Site icon Sanchika

‘భూతాల బంగ్లా’ – కొత్త ధారావాహిక – ప్రకటన

[dropcap]సీ[/dropcap]నియర్ రచయిత డా. నాగేశ్వరరావు బెల్లంకొండ రచించిన ‘భూతాల బంగ్లా’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.

***

దూరంగా నక్కలు ఊళ వేస్తున్నాయి, రివ్వున తాకింది రాజేంద్రను చల్లగాలి. అప్పుడు సమయం పదకొండు గంటలు.

భూతాల బంగ్లాకు చేరువగా వెళ్ళే అడ్డదారిలో వెళుతూ ఒక పెద్ద చెట్టుకింద నిలబడి సిగరెట్ ముట్టించాడు.

తనకు కొంత దూరంలో తెల్లచీర ధరించి జుట్టు విరబోసుకుని ఉన్న యువతి క్షణకాలం ఆగి రాజేంద్రను చూసి నడుచుకుంటూ చెట్ల సమూహంలోకి వెళ్ళిపోయింది.

ఆమెను చూసి ఆశ్చర్యపోయిన రాజేంద్ర ఆమెను వెంబడించి వీడియో తీయాలి అనుకుని ముందుకు కదలబోయాడు.

అప్పటికే అతను నిలబడి ఉన్న చెట్టు పైనుండి అతని గొంతుకు ఉరితాడు పడటం, క్షణాలలో గాలిలో వేళ్ళడుతూ గిలగిలలాడుతూ రాజేంద్ర ప్రాణాలు అనంతవాయువులలో కలసిపోయాయి.

***

ఈ సరికొత్త ధారావాహిక… సంచికలో… వచ్చే వారం నుంచి.

Exit mobile version