భూమి నుంచి ప్లూటో దాకా… -10

0
3

అధ్యాయం 26: గనీమీడ్: సితె ది ఓరియన్

నేను తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాను. నాలో ఏదో మార్పు వచ్చింది. వేగవంతమైన జరిగిపోతున్న సంఘటనలు, ఒత్తిళ్లు, ఇంకా ప్రతి దశలో ఎదురవుతున్న అడ్డంకులు నాలో ఉద్విగ్నతను తీవ్రతరం చేస్తున్నాయి.

ప్రకృతిని బందీని పట్టుకొని నన్ను బెదిరించే దుష్ట సమారా ఉండనే ఉన్నాడు.

నా శరీరమంతా కోపం, నిరాశలతో నిండిపోయింది.

నలుగురు శక్తివంతమైన తాంత్రికులు చాంద్, వాన్ కు జాక్, డిమిట్రీ, ఇంకా స్థానికుడైన ఏనిమాయిడ్ నాకు సహాయం చేయడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నారు, ఇంక నేను ఎవరికి భయపడాలి?

ఇది ఒక వింత పరాయి గ్రహం.

ఆ ఒంటరి రైలు బోగీలో ఉన్న ఏకైక ప్రయాణీకుడు మాకేసి భయం నిండిన కళ్ళతో చూస్తున్నాడు. అతని తలమీద ఉన్న యాంటెన్నా కదులుతోంది. జంతువు చర్మంలాంటి అతని చర్మం అతని వణుకుని తెలియజేస్తోంది. నోరు తెరిచి అతనేదో గుర్రుమన్నాడు. కానీ ఏనిమయిడ్ స్థానికభాషలో మాట్లాడి అతన్ని కుదుటపరిచాడు. దాంతో అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు.

నేను అరిచాను, “ఏనిమాయిడ్! ఎవరికీ హాని ఉద్దేశం మనకి లేదని ప్రతి ఒక్కరికీ చెప్పండి. ఇప్పుడు దాని కోసం పరుగెడదాం. మనం రాజభవనంలోకి ప్రవేశించడానికి మన శక్తులను ఉపయోగిద్దాం. మంత్రదండాన్ని దొరకబుచ్చుకుని, వెనక్కి వచ్చేద్దాం. దాన్ని తీసుకోడానికి సమూరాని పిలుద్దాం. యురేకస్, సమూరా వ్యోమనౌక కమ్యూనికేషన్ ఛానల్ తెరిచి ఉంచు. సరేనా?”

“అలాగే! అలాగే మాస్టర్!” అంది యురేకస్ “సమూరా నాకా వివరాలు ఇచ్చాడు”.

నేను ఆజ్ఞాపించాను, “డిమిట్రీ, నువ్వు సైనికులతో పోరాడు, బుల్లెట్లను ఎదుర్కో. సరేనా? వాన్ కు జాక్ నువ్వు వెనుక నుండి మమ్మల్ని కాపాడటానికి నకిలీ మంటల హోలోగ్రామ్స్, కృత్రిమ గోడలను సృష్టించాలి; చాంద్ నువ్వు చంద్రగ్రహానికి చెందిన గొప్ప తాంత్రికుడివి. వారు ఏకాగ్రత కోల్పోవడానికి చల్లని మరియు పొగమంచును సృష్టించు!

ఇక ఏనిమోయిడ్! ఈ భవనం స్థలాకృతి నీకు తెలుసు, నువ్వు మాకు దారి చూపాలి.

యురేకస్! నువ్వు ఎలక్ట్రానిక్ వ్యవస్థలని సమన్వయం చేయ్. పటాలు చూసి మాకు దిశను తెలపాలి.

నేనేమో మంత్రదండం కోసం వెతుకుతాను!”

“అలాగే” అని గట్టిగా అంటూ డిమిట్రీ అరిచింది. “అవును, మిస్టర్ హనీ, నీవు చాలా అమాయక మరియు స్వచ్ఛమైన శక్తివంతమైన విజర్డ్. ఎంపికైన వ్యక్తివి! హా! హ!”

ఆమె ఎగతాళి చేస్తోందో మెచ్చుకుంటోందో చెప్పడం కష్టం.

రైలు ఆగింది. తలుపులు తెరుచుకున్నాయి.

రాజధాని నగరం స్టేషన్ పేరు మెరుపు దీపాల అక్షరాలతో సితె ది ఓరియన్ (ఓరియన్ సిటీ) – అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ అని గోడలపై ఏర్పాటు చేయబడింది.

పాలరాయితో ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫాం జారుతోంది, పసుపు దీపాలలో మెరుస్తోంది. తుపాకీలు ధరించిన, తలలపై యాంటెనాలు, చర్మంపై బొచ్చుతో డజన్ల కొద్దీ సైనికులు నిలుచుని ఉన్నారు.

ఇది ఊహించినదే అయినా నాకు ఆశ్చర్యం కలిగింది.

“ఇంత త్వరగానా…!”అని నేను అరుస్తూ, “అదృశ్యరూపంలో ఉండండి. అదృశ్యమయ్యే మీ శక్తిని ఉపయోగించండి. కిందకి దూకి, నిష్క్రమణ మార్గంపై పరిగెత్తండి. నేను స్టేషన్ వెలుపల తిరిగి ప్రత్యక్ష్యం అవుతాను. మీరంతా మీ వాకీ-టాకీ కమ్యూనికేషన్‌ ద్వారా నన్ను లేదా యూరేకస్‌ని సంప్రదించాలి” అని చెప్పాను.

“ఇప్పుడే చేద్దాం!” అరిచాను. నేను అపారమైన ఒత్తిడికి గురయ్యాను మరియు తీవ్రమైన ఏకాగ్రతతో అదృశ్యమయ్యే మంత్రం చదివి క్రిందకి దూకాను.

గాలిలో చల్లదనం ఉంది. సైనికులు మాకోసం అన్ని బోగీలను వెతుకుతూ ఉన్నారు. వారు మమ్మల్ని చూడలేరు కానీ ఐదుగురు తాంత్రికులు ఒకేసారి ప్రయోగించిన విశ్వశక్తిని గుర్తించారు.

అప్పుడు ఒక పెద్ద చప్పుడుతో ప్లాట్‌ఫాం మీద భారీ మంటలు చెలరేగాయి. అందరు సైనికులు చెల్లాచెదురయ్యారు.

వాళ్ళ దృష్టిని మళ్ళించటానికి వాన్ కు జాక్ సృష్టించిన హోలోగ్రామ్ అదని నాకు వెంటనే అర్థమయ్యింది.

ఈ గందరగోళం మధ్య మేము టికెట్లు తనిఖీ చేసే ప్రాంతం నుండి, ఇమ్మిగ్రేషన్ తనిఖీ ప్రాంతం నుండి అదృశ్యరూపంలో బయటకు నడిచాం. అక్కడంతా అప్రమత్తమయ్యరు, అగ్నిమాపక యంత్రాలని పిలిపించారు, ఆరోగ్య సిబ్బంది, ఇంకా అనేకమంది భద్రతా సిబ్బంది పరుగులు పెడుతూ అక్కడికి చేరుకున్నారు.

అయితే దీనికి పూర్తి భిన్నంగా స్టేషన్ వెలుపల వాతావరణం ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉంది. సైనికులు రైల్వే స్టేషన్ లోపల కేంద్రీకృతమై ఉండడంతో మాకు కొంత ఉపశమనం లభించింది.

నేను నా వాకీ-టాకీని తీసుకొని దానిలో మాట్లాడాను.

“మనకున్న ఏకైక మార్గం ఏదైనా వాహనాన్ని హైజాక్ చేసి నేరుగా రాజభవనానికి వెళ్ళడమే. ఏనిమాయిడ్, ఈ పని నువ్వే చేయాలి. మేము మిమ్మల్ని అనుసరిస్తాము. లోపలకి ప్రవేశిస్తే మనం ‘గురుగ్రహపు మంత్రదండం’ కోసం వెతుకుదాం. త్వరపడు! మన శక్తి పూర్తిగా ఖర్చయిపోడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. లేదంటే వాళ్ళు మనల్ని పట్టుకుంటారు.”

ఏనిమాయిడ్ గుర్రు స్పీకర్లలో వినిపించింది. యురేకస్ కూడా మాట్లాడుతున్నాడు.

“నిష్క్రమణ మార్గానికి కుడి వైపున 300 మీటర్ల దూరంలో చిన్న రోవర్ క్రాఫ్ట్ లాంటి వాహనాన్ని నేను గుర్తించాను.”

ఏనిమాయిడ్ స్వరం కూడా వాకీ-టాకీలో వినబడింది. “దాని కోసం వెళ్తున్నాను. కానీ మంత్రడండం దొరికాకా, ఆ ప్రాంతం నుంచి ఎలా తప్పించుకోవాలి? మీరు స్పేస్‍షిప్‌కి చేరగలరా? మీరు మళ్ళీ ఎలా ఎగరగలరు?”

నిజం చెప్పాలంటే, నేను వీటి గురించి ఆలోచించలేదు.

నన్ను ఎల్లప్పుడూ దుష్ట్ర గ్రహాంతరవాసులు వెంటాడుతునే ఉన్నారు, లేదా పీడకలలు వెంటాడాయి. కొన్నిసార్లు నా మెదడు అసాధారణ రీతిలో పని చేసింది. కొన్నిసార్లు అది స్తబ్దుగా ఉండిపోయింది.

మా నుండి మంత్రదండాన్ని తీసుకునేందుకు సమూరా దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది. అతను నా భార్యను చంపుతానని బెదిరించడం ద్వారా నన్ను ఒత్తిడిలో ఉంచాడు.

యురేకస్ నా చెవిలో అరిచాడు. “మాస్టర్! సముద్రపు ఒడ్డు నుండి 200 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో తేలుతున్న స్పేస్‌షిప్ ఫ్రీక్వెన్సీ దొరికింది. నేను చక్రవర్తితో ఫోన్‌లో మాట్లాడగలను. దాన్ని నాకు ఆ వ్యోమనౌక యొక్క సిబ్బంది ఇచ్చారు. కానీ మీరు నాకు ఆదేశం ఇవ్వాలి! “

“ఇది మొత్తం ప్రణాళికకి సరిపోతుంది యురేకస్! ఆయన కూడా మనల్ని గమనిస్తూ ఉంటాడు. మన దగ్గర ఏ పడవ లేదా విమానము లేకపోతే, మనం గనీమీడ్ సముద్రంలో తేలుతున్న ఆ వ్యోమనౌకని ఎలా చేరుకుంటాం?”

“ప్రణాళిక కోసం అతనిని అడగనా?”

దీని గురించి ఆలోచించాను. నాకు ఏ పథకాన్ని చెప్పనప్పటికీ, సమూరాకు తప్పనిసరిగా కారణం ఉండాలి.

అది నాకు అర్థమైంది.

మంత్రదండం. మంత్రగాడి అంతిమ కోరిక ఈ గురుగ్రహపు మంత్రదండం. ఏం చేయాలన్నా, అదే నాకు అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది, పద్ధతులను సృష్టిస్తుంది. బహుశా సమూరాని ఎలా చేరుకోవచ్చో ఆ మంత్రదండమే నాకు తెలియజేస్తుంది.

“అవసరం లేదు. రాజభవనంలో ప్రవేశించడానికి ఒక ప్రణాళిక తయారు చేద్దాము! అన్ని స్థలాకృతులను, కో-ఆర్డినేట్లను పొందండి” అన్నాను.

నేను మైక్రోఫోన్‌లో మాట్లాడాను: “డిమిట్రీ ముందు నడుస్తావ్. వాన్ కు జాక్, చాంద్ నా పక్కగా ఉంటారు. నేను రోబోతో మీ వెనుక ఉంటాను. దీన్నే పాటిద్దాం.”

ఉపగ్రహ గ్రహం గనీమీడ్ యొక్క రాజధాని నగరం ‘సితె ది ఓరియన్’ భూఉపరితలం అడుగున నిర్మించబడింది. భూమి, చంద్ర గ్రహాల నుంచి పంపిన 3డి రేఖాచిత్రాలతో వారు భవనాలను రూపొందించి, నగరాన్ని అభివృద్ధి చేశానని నేను విన్నాను. శతాబ్దాలుగా గనీమీడ్ రాజకీయ సంక్షోభాన్ని, తిరుగుబాట్లను చూసింది. రాచరిక పాలకవర్గాలచే ఏనిమాయిడ్లు, హ్యుమానాయిడ్లు దోచుకోబడ్డారు. గత సహస్రాబ్దిలో మంచు కరిగిన తరువాత, భారీ సముద్రం కలిగి ఉన్నందువల్ల ఈ గ్రహం యొక్క ఆదాయ వనరు ఆక్సిజన్ అయ్యింది. ఇంకా తాజా నీటిని సమీపంలోని కాలనీలకు అమ్మడం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటోంది.

కానీ విపరీత వ్యక్తులుగా పిలవబడే పిసియుఎఫ్‌లు లేదా తాంత్రికులు ఉన్నారు. తమ తలలపై కొమ్ముల వంటి యాంటెనాలు, ముఖంపై దట్టమైన పెదవులు, చదునైన ముక్కు, గిరజాల జుట్టుతో ఉన్నారు. వారు ఎక్కువగా మూలుగులతోనూ, తమ భాషకు గల అతి తక్కువ ఏకాక్షరశబ్దాలను ఉచ్చరిస్తూ మాట్లాడుతారు. వారు జంతు ప్రవృత్తి కలిగి ఉన్నారు. పైలట్లు, మెకానిక్‍ల వలె పనిచేసేందుకు తగిన అయస్కాంత శక్తిని కలిగి ఉన్నారు. అలాగే సాంప్రదయాక పద్ధతిలో వస్తువులను సృష్టించగలరు, గాలి కదలికలని నిర్దేశించగలరు, ఇంకా చిన్న మాయలు చేయగలరు. వీటన్నింటినీ నాగరికమైన కులీనులు ‘నీచమైనవి’గా పరిగణిస్తారు. ఏనిమాయిడ్ స్వయంగా ఒక గొప్ప తాంత్రికుడు కావాలని ఆశపడ్డాడు. అతని మెదడుపై సమూరా చేసిన మాయ వల్ల కుజగ్రహానికి వచ్చాడు. అమృత ఔషధాన్ని తీసుకురావడం కోసం నియమించబడ్డాడు.

గనీమీడ్ మీద ఇటువంటి జంతుజీవులు జీవిక కోసం ఏం చేస్తారు? వారు కూలీలుగా, సేవకులుగా, డ్రైవర్లుగా, చిన్న విమానాలు లేదా రైళ్లను నడిపే పైలట్లుగా పని చేస్తారు. మరికొంత మంది భూఉపరితలం పైన ఉండే టైటాన్ లేదా వీనస్ స్పేస్ కాలనీలలోని దుష్ట ‘ఆత్మల’ను పారద్రోలేందుకు ‘విశ్వశక్తి’ని ఉపయోగించి ఇంద్రజాలికులుగా జీవనోపాధి కోసం ఇతర గ్రహాలకి వెళ్లారు.

సౌర వ్యవస్థ యొక్క ఈ ప్రాంతం శుక్ర, శని గ్రహాల ఉపరితలంలో తేలియాడే కాలనీలకు,  టైటాన్, గనీమీడ్ లోని భూగర్భ కాలనీలకు ప్రసిద్ధి చెందింది.

శుక్రగ్రహం యొక్క మొత్తం ఉపరితలం వందలాది మైళ్ల తుఫానులు మరియు మేఘాలతో నిండిపోయింది, జీవించడానికి అనువుగా ఉండదు. వారు శుక్రగ్రహానికి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఒక ప్లాట్‌ఫాంపై ఉన్న కాలనీలు, గృహాలు మరియు వ్యవసాయ క్షేత్రాలు, గింజలు మరియు కూరగాయలు పండించుకుంటున్నారు. ఇదే రకమైన కాలనీలు శనిగ్రహం పైనా ఉన్నాయి. అయితే శాస్త్రవేత్తలు, లోతైన స్థలంలో సాహసాలను కోరుకునేవారు, ఇంకా అసాధారణ అన్వేషకులు ఇక్కడ నివసిస్తారు. సౌర వ్యవస్థ లోని మానవ కాలనీల గురించి నేను అధ్యయనం చేసిన విషయాలను గుర్తు చేసుకున్నాను.

కానీ గనీమీడ్ రాజు? అతను ఎవరు? ధనవంతుడైన నియంతా? డబ్బుని సంపదనీ ఎలా పొందాడు?

ప్రజాస్వామ్యం లేదా నియంతృత్వం కంటే, రాచరికం ఎప్పుడూ నన్ను అడ్డుకుంది. వెయ్యి సంవత్సరాలలో రాజులు ఉన్నారు. బ్రిటీష్ చక్రవర్తులు, రోమన్ చక్రవర్తులు, ఈజిప్షియన్ ఫరోలు, భారతీయ మొఘలులు మొదలైన వారిని దైవిక హక్కులు కలిగి ఉన్నట్టుగా భావిస్తారు. కొంతమంది రాజులు 4 వ సహస్రాబ్దిలో కూడా తమ పాలనను కొనసాగించారు.

ఇతర రాజ్యాలను లేదా పాలితులను దోచుకోకపోతే ఏ రాజు గొప్పగా ఉండడని నేను అనుకున్నాను. కానీ నా విరోధి, నన్ను వేధించేవాడైన సమూరా వంటి మాంత్రికులు కూడా రాజులు, చక్రవర్తలవ్వాలని కోరుకుంటారని తెలిసింది. ఈ మహత్వోన్మాదులు ఇతరుల శరీరాలను, సంపదను, మనస్సులను కూడా పరిపాలిస్తారు.

మేము అదృశ్యరూపంలో, భూగర్భ కాలనీ యొక్క రాతి గోడలలో నిర్మించిన పెద్ద ద్వారాల గుండా రాజు నివసించే రాజభవనంలో ప్రవేశించాము. ఈ నిర్మాణాలు గాభరాపెట్టేలా ఉన్నాయి – రాతిగోడల మధ్యగా చిన్న వంతెనలు మరియు నడక కారిడార్లు కట్టబడి ఉన్నాయి. లోతుగా భూగర్భ స్టేషన్లకు, ప్లాట్‌ఫారాలకు దారితీసే గోడలు నిర్మించబడ్డాయి.

“ది కింగ్‌డమ్ ఆఫ్ గనీమీడ్ రాయల్ ప్యాలెస్ – సితె ది ఓరియన్.” అని తలుపుల మీద బంగారు అక్షరాలతో వ్రాసి ఉంది. ఉపగ్రహ కాలనీ యొక్క చిత్ర లిపిలోనూ, యూనివర్సల్ డిజిటల్ భాషలోనూ, ఆంగ్లంలోనూ వ్రాసి ఉంది.

రాజు గారి శిరస్సు ముద్ర బంగారంతోనూ, మణులతోనూ రూపొంచించినది అక్కడ ఉంది. దాని కింద రాజు ఫెరియస్ – 3450 – గురుగ్రహాల రాజ్యాల విజేత అని చెక్కబడి ఉంది. బహుశా అది అతని గౌరవ ప్రత్యయం. ద్వారానికి ఇరు వైపులా ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. వారు ఎర్ర బారెల్స్ మరియు బటన్లతో భూమి యొక్క ‘మిలీనియం రూజ్’ తుపాకుల వంటి ఆయుధాలు కలిగి ఉన్నారు.

డిమిట్రీ “ఒవ్రె  లే పోర్త్!” అని మంత్రోచ్చారణ చేయసాగింది. శరీరాన్నిబిగించి, చేతులను ముందుకు చాచి, కురులు జారుతుండగా, ఛాతి పొంగి, పెదాలు వణుకుతున్న డిమిట్రీని చూస్తుంటే… ఆమె అంతటి అందమైన మంత్రగత్తె ఎక్కడా లేదని అనిపించింది నాకు.

మంత్రప్రభావంతో ద్వారాలు తమంతట తాముగా తెరుచుకున్నాయి. తమ ప్రమేయం లేకుండా తలుపులు ఎలా తెరుచుకున్నాయో అర్థం కాక గార్డులు తెల్లమోహం వేశారు. మేము అదృశ్యరూపంలో రాజభవనంలోకి నిశ్శబ్దంగా ప్రవేశించాం. గార్డులు తమ తుపాకులను గాలిలోకి గురిపెట్టడం చూసిన డిమిట్రీ వెనక్కి తిరగకుండానే “ఫెర్మే! ఫెర్మే!ఫెర్మే!” అంటూ మరో మంత్రాన్ని ఉచ్చరించడంతో తలుపులు మూసుకుపోయాయి.

సైనికులు, శిల్పాలు ఉన్న మెట్లని ఎక్కి పెద్ద హాలులోకి ప్రవేశించాం. వజ్రాల రంగు చాండిలియర్ వేలాడుతున్నా కూడా అక్కడ వెలుతురు బాగా తక్కువగా ఉంది.

“యురేకస్, నాకు రాజభవనము యొక్క లోపలి ప్రదేశాల మ్యాప్ ఇవ్వు. మేము ఎక్కడికి వెళ్ళాలి?” అన్నాను.

యురేకస్ నా ఇయర్‌ఫోన్‌లో చెప్పింది “మాస్టర్! మొదట హాల్స్ చూడండి. తరువాత  ప్రజల సభ అసెంబ్లీ గదికికి వెళ్లండి. ఆ తరువత రాజమందిరంలో రాజుగారి లివింగ్ రూమ్, బెడ్ రూములు మరియు అతని భోజనశాలలు వెతకాలి. భోజనశాల ప్రక్కన పూజ గది ఉంది. అవును, నేను లోపలి ప్రాంతమంతా స్కాన్ చేయగలను. ఇక్కడ విగ్రహాలు, స్తంభాలు మరియు స్థూపాకార వస్తువులు ఉన్నాయి. కమ్యూనికేషన్ పరికరాలున్న మరొక గదిలో అరడజనుమంది అధికారులు స్క్రీన్ ముందు కూర్చొని ఉన్నారు.”

యురేకస్ శరీరంలోపల ఒక అంతర్నిర్మిత ఎక్స్- రే స్కాన్, ఇన్‌ఫ్రా-రెడ్ కెమెరా ఉన్నాయి. అవి గోడలలోంచి సైతం చొచ్చుకుపోగలవు. దాని ఛాతీ ఉన్న స్క్రీన్ మీద మ్యాప్‌లు చూడవచ్చు, 3డి లో ప్రింట్ చేయవచ్చు. దాని ప్రకారం నేను నా జట్టు సహచరులకు మార్గదర్శకత్వం చేయగలను.

“డిమిట్రీ, నిశ్శబ్దంగా పరిగెత్తు! మంత్రాలు చదవద్దు. రాజుగారి శయనమందిరం కుడి వైపున ఉన్న గదికి వెళ్ళు! అది పూజగది లేదా విలువైన వస్తువులను కలిగి ఉండే గది కావచ్చు. మనం అక్కడ శోధిద్దాము!” అన్నాను.

ఇలా మేము అదృశ్యంగా నడవాసాగాం. కింగ్ ఫెరియస్ లేదా అతని సిబ్బంది, సైనికులు తాంత్రికులై ఉండరని ఆశించాను. వారు మా పై విరుగుడు మంత్రాలు ప్రయోగించరని అనుకున్నాను.

వాస్తవానికి గనీమీడ్‌లో జంతువుల విభాగానికి చెందిన జంతురూపులైన మానవులు మాత్రమే విశ్వశక్తిని ఉపయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని నాకు తెలుసు.

కాబట్టి మేము అదృష్టవంతులం.

భోజనశాల బంగారు మరియు గాజు బల్లలతో, విలక్షణంగా చెక్కిన చెక్క కుర్చీలతో విశాలంగా ఉంది, ఈ బల్లలు, కుర్చీలు చాలా ఖరీదైనది కావచ్చు, బహుశా భూమి నుండి దిగుమతి చేసుకుని ఉంటారు, ఎందుకంటే టేకు అక్కడ సమృద్ధిగా లభిస్తుంది, ఇలాంటి కాలనీలలో అది అలభ్యం.

పడక గది! నేను తన పట్టపురాణులతో పెద్ద మంచం మీద నిద్రిస్తున్న రాజుని చూశాను, ఇద్దరు స్త్రీలు అతనికి ఇరువైపులా ఉన్నారు.

అతను పొడుగ్గా, నల్లగా మరియు కండలు తిరిగిన శరీరంతో ఉన్నాడు, అతని కేశాలు భుజాల వరకు వ్యాపించి ఉన్నాయి. అతను ధరించిన రాత్రి దుస్తులు విచిత్రంగా ఉన్నాయి. మహిళలు నిద్రిస్తున్నారు, వాళ్ళ పక్కగా ఉన్న బల్లలపై ఖాళీ గాజు జాడి మరియు పొడవాటి వైన్ గ్లాసులు ఉన్నాయి. మద్యం సేవించి ఆ మత్తులోనే నిద్రించారని అర్థమవుతోంది…

డిమిట్రీ నెమ్మదిగా మునివేళ్ళపై నడిచి వెళ్ళి విలువైన వస్తువులను ఉంచిన గది తలుపులు తెరిచింది.

ఇప్పుడు వాన్ కు జాక్, చాంద్, వారి వెనుకగా ఏనిమాయిడ్ లోపలికి ప్రవేశించారు. తరువాత యురేకస్ నిశ్శబ్దంగా లోపలికి వచ్చింది.

నేను ఆ విశాలమైన గదిలోకి ప్రవేశించాను. చీకటిగా ఉన్నా పైకప్పు దీపాలతో మెరుస్తున్నది.

అక్కడ అసంఖ్యాక వస్తువులు ఉన్నాయి. దేవతల బంగారు విగ్రహాలు, చెక్కిన వెండి కుర్చీలు, వెండి పూల కుండీలు, గంధపు చెక్కలతో తయరైన మంచాలు, బల్లలు, నల్ల చెక్క ఫ్రేములలో బిగించిన అద్దాలు, పురాతన ఫర్నిచర్ ఉన్నాయి.

వీటికి కొద్దిగా దూరంలో, ఒక్క ఉన్నత పీఠంపై ఒక పూలకుండీలో నిటారుగా నిలబెట్టి ఉన్న దానిని చూడగలిగాను – ఇనుము, దారువుతో రూపొందించిన 4 అడుగుల ఎత్తున్న మంత్రదండం! దాని కొన వద్ద అన్యదేశ జంతువు యొక్క ఎర్ర వెంట్రుకలు ఉన్నాయి. అది నీలం రంగులో ప్రకాశిస్తోంది.

‘ది వాండ్ ఆఫ్ జూపిటర్!’

నేను గొణిగాను, ఆపై బిగ్గరగా అన్నాను.

“మేము దానిని చూడలేము, నువ్వు స్వచ్ఛమైన తాంత్రికుడివి!” అంది డిమిట్రి గొణుగుతూ, నవ్వుతూ.

“నేను దానిని పట్టుకుంటాను, వెంటనే ఈ స్థలం విడిచిపెడదాం!” అన్నాను. నేను అప్పటికే ఆ మంత్రదండాన్ని దాని స్థానం నుండి వెలికితీసి నా చేతిలో పెట్టుకున్నాను.

“జాగ్రత్త మాస్టర్! భవిష్యవాణి కోసం వెతకండి!” అంది యురేకస్ నా ఇయర్‌ఫోన్‌లో.

ఖచ్చితంగా వెతకాల్సిందే. మంత్రదండం అడుగున దొరికిందది. ఇది నాకు చిరపరిచితమైన చర్మపత్రం. దాని మీద బంగారు అక్షరాలతో ఏదో రాసి ఉంది.

“ఓ స్వచ్ఛమైన, నిస్వార్థమైన అదృష్టవంతుడైన మాంత్రికా! ఇక్కడిదాకా వచ్చి పవిత్రమైన గురుగ్రహపు మంత్రదండాన్ని పొందిన తాంత్రికా! దీన్ని చేత పట్టుకుంటే మీ శక్తులు రెట్టింపు అవుతాయి. ఏకాగ్రతను నిలుపుకొని సూచించండి, దాంతో మీరు ఏదైనా చేయవచ్చు!

కాని మీరు అమాయకులను, స్త్రీలను, పిల్లలను చంపలేరని హెచ్చరిస్తున్నాము. అలా మీరు చేస్తే, చేసిన ప్రతిసారీ మీ శక్తి మీ సగమైపోతుంది. ఇది వృద్ధ మాంత్రికల సంఘం ఆదేశం.”

మంత్రదండాన్ని గట్టిగా పట్టుకుంటూ “నిజమే మరి!” అనుకున్నాను. వెనువెంటనే నా శరీరంలో ఏదో అద్భుతశక్తి ప్రవేశించినట్లు గ్రహించాను.

భవిష్యవాణి నిజమైతే నేను ఇప్పుడు 2000 నక్షత్రాల స్థాయి మాంత్రికులకు ఉండేంత శక్తిని సంపాదించుకున్నాను.

“ఇక వెళ్దాం. సైనికులు, గార్డులు రావడానికి ముందే ఇక్కడ్నించి తప్పించుకోవాలి!” అన్నాను.

***

రాజుగారి శయన మందిరాన్ని దాటుతూ, లోపలికి చూశాను. రాజు ఇంకా నిద్రిస్తునే ఉన్నాడు. అతని నల్లని పొడవాటి చెయ్యి తన భార్య ఎత్తైన ఎదపై వేసి ఉంది.

గురుగ్రహపు మంత్రదండం నాకు చాలా శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.

దాన్ని నా ముందు పెట్టి, “ప్రయాణం చేయడానికి మాకొక రోవర్ క్రాఫ్ట్ లభించుగాక!” అన్నాను.

మేము అదృశ్యంగా ఉన్నాము, కానీ ఇంకెంతో సేపు ఉండలేం. మా శక్తులు క్షీణిస్తున్నందున మేము కొన్ని గంటలు మాత్రమే అదృశ్య రూపాన్ని ఉపయోగించుకోగలము. ఇప్పటికే డిమిట్రీ, వాన్ కు జాక్ పరిగెట్టడం నాకు కనబడుతోంది.

మేము రాజభవనం నుండి బయటకు వచ్చాము. మెట్ల దిగి వీధిలోకి పరిగెత్తాము.

ఉన్నట్టుండి ఆ మంత్రదండం మెరుపులను వెదజల్లింది. నా శరీరమంతా వణికిపోయింది.

పైన గాజు గోపురంతో కూడిన రోవర్ క్రాఫ్ట్ వంటిది, ఐదుగురికి సరిపోయే చిన్న కారు మాకెదురుగా ఉంది. అప్పటికే దాని ఇంజన్ ఆన్ చేసి ఉంది.

“దాంట్లో ఎక్కండి!” అని అరుస్తూ ఆదేశించాను. యురేకస్‌తో సహా మేమంతా కార్లోకి ఎక్కాం. కంట్రోల్ ప్యానెల్ పట్టుకుని వాహనాన్ని నడిపిస్తున్న ఆనందం ఏనిమాయిడ్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.

“మాస్టర్ హనీ! ఇదంతా పూర్తయ్యాకా, ఈ గురుగ్రహపు మంత్రదండాన్ని నాకిస్తారా? దీన్ని పొందాలని ఎంత కాలం నుంచో ఎదురుచూస్తున్నాను” అన్నాడు ఏనిమాయిడ్.

దాన్ని పొందడం అతనికి ఎంత ఉత్తేజకరంగా ఉంటుందో నాకు తెలుసు.

“సరే!” అన్నాను.

“ముందు మనం తిరిగి వెళ్లి, సమూరాకు దీన్ని ఇవ్వాలి. ప్రకృతిని విడిపించాలి. అతనింకా ఏమేమి అడుగుతాడో తెలియదు” అన్నాను

రోవర్ ఒక తేనేటీగలా సొరంగంలో ఉన్న భూగర్భ వీధుల గుండా వేగంగా ప్రయాణిస్తోంది, రాజమందిరం మెట్ల నుంచి ప్రయాణించి, గ్రహం ఉపరితలంపైకి వచ్చాం. అక్కడ కొద్దిసేపు వెతికాక, మార్గాన్ని నిర్ధారించుకుని, గనీమీడ్ సముద్రం వైపుకి దూసుకుపోయాం.

నా ఇయర్‌ఫోన్‌లో చప్పుడయింది. “మాస్టర్… సమారా మాట్లాడుతున్నాడు” యురేకస్ అంది. “అతను నా ద్వారా ఐజి నెట్ ఫోన్లో ఉన్నాడు!”

కొన్ని క్షణాల తర్వాత, ఒక చెవిలో కీచుమనే స్వరం వినిపించింది.

“హనీ ఆమ్రాపాలి, నీకది దొరికిందా? ‘వాండ్ ఆఫ్ జూపిటర్’ లభించిందా?”

“దొరికింది! ప్రభూ! దాన్ని గుర్తించి, తీసుకున్నాను. మేము తిరిగి సముద్రం వైపుకు వస్తున్నాం. దయచేసి మమ్మల్ని ఇక్కడ్నించి తప్పించండి! ఈ మంత్రదండానికి కొన్ని శక్తులున్నాయి. నేను దాని సహాయంతో ఒక రోవర్ క్రాఫ్ట్‌ని పొందాను. కానీ మిమ్మల్ని చేరుకోవటానికి సముద్రంలో ఎలా ప్రయాణించాలో నాకు తెలియదు” అన్నాను

“హా! హా! గురుగ్రహపు అద్భుతమైన మంత్రదండమంటే స్వయంగా దైవం బృహస్పతే. మీరు సముద్రం దగ్గరికి రాగానే ఒక వేగవంతమైన పడవని సృష్టించండి – దాని సహాయంతో మీరు ఏమైనా చేయగలరు! అప్పుడు యురేకస్ నుంచి కో-ఆర్డినేట్స్ తీసుకోండి. నా ఐజి నెట్ ద్వారా నేలపై మీరున్న స్థానం నాకు తెలుసు. మీరు గనీమీడ్ సమయంలో ఒక గంటలో చేరవచ్చు! శీఘ్రం! సురక్షితంగా ఉండండి! త్వరలో వాళ్ళొస్తారు!” చెప్పాడు సమూరా.

కాసేపటికే గనీమీడ్ సముద్రం యొక్క నీలి జలాలు దర్శనమిచ్చాయి. అదే సమయంలో నేను మా వెనుకగా లేజర్ గన్ పేలుస్తున్న శబ్దాలు, ఏవో వాహనలు అత్యంత వేగంగా వస్తున్న ధ్వనులు విన్నాను.

ఎర్రని దీపాలతో వెలుగుతూ, వేగంగా కాల్పులు జరుపుతూ వస్తున్న నాలుగు పసుపురంగు రోవర్లు కనబడ్డాయి.

“పసుపు గురుగ్రహం, గనీమీడ్‌ల రంగు. వాళ్ళు గార్డులు. మనల్ని చొరబాటుదారులుగా గ్రహించారు. ఇమ్మిగ్రేషన్ నుండి మనల్ని వెంటాడుతున్నారు. గరిష్ట వేగంతో వెళ్ళండి!” లోగుంతుతో సూచించింది యురేకస్.

“అలాగే” అన్నాడు ఏనిమాయిడ్.

భయానకంగా ఉన్న గనీమీడ్ ప్రకృతిదృశ్యాలను దాటుతున్నాం. గాజు గోపురం సూర్యరశ్మిని రోవర్ లోకి పంపుతోంది, ఉల్కాపాతం వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తోంది, ఇప్పుడది గార్డుల లేజర్ బుల్లెట్ల వర్షం నుండి మాకు రక్షణ కల్పిస్తోంది.

నేను తీవ్రంగా ఆలోచించాను. సముద్రాన్ని చేరుకున్నాకా ఏం చేయాలి?

ఇప్పుడు ప్రతి క్షణం నా మంత్ర శక్తులకు పరీక్ష. నా ఉనికి మొత్తం – అతీత కార్యాలను చేయడానికి – అవసరమైన 2000 నక్షత్ర స్థాయిని పొందింది. ఇది నాకు సౌకర్యవంతంగా లేదు. కానీ అది వాస్తవం.

“ఈ రోవర్ సముద్రపు నీటి మీద ప్రయాణించలేదు. నేను ఒక వేగవంతమైన పడవని సృష్టించాలి” అనుకున్నాను.

వేగంగా ప్రయాణిస్తున్న ఆ రోవర్‌లో ఉన్న ఇరుకైన ప్రదేశంలోనే నా ముందు ఆ మంత్రదండాన్ని ఉంచుకుని నా శక్తితో సంకల్పించాను.

“స్పేస్‌షిప్‌ని చేరుకోవడానికి ఒక వేగవంతమైన పడవ ఉండుగాక”.

ఒక్క క్షణం పాటు ఏమీ జరగలేదు. ఆ తరువాత మంత్రదండం తీవ్రంగా కదిలిపోయింది, మెరుపులు వచ్చాయి.

“హనీ! జాగ్రత్త… నా వీపు కాలిపోతుంది…” హాస్యమాడింది డిమిట్రీ ఎప్పటిలానే.

“చాలా వేగవంతమైనది కావాలి! 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పేస్‌షిప్‌ని అత్యంత వేగంతో చేరుకునే పడవ కావాలి. వాళ్ళొచ్చేస్తున్నారు” అన్నాడు వాన్ కు జాక్.

“నేను ఖచ్చితంగా చెప్పలేను” అన్నాను. “దీనికి ఎంత వేగం అవసరం? కానీ ఎవరైనా వాళ్ళ దృష్టి మళ్ళించాలి! చాంద్, వాన్ కు జాక్… మీరు వాళ్ళతో పోరాడాలి, వారిని దారి మళ్ళించవలసి ఉంటుంది. చెయ్యగలరా?”

“చేయగలం. వాహనాన్ని ఆపండి!” అన్నాడు చాంద్.

వాన్ కు జాక్ గుర్రుమన్నాడు.

నేను రోవర్‌ని ఆపమని ఏనిమాయిడ్‌కి చెప్పాను, వెంటనే ఇద్దరూ దిగిపోయారు.

మేము మా రోవర్‌ని స్టార్ట్ చేశాం. “అరగంట పాటు వాళ్ళని నిలువరించండి. తరువాత సముద్రం మీదకి వచ్చేయండి! సురక్షితంగా ఉండండి!” చెప్పాను వాళ్ళతో.

మనం సముద్రం వైపుకి దూసుకుపోయాం. చంద్రగ్రహానికి చెందిన చాంద్, కుజగ్రహానికి చెందిన వాన్ కు జాక్ – సమర్థులైన మాంత్రికులిద్దరూ – గనీమీడ్ భద్రతాదళాలపై తమ శక్తులను ప్రయోగించడం ప్రారంభించారు.

ఈ పోరాటంలో విశ్వశక్తి ప్రయోగం ఒక వైపు, లేజర్ తుపాకుల మరో వైపు.

నిజమైన మరియు అద్భుత కాల్పనిక అగ్నిగోళాలు ఇరువైపులా ప్రయోగించబడుతున్నాయి.

రోవర్‌లో నేను, డిమిట్రీ, ఏనిమాయిడ్ వేగంగా సముద్రం వైపు దూసుకు వెళ్లి వెనుక నుంచి వస్తున్న బుల్లెట్లను తప్పించుకున్నాం.

“తొందరగా రండి! హనీ, మంత్రదండం ఉంది కదా?” అంటూ రోబో యురేకస్ ద్వారా సమూరా యొక్క క్రూర స్వరం అరిచింది.

“ఉంది, ఉంది! కానీ మేము ఇబ్బందుల్లో ఉన్నాం. మమ్మల్ని వెంబడిస్తున్నారు. చాంద్, వాన్ కు జాక్ బుల్లెట్లను ఎదుర్కుంటున్నారు. వాళ్ళని రక్షించడానికి మీ శక్తిని ఉపయోగించండి!” అన్నాను.

కొంత నిశ్శబ్దం తర్వాత సమూరా అరిచాడు. “నాకనవసరం! ఇది నీ మిషన్. నువ్వు రాకపోతే నీ భార్య, నీ మామ చనిపోతారు. రా!”

అక్కడంతా గందరగోళంగా ఉంది.

గురుగ్రహం యొక్క చిన్న ఉపగ్రహంలో నీలి సముద్రం. ప్రాణాలు కాపాడుకోడానికి నేను ఒక వెర్రి చిన్న రోవర్‍లో ప్రయాణం చేస్తున్నాను. నా ఇద్దరు సహచరులను గ్రహాంతర సైనిక దళాల బుల్లెట్లతో వెంటాడుతున్నారు.

దూరంగా శిలలు, కొండలతో చెట్లతో చుట్టూ ఉన్న ప్రకృతిదృశ్యం భయానకంగా ఉంది.

అప్పుడు నేను వేదనామయమైన కేక ఒకటి విన్నాను.

చాంద్ తన ఛాతీ పట్టుకొని పడిపోయాడు.

ఒక గ్రహాంతర సెక్యూరిటీ గార్డుఅతనిగుండెలో కాల్చాడు.

అతన్ని కాపాడటానికి వెనక్కి వెళ్ళాలా? చాంద్ నిర్జీవుడయ్యాడు. నాకది కోలుకోలేని దెబ్బ. వేదన! దాదాపు వంద గజాల దూరంలో తేలుతున్న సమూరా స్పేస్‌షిప్ ‘ఎత్వాల్ రూజ్’ యొక్క మసక దీపాలు చూడగలిగాను. మేము స్పేస్‌షిప్‌కు చేరువలో ఉన్నాము.

వెంటనే మరో తూటా చప్పుడు ఇయర్‌ఫోన్‌లో మరింత స్పష్టంగా వినబడింది. ఇక్కడ వాతావరణం లేకపోవడంతో నా చెవుల్లో ప్రతిధ్వని వస్తోంది.

వాన్ కు జాక్ పడిపోయాడు.

“అతని చేతులపై కాల్చారు. అతను సజీవంగానే ఉన్నాడు!” అరిచింది యురేకస్. “విశ్వశక్తి ఉపయోగించి మన వద్దకు ఎగిరి రమ్మని అతనికి సందేశం పంపుతున్నాను” అంది.

మేము సమూరా యొక్క ‘ఎత్వాల్ రూజ్’ దగ్గరకు వచ్చాము… యాభై గజాలు…

చుట్టూ అంధకారం. ఉన్నట్టుంది వాతావరణంలో ఆకస్మిక చల్లదనం మొదలైంది.

విశ్వశక్తి ఉపయోగించబడుతుందని నాకు తెలుసు. వాన్ కు జాక్‌కి రక్తం కారుతోంది, కాని గాల్లో ఎగరడానికి విశ్వశక్తిని ఉపయోగించాడు. గాయపడి రక్తమోడుతున్న పక్షిలా అతను ఆకాశంలోఎగురుతున్నాడు. ఈతగాడిలా గాలిలో ఒక చేతిని కదిలిస్తూ వస్తున్నాడు.

వ్యోమనౌకకి ఇరవై గజాలు! వాన్ కు జాక్ నౌకని చేరుకోగలడని గ్రహించాను. పడవ వేగాన్ని తగ్గించాలని చూశాను. “వేగం తగ్గించు” అని ఏనిమాయిడ్‌కి చెప్పాను.

మేము స్పేస్ షిప్ యొక్క ‘డాక్ ఇన్ పోర్ట్’ చేరగానే, వాన్ కు జాక్ మా పైన ఎగురుతూ కనబడ్డాడు. నేను కొద్దిగా గాల్లోకి ఎగిరి, అతన్ని క్యాబిన్ లోకి లాగాను. అతనిపై ప్రయోగించిన మరొక లేజర్ బుల్లెట్ వచ్చి వ్యోమనౌకని తాకి ఎరుపు రంగు మెరుపుల్లా మారిపోయింది.

“బానే ఉన్నారా?” అని మేమంతా అరుస్తూ లోపలికి వెళ్ళాం. స్పేస్‌షిప్ పోర్ట్ తెర్చుకుని, డాకింగ్ మొదలవగానే మా రోవర్ లోపలికి వెళ్ళింది.

“నేను గాయపడ్డాను, ప్రస్తుతానికి పర్వాలేదు. కానీ… చాంద్ మరణించాడు” అంటూ అరిచాడు వాన్ కు జాక్.

నా మిషన్‌లో మొదటి ప్రాణనష్టం. చంద్రగ్రహం నుండి వచ్చిన చాంద్ లేకుండా లోపలికి వెళ్తుంటే మనసు భారమైంది. కనీసం అతని శరీరాన్ని తిరిగి ఎలా తేవాలో నాకు తెలియదు, తన కుటుంబానికి లేదా తన గ్రహంలోని బంధువులకు ఎలా పంపించాలో కూడా నాకు తెలియదు.

యుద్ధం ఎల్లప్పుడూ నేరమే. నాల్గవ సహస్రాబ్దిలో కూడా యుద్ధానికి ఏ సానుభూతి లేదా ఓదార్పు తెలియదు…

ముఖ్యంగా సామ్రాజ్యాలు కోల్పోయి వాటిని తిరిగి పొందడానికి ఏదైనా చేసేందుకు సిద్ధమయ్యే దుష్ట చక్రవర్తులతో ఇదీ మరీ కష్టం.

ప్రాణనష్టం వాళ్ళకి కేవలం ఓ పెట్టుబడి లాంటిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here