కలిసి అదృశ్యం కావటం లేదని
తను సయితం సాగరంగా మారిపోతున్నానని.

మూలం: ఖలీల్ జీబ్రాన్
తెలుగు: ఆర్.ఎస్. వెంకటేశ్వరన్.

Exit mobile version