భూమి నుంచి ప్లూటో దాకా… -17

0
3

అధ్యాయం 48: పలాయనం

నెప్ట్యూన్-ప్లూటో ఆర్బిటల్ స్పేస్ ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్ళటానికి మాకు అనేక పద్ధతులు ఉన్నాయి. అదృశ్యంగానో లేదా సూక్ష్మరూపంలోనో వెళ్ళచ్చు లేదా నాతో పాటు ఉన్న భద్రతా సిబ్బంది సాయంతో ఓ స్పేస్ షటిల్‌ను హైజాక్ చేయచ్చు.

తుపాకీ కాల్పులు జరిపితే మేం బయటపడిపోతాం, నెమ్మదిగా వార్తలు కమాండ్ పోస్ట్ చేరిపోతాయి. నేను భూమికి చేరుకునే వరకు, ఎర్త్ కౌన్సిల్ రహస్య ప్రతిఘటన బృందాలను కలుసుకునే వరకు నేను జాగ్రత్తగా ఉండాలి.

“మనం కొన్ని గంటలపాటు అదృశ్యరూపంలో ఉందాం. మానవ గార్డులు అక్కడున్న సిబ్బంది దృష్టి మళ్ళిస్తారు, అందుబాటులో ఉన్న మొదటి అంతరిక్ష నౌకలో ప్రయాణం చేస్తారు” అన్నాను.

“ఎలా యురేకస్ సంగతి ఏంటి?” అడిగింది డిమిట్రీ.

“యురేకస్, నిన్ను నువ్వు ఫోటో రెపెల్లెంట్‌గా మార్చుకో, అదృశ్యంగా ఉండు!” అన్నాను

“సరే మాస్టర్. కానీ ఎనిమిది గంటలే అలా ఉండగలను!”

నేను యురేకస్‌కి ఒక ప్రణాళిక చెప్పాను.

మేము స్పేస్‌పోర్ట్ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నప్పుడు, మా మనస్సులను కేంద్రీకరించడం ద్వారా మేము అదృశ్యమవుతాము. అయినా అక్కడ మాంత్రిక సిబ్బంది ఉంటే మా నుంచి వెలువడే వికిరణాలను గుర్తించి, మమ్మల్ని పట్టుకునే ప్రమాదం ఉంది. వారు మమ్మల్ని ఇబ్బంది పెటినట్లయితే, మాతో ఉన్న ట్రైటాన్ గార్డులు వాళ్ళని కాల్చేయ్యాలి. అవసరమైతే విశ్వశక్తిని ఉపయోగించి ఆర్బిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్ళడానికి ఒక స్పేస్ షటిల్ పట్టుకోవాలి.

ఇది ఇలా ఉంటే, తిరుగుబాటు వార్త ఇంకా స్పేస్‌డ్రోమ్‌కి చేరుకోలేదు. మేము అదృశ్యరూపంలో లోపలికి ప్రవేశించగలిగాము. అక్కడున్న ఇద్దరు మాంత్రిక సిబ్బంది మా శరీర వికిరణాలని గమనించలేదు.

మేము డిస్‌ప్లే బోర్డు దిశగా పరిగెత్తాం. “గేట్ 3కి పదండి, షటిల్ త్వరలో బయల్దేరనుంది” చెప్పాను.

మేమూ, ఇంకా అంకిత భావంతో మా వెంటే ఉన్న ట్రైటాన్ గార్డులు మూడవ నెంబరు గేటు వద్దకు వెళ్ళాము.

టిక్కెట్లు కొనడానికి డబ్బు లేదు.

మేము గేట్ 3 లోకి ప్రవేశించాము.ఇది సాధారణమైన, సరళమైన పద్ధతిలో తలుపులు బద్దలు కొట్టడం, హైజాక్ చేయడం.

షటిల్ దాదాపుగా ఖాళీగా ఉంది. ఒక వృద్ధ మాంత్రిక జంట, ఓ మంత్రగత్తె, ఇంకా ఇద్దరు మధ్య వయస్కులైన హ్యుమనాయిడ్లు తలపై యాంటెనాలతో చూడ్డానికి గ్రహాంతరవాసుల వలె ఉన్నారు.

గేటుకీపర్లు టిక్కెట్లు, బోర్డింగ్ పాస్‌లు అడిగితే ట్రైటాన్ గార్డులు వాళ్లని కాల్చేసారు. మేమంతా షటిల్ లోపలికి నడిచాం. మేం క్యాబిన్‌కి చేరుకునేసరికి, స్పేస్‌డ్రోమ్‌లో లైట్లు వెలిగాయి, సైరన్లు మ్రోగాయి.

నేను నా మామూలు రూపానికి వచ్చేశాను.

“ఇప్పుడు మనలో వ్యోమగామి ఎవరు? మనల్ని తీసుకెళ్ళి కక్ష్యలో ఉన్న స్పేస్ ప్లాట్‌ఫామ్‌కి డాకింగ్ ఎవరు చేస్తారు?”

“ఎవరు లేరు”

“లేదు, నాకు డాకింగ్ తెలియదు” గొణుగుతూ అన్నాడు ఏనిమాయిడ్.

“అయితే క్యాబిన్లోకి పరిగెత్తండి! అక్కడి వారిని బెదిరించండి, షటిల్‌ని నడపాల్సిందిగా ఒత్తిడి చేయాలి!” అన్నాను.

మేము లోగొంతుతో మాట్లాడుకున్నాం. ముందరి ఇంజన్ ఉన్న గదిలోకి నడిచాం. అక్కడ నలుగురు నావిగేటర్లు – ఇద్దరు చైనీస్ ఇద్దరు ఆఫ్రికన్ మాంత్రికులు – పొడవాటి జుట్టు, పెద్ద గడ్డాలతో నల్లటి దుస్తుల ధరించి ఉన్నారు.

restez sans movement” అంటూ ఓ మంత్రాన్ని ఉచ్చరించాను.

“కదలద్దు! మీ మనస్సులు నా నియంత్రణలో ఉన్నాయి” అన్నాను.

వారు భయపడుతూ చూశారు! డిమిట్రీ, ప్రకృతి వారివైపు సమ్మోహనంగా చూశారు.

“ఇప్పుడు నెప్ట్యూన్-ప్లూటో స్పేస్ ప్లాట్‌ఫామ్‌కి తీసుకెళ్ళండి! ఇది హైజాక్. తీసుకెళ్ళకపోతే, నేను దీన్నీ, తరువాత మొత్తం స్పేస్‌డ్రోమ్‌ని పేల్చేస్తాను” అన్నాను.

మొదట వారి భాష ‘మాండరిన్’లోనూ, తర్వాత ఆంగ్లంలో మాట్లాడారు.

“వద్దు! వద్దు! మేము మీ మాటకి కట్టుబడి ఉంటాం! ఇంజన్ ఆన్ చేసి, అన్ని కంట్రోల్స్‌ని తనిఖీ చేయడానికి మాకు కాస్త సమయం ఇవ్వండి” అన్నారు వాళ్ళు.

“అన్నీ సరిగ్గా చేయండి. లేదంటే అందరం చస్తాం! మీరు విధేయత చూపకపోతే మిమ్మల్ని చంపడానికి కూడా వెనుకాడను!” అంటూ నేను ఎరుపు లేజర్‌తో గాలిలో ఆంగ్లంలో అక్షరాలను వ్రాశాను.

“DANGER IF YOU DO NOT OBEY!”

“మాకర్థమైంది” చెప్పారు ఆఫ్రికన్లు.

“మేము కూడా 100 నక్షత్రాల స్థాయి తాంత్రికులమే! తొందపడి ఏ దురుసు పని చేయకండి. ప్రశాంతంగా కూర్చోండి! మనం త్వరలో బయల్దేరుదాం!” అన్నారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here