Site icon Sanchika

డా. ఎస్.వి.సత్యనారాయణ గారికి భీమనాథం హనుమారెడ్డి స్మారక సాహిత్య పురస్కారం

ప్రకాశం జిల్లా రచయితల సంఘం పూర్వ అధ్యక్షులు భీమనాథం హనుమారెడ్డి 82వ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్ ఎస్. వి. సత్యనారాయణకు భీమనాథం హనుమారెడ్డి స్మారక సాహిత్య పురస్కారం –  2023 ను ప్రదానం చేస్తున్నట్లు ప్రరసం అధ్యక్షులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు తెలిపారు.

ఈ అవార్డు కింద 10 వేల రూపాయల నగదు, ప్రత్యేక జ్ఞాపికను అందజేస్తున్నట్లు తెలిపారు. ఎస్.వి. సత్యనారాయణ గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం పదకోశ నిర్మాణ కమిటీ సభ్యులుగా, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నంది అవార్డు కమిటీ సభ్యులుగా విశేషమైన సేవలు అందించారు. 5 కవితా సంపుటలు, 2 అనువాద గ్రంథాలు, 28 సాహిత్య గ్రంథాలు రచించడమే కాకుండా, 30 అమూల్యమైన సాహిత్య గ్రంథాలకు సంపాదకత్వం వహించారు.

ఈ నెల 23వ తేదీ ఒంగోలులో జరిగే హనుమారెడ్డి జయంతి వేడుకలలో డాక్టర్ ఎస్. వి. సత్యనారాయణకు ఈ అవార్డు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version