భూమి నుంచి ప్లూటో దాకా… -16

0
4

అధ్యాయం 42: క్యూపర్ బెల్ట్, ట్రైటాన్

నెప్ట్యూన్‌ నుంచి చూస్తే బాహ్య సౌర వ్యవస్థ సూర్యుడి నుండి 50 ఆస్ట్రోనామికల్ యూనిట్ల దూరంలో మొదలవుతుంది. యురేనస్, నెప్ట్యూన్ మరియు మరుగుజ్జు గ్రహం ప్లూటో… ఇంకా చిన్న తేలియాడే ఖగోళ వస్తువులు చాలా ఉన్నాయి. నెప్ట్యూన్‌కే చాలా, దాదాపు 27 ఉపగ్రహాలున్నాయి. సూర్యుని నుండి ఇవి ఎంత దూరంలో ఉన్నాయంటే… సూర్యుడి చుట్టూ తిరగడానికి వీటికి 60-75 సంవత్సరాల సుదీర్ఘ కాలం పడుతుంది. ఒకసారి క్యూపర్ బెల్ట్‌ను దాటితే… మరొక నక్షత్ర వ్యవస్థలో… బహుశా ఆల్ఫా సెంటారీలోకో, 5 లేక 6 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బైనరీ నక్షత్రాల వద్దకో వెళతాం.

నెప్ట్యూన్-ప్లూటో స్పేస్ ప్లాట్‌ఫాం చిన్నది. మేము అంతరిక్ష నౌకలో మా నిద్రాణస్థితి నుండి బయటపడ్డాకా, నెమ్మదిగా స్పేస్ ప్లాట్‌ఫాంపై దిగాం. ఆల్ఫా సెంటారీ యొక్క అస్థిపంజర తాంత్రికులు క్రూరులు కానప్పటికీ… స్థిరంగా ఉన్నారు.

“మేము కెప్లర్‍లోని మా ఇళ్ళకి చేరాలి. ఓ టేకియన్ షిప్‌ని పట్టుకోవాలి – తద్వారా మేము హైపర్ స్పేస్‌లో ప్రయాణం చేయవచ్చు. మీ వెర్రి అద్భుత వస్తువుని నువ్వు గుర్తించేవరకూ మేము వేచి ఉండలేం. కానీ నువ్వా పని చేసి తీరాలి, భూమికి తిరిగి వెళ్ళి దాన్ని సమూరాకి లేదా అతని కుమార్తెకి ఇవ్వాలి! అర్థమైందా! ఇక వీళ్ళిద్దరూ…” అంటూ ఆఫ్రికన్ల మాదిరిగా కనబడుతున్న ఇద్దరు నల్లటి, పొడవైన తాంత్రికులను చూపించారు.

“ముగుంబ, బెనోత్‌మనే… వీళ్ళు మిమ్మల్ని కాపాడతారు, మీరు పారిపోకుండా అడ్డుకుంటారు. మీరు స్పేస్ షటిల్‌లో వెళ్ళి ట్రైటాన్ మీద దిగండి. ఆ అద్భుత వస్తువుని గుర్తించడానికి ప్రయత్నించండి. సమురా కోరుకునేది దొరికే సంభావ్యత ఉన్న నెప్ట్యూన్ యొక్క ఉపగ్రహం ఇది!”

“భూమికా?” అరిచాను. “సమూరా భూమి మీద ఏం చేస్తున్నాడు?”

వారు కొన్ని నిమిషాల పాటు నవ్వారు.

“అంతా అయిపోయింది హనీ! నెప్ట్యూన్‍కి మీ 15 సంవత్సరాల ప్రయాణంలో – సౌర వ్యవస్థని సమూరా పూర్తిగా జయించాడు. ఇప్పుడు సౌర వ్యవస్థ యొక్క గ్రహ కాలనీలన్నింటికి సమూరా చక్రవర్తి. అతను కుజుడిని జయించాడు. సౌరవ్యవస్థలో బాగా అభివృద్ధి చెందిన గ్రహాలైన భూమి, కుజుడు మధ్య తిరుగుతూ, అతనీ వ్యవస్థలను నియంత్రిస్తున్నాడు. వాస్తవానికి భూమిపైనా, కుజుడి మీద ఇంకా మానవులచే తరచుగా గెరిల్లా దాడులు కొనసాగుతున్నాయి, ఇప్పటికీ వ్యతిరేకత ఉంది, కానీ వాళ్ళని త్వరలో లోబరుచుకుంటాడు. ఇటువంటివన్నీ వెంటనే పూర్తిగా నియంత్రించబడతాయి. చివరి అద్భుత వస్తువుతో వాటిని పూర్తిగా అధిగమించడానికి నువ్వు సహాయం చేస్తావు” అన్నారు.

“అయ్యో. కుదరదు!” అని అరిచాను. నాతో పాటే స్పేస్ ప్లాట్‌ఫామ్‌పై దిగిన ప్రకృతి, డిమిట్రీ, ఏనిమోయిడ్ కూడా అరిచారు.

“వేరే మార్గం లేదు! హనీ! ఇది విధి! నువ్వు… నీలాంటి చాలా మంది ఎంపికైన వ్యక్తులతో వారికి సహాయం చేసి వాళ్ళిలా చేయడానికి మీరే దోహదపడ్డారు.

ఇక మేము బయలుదేరుతాం. ముగుంబ, బెనోత్‌మనే మీ వెంట ఉంటారు. సూర్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు! మేము వెళ్తున్నాం. ఆ వస్తువుని గుర్తించడాని గట్టిగా ప్రయత్నించండి! నీకు సమూరా నుండి పతకం, స్వేచ్ఛ లభిస్తాయి!”

అత్యంత శీతలంగా ఉన్న ఆ భయంకరమైననిశీధిలో స్పేస్‌ ప్లాట్‌ఫాంపై ఉన్న మరికొందరు అస్థిపంజర ఆకృతులతో కలిసిపోయారు వాళ్ళు.

గోడపై గడియారం నెప్ట్యూన్ సమయం ప్రకారం 6.30 గంటలు సూచిస్తోంది. బయటి ఉష్ణోగ్రత -220 డిగ్రీల సెల్సియస్, స్పేస్‌ ప్లాట్‌ఫాం లోప్ల 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్లు చూపిస్తోంది.

నేను ఇప్పటికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే, నల్లటి తాంత్రికులు ఇద్దరూ నన్ను ముందుకు తోశారు. “ఓ మానవా నడు! త్వరగా… మనం బయల్దేరాల్సిన సమయం వచ్చింది! మూడవ నెంబర్ గేట్ వైపు పద!” అన్నారు.

ఆ విధంగా మేము… భూమి నుంచి నమ్మశక్యం కాని దూరంలో ఉన్న ట్రైటాన్‌పై శీతల నిశీధిలో ముందుకు నడిచాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here