Site icon Sanchika

భూతాల బంగ్లా-1

[box type=’note’ fontsize=’16’] ‘భూతాల బంగ్లా’ అనే నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[dropcap]చె[/dropcap]న్నయ్ నగర శివారు ప్రాంతం అమ్జికరై. సమయం రాత్రి పది గంటలు.

స్ధానిక కల్యాణ మంటపంలో వివాహం జరిగింది. బంధుమిత్రులు అందరూ భోజనానంతరం ఎక్కడవాళ్ళు అక్కడకు వెళ్ళిపోయారు. వధూవరులు, ఊరిలోని బంధువర్గం, ఇరుగు పొరుగు వారలను ఎక్కించుకున్న బస్ వెళ్ళిపోయింది. చివరిగా మిగిలిన నాలుగు జంటలు తమ టూవీలర్‌పై ఊరికి బయలుదేరారు. వాళ్ళ వాహనాలు సరిగ్గా భూతాల బంగ్లా చేరువకు వచ్చేసరికి రోడ్డుకు ఇరువైపులా ఉండే చెట్ల చాటునుండి రోడ్డుపైకి రెండు అస్ధిపంజరాలు వచ్చి నిలబడ్డాయి. ఫర్లాంగు దూరంలో టూవీలర్ హెడ్ లైట్ కాంతిలో అస్ధిపంజరాలను చూస్తూనే భయంతో తమ వాహనాలను వేగంగా వచ్చిన దారినే వెళ్ళడానికి వెనుతిరిగారు. అక్కడ రోడ్డుపై కొంతదూరంలో కనిపించిన దృశ్యం చూస్తూనే వాహానాలపైన ఆడవారు కెవ్వుమన్నారు మగవాళ్ళకు తాగిన మందు కిక్కు దిగిపోయి గొంతులో తడారిపోయింది. అక్కడ…. రోడ్డు మధ్యలో తెల్లచీర కట్టుకుని జుట్టు విరబోసుకుని భూమికి రెండు అడుగుల ఎత్తులో గాలిలో తేలుతూ, బ్రతికి ఉన్న కోడి గొంతుక పళ్ళతో పట్టి ఉంది ఒక యువతి. అదిరిపడుతూ వెనుతిరిగి చూసారు అప్పటివరకు అక్కడ ఉన్న రెండు అస్ధిపంజరాలు కనిపించక పోవడంతో వేగంగా తమ వాహనాలను తమ ఊరి దిశగా నడుపుకుంటూ ఊరు చేరిందాకా వాళ్ళు వెనుతిరిగి చూడలేదు.

(ఈ బంగ్లాని స్ధానికులు భూతాల బంగ్లా – దెయ్యల బంగ్లా – భూతాల మేడ – దెయ్యాల మేడ వంటి పలు పేర్లతో పిలుస్తుంటారు.) సహజంగా రాత్రులు ఎవ్వరూ ఆ రోడ్డులో భయంతో ప్రయాణం చేయరు. ఈ బంగ్లాకి కిలోమీటర్ దూరంలో స్మశానం ఉండటంతో సహజంగా భయం ఏర్పడింది అక్కడి ప్రజలలో.

ఆ బంగ్లాలో ఎప్పుడో మహరాజా వారు నివాసం ఉండేవారట, కాని ఈ దెయ్యాల గోల గత రెండు సంవత్సరాలుగా మెదలయింది. ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో రాత్రులు ఆ రోడ్డుపై ఎన్నో రకాలుగా జరిగాయి. ఈ భూతాల బంగ్లా గురించి ఆ జిల్లా వాసులంతా కథలు కథలుగా చెప్పుకుంటారు.

మూడు సంవత్సరాలుగా ఉద్యోగరీత్యా విదేశాలలో ఉన్న రాజేంద్ర ఆ రోజే చెన్నయ్ రావడంతో తన మిత్రులకు ఫోన్ చేసి రాత్రికి బార్‌కు రమ్మని చెప్పాడు. ఆదే రోజు రాత్రి బార్‌లో సుందరం, గణేషన్, షణ్ముఖం, రాజేంద్ర కూర్చుని మందు తాగుతూ ఉన్నారు. మాట సందర్బంగా భూతాల బంగ్లా ప్రస్తావన వచ్చింది. మిత్రులు అందరూ ఆ బంగ్లా గురించి విన్న కథలు వెల్లడించారు.

“రేయ్ నోరు ముయ్యండిరా. ఈ రోజుల్లో కూడా దెయ్యాలు, భూతాలు ఏంటిరా? చదువుకున్న మూర్ఖులారా, మిమ్మల్ని నమ్మించడానికి రేపు రాత్రి నేను ఒక్కడినే ఆ భూతాల బంగ్లా దగ్గరకు వెళ్ళి ఆ బంగ్లాని వీడియో తీసుకువస్తా. అప్పుడు అయినా మీరు మారతారు అనుకుంటా” అన్నాడు రాజేంద్ర.

రాజేంద్ర ధైర్యవంతుడు, మొండివాడు కావడంతో అతనితో వాదులాడటానికి, సలహా ఇవ్వడానికి అతని మిత్రులు ఎవ్వరూ సాహసించలేదు.

అంతలోకే వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో అంతా ఆహారం తీసుకోవడంలో మునిగిపోయారు. ఆ రోజు అయిన బిల్లు చెల్లించిన రాజేంద్ర, వంద రూపాయాలు బేరర్‌కు టిప్పు ఇస్తూ బార్ వెలుపలకు దారి తీసాడు. మిత్రులు అతనిని అనుసరించారు.

మరుదినం మరలా మిత్రులతో కలసి మందు తాగిన భోజనం చేసిన రాజేంద్ర “మిమ్మల్నేకాదు, ఈ భూతాలు, దెయ్యాల కథలు చెప్పేవారందరిని మార్చడానికే నేను ఈ రోజు భూతాల బంగ్లాకు వెళుతున్నా” అని వారి సమాధానం కొరకు ఎదురు చూడకుండా బిల్లు చెల్లించి తన టూవీలర్‌పై అక్కడకు చేరువలోని భూతాల బంగ్లాకు బయలు దేరాడు. రోడు పక్కగా చెట్టు చాటున వాహనం నడిపి, సెల్ ఫోన్ లోని లైట్ సహాయంతో భూతాల బంగ్లాకు దారితీసాడు.

దూరంగా నక్కలు ఊళ వేస్తున్నాయి, రివ్వున తాకింది రాజేంద్రను చల్లగాలి. అప్పుడు సమయం పదకొండు గంటలు. భూతాల బంగ్లాకు చేరువగా వెళ్ళే అడ్డదారిలో వెళుతూ ఒక పెద్ద చెట్టు కింద నిలబడి సిగరెట్ ముట్టించాడు. తనకు కొంత దూరంలో తెల్లచీర ధరించి జుట్టు విరబోసుకుని ఉన్నయువతి క్షణకాలం ఆగి రాజేంద్రను చూసి నడుచుకుంటూ చెట్ల సమూహంలోకి వెళ్ళిపోయింది. ఆమెను చూసి ఆశ్చర్యపోయిన రాజేంద్ర ఆమెను వెంబడించి వీడియో తీయాలి అనుకుని ముందుకు కదలబోయాడు. అప్పటికే అతను నిలబడి ఉన్న చెట్టు పైనుండి అతని గొంతుకు ఉరితాడు పడటంతో, క్షణాలలో గాలిలో వేళ్ళడుతూ గిలగిలలాడిన రాజేంద్ర ప్రాణాలు అనంతవాయువులలో కలసిపోయాయి.

మరుదినం స్ధానిక మీడియాలో రాజేంద్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని రాసాయి. పోలీసులు కూడా అలానే రాసి కేస్ మూసివేసారు. ఈ విషయంపై ఏమి మాట్లాడినా పోలీసులు, కోర్టుల చుట్టు తిరగవలసి వస్తుందని భయంతో తేలు కుట్టిన దొంగల్లా, రాజేంద్ర మిత్రులు మౌనంగా ఉండి పోయారు.

మరో వారం రోజుల అనంతరం…..

శివకుమార్ తన మిత్రుడు వాళ్ళ ఊరివాడు అయిన మధుతో కలసి కాలేజి ముగిసాక సాయంత్రం తన కాలేజి స్నేహితులతో కాలక్షేపం చేసిన అనంతరం, అమ్జికరై లోని థియోటర్‌లో తమ అభిమాన నటుడు రజినీకాంత్ సినిమా రాత్రి (7 గంటల) షో చూసి, రోడ్డు పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు వెళ్ళి తమకు ఇష్టమైన కిచిడి, కబాబ్, పరోటా పాయా తిని రాత్రి పది గంటలకు తమ ఊరికి టూవీలర్‌పై బయలుదేరారు. అక్కడికి పదిహేడు కిలోమీటర్ల దూరం ఉంది వాళ్ళ ఊరు. ఆ దారి దెయ్యాల బంగ్లా పక్కగా వెళుతుంది. ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికి అదే దారి. చూట్టూ తిరిగి వెళ్ళాలంటే మరో పదిహేను కిలోమీటర్లు దూరం పెరుగుతుంది. అందుకని అంతా చీకటి పడకముందే ఆ మార్గంలో ప్రయాణం చేస్తారు. రాత్రి సమయంలో ఎవ్వరూ ఆ మార్గం లోనికి రారు. అత్యవసరమైన వైద్యసేవలకు గుంపుగా వెళతారు. ఇప్పుడు అంతటా అంబులెన్స్ సౌకర్యం అందుబాటులోనికి వచ్చింది కనుక రాత్రులు ప్రయాణం సులభం అయింది.

అక్కడ ప్రజలకు భయం కలిగించే సంఘటనలు ఎన్నో ఆ దెయ్యాల బంగ్లా వద్ద రెండు సంవత్సరాలుగా జరిగినందున అందరికి భయం. కనీసం పోలీసు వారు కూడా పెట్రోలింగ్ చేయడానికి ఆ దారిన రారు. ఆ మార్గంలో క్రైమ్ రేటు చాలా తక్కువ.

వీళ్ళు యువకులు చదువుకున్నవాళ్ళు ధైర్యవంతులు కనుక భయపడకుండా ఆ మార్గంలో ప్రయాణం చేయసాగారు. వాళ్ళు ప్రయాణం చేస్తున్న టూవీలర్ దెయ్యాల బంగ్లా చేరువక రావడంతో అక్కడ పొదల మాటునుండి తెల్లని వస్త్రాలు ధరించిన యువతి వేళ్ళకేసి వస్తూ కనిపించింది. అదిరిపడిన శివకుమార్ తన బండి వేగం పెంచాడు. ఇంతలో దెయ్యాల బంగ్లా పైభాగాన వెలుతురులో రెండు అస్ధిపంజరాలు, శివకుమార్, మధులను ఈల వేసి చప్పట్లు కొడుతూ రమ్మని పిలుస్తున్నాయి. అది చూసిన మిత్రులు భయంతో బిగుసుకుపోయారు. వేగంగా బండి నడుపుకుంటూ వెనుతిరిగి చూడకుండా తమ ఊరు దిశగా వెళ్ళిపోయారు.

అలా దెయ్యాల బంగ్లా గురించి చెప్పుకునే కథలలో ఈ రోజు మరో కథ కొత్తగా చేరింది. తెల్లవారుతూనే పరిసర గ్రామలలోని పరిచయస్థులు, మిత్రులకు అందరికి రాత్రి జరిగిన తమ అనుభవాన్ని తమ మొబైల్ ద్వారా అందరికి తెలియజేసారు శివకుమార్, మధులు.

వారే కాదు, వారు చెప్పిన ఆ కథ విన్నవారు తమ జీవితంలో ఎన్నడూ ఆ దెయ్యాల బంగ్లా పరిసరాలకు రాత్రి సమయంలో పోరాదు అని నిర్ణయించుకున్నారు.

ఇలా గత రెండేళ్ళుగా ప్రజలను భయభ్రాంతులను చేసే సంఘటనలు ఎన్నో ఆ భూతాల బంగ్లా పరిసరాలలో జరిగాయి.

***

చెన్నయ్‌లో పేరు పొందిన మానసిక వైద్యుడు శంకరలింగం. ఆయనను కలిసిన మోహనరావు “అయ్యా మావాడి పేరు రవి. డిగ్రీ చదువుతున్నాడు, ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నాడు. రాత్రులు ఒంటరిగా పడుకోలేక పోతున్నాడు. అసలు ఈ భయం ఎందుకు మనుషులకు కలుగుతుందో క్లుప్తంగా చెప్పండి” అన్నాడు.

ఆ యువకుని పరీక్షించిన శంకరలింగం “భయపడ వలసిన పనిలేదు. భయం అనేది ఒక వింత అనుభూతి, భయం మన అందరికి సుపరిచరితమే! నవరసాల్లో భయానక రసం ఒకటి.

ప్రతి ప్రాణికి మన అందరికి ఇది అనుభవమే. కొందరికి పాములు, కొందరికి సాలీళ్లను చూస్తే భయం, కొందరికి కొన్ని ఆకారాలను చూస్తే భయం. మరికొందరికి బొద్దింక, హారర్ సినిమాలంటే భయం. విషయం ఏదైనా కావచ్చు. కానీ ఫలితం మాత్రం ఒక్కటే.. ‘భయం’!

విదేశాల్లో భయపడటం కోసమే హాలోవీన్ పండగ చేసుకుంటారు. ఆ రోజు భయాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. భయపడటం వెనుక కూడా సైన్స్ ఉంది. మన భద్రతకు ఢోకా లేనంతవరకూ భయాన్ని బాగానే ఎంజాయ్ చేస్తాం.

ఎంత భయం ఉన్నా, హారర్ సినిమాలను మాత్రం వదలం. ఆ కలవరపాట్లు, ఉలికిపాట్లను అనుభవిస్తూనే సినిమాలు చూస్తాం. ఆనందిస్తాం కాని అది నిజజీవితంలో అనుభవానికి వస్తే తడబడతాం!

పెద్దవాళ్ళు కంటే పిల్లల్లో Teraphobia మరింత ఎక్కువగా ఉంటుంది

Teraphobia (భూతాల భయం) ప్రీ-స్కూల్ వయస్కుల్లో చాలా సాధారణం. ఇది ప్రారంభ ప్రాథమిక సంవత్సరాల్లో సాధారణంగా తగ్గుతుంది. పిల్లవాడు మిడిల్ స్కూల్‌లో చేరే సమయానికి కూడా ఉంటే, అది అత్యంత అసాధారణమైనది. టీనేజ్ మరియు పెద్దలలో, భూతాల భయం అనేది అరుదైనది కాని శక్తివంతంగా పరిమితమైన భయం.

చిన్నారులలో Teraphobia:

భయాలు చిన్ననాటి ఎదుగుదలలో సాధారణమైనవి, ఆరోగ్యకరమైన భాగం.

అవి పిల్లలకి వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మరియు జీవితకాలం అంతా Coping నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చేస్తాయి. ఈ కారణంగా, ఆరునెలల కంటే ఎక్కువ, 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో సాధారణంగా భయాలు ఉంటాయి.

ట్రిగ్గర్లు:

పిల్లలలో, భూతాల భయం తరచూ ఒక అసంకల్పితమైన రూపాన్ని తీసుకుంటుంది. ఫ్రాంకెన్స్టైయిన్, డ్రాకులా లేదా గాడ్జిల్లాకు భయపడటం కంటే, ‘ఒక రాక్షసుడు’ (Monster) తన మంచం కింద లేదా తన గదిలో నివసిస్తున్నాడని భయపడతారు. ఏమైనప్పటికీ, రాక్షసుడి చిత్రాన్ని చిత్రించమని పిల్లలని అడగడం పర్యావరణ ట్రిగ్గర్‌కు ఆధారాలను అందిస్తుంది. కొన్ని డ్రాయింగ్లు టీవీ కార్టూన్ పాత్ర, సాయంత్రం వార్తల్లో లేదా చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా ‘గగుర్పాటు’గా సూచించే ఒక కిడ్నాపర్ పాత్రను పోలివుంటాయి. ఈ సందర్భాలలో, పిల్లలలో బహిర్గత, పరిమిత భయాన్ని తగ్గించుటకు సహాయపడవచ్చు.

చిల్డ్రన్ ఇన్ చిల్డ్రన్:

కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ భయంతో పోరాడటానికి ‘monster spray’ను ఉపయోగిస్తారు. ఒక స్ప్రే బాటిల్‌ని ఉపయోగించుకోవచ్చు – పాక్షికంగా నిండిన రంగు నీరు లేదా ఒక తైలమర్ధనంతో నింపాలి – దాన్ని రాత్రిపూట మంచం కింద లేదా మీ పిల్లల రాక్షసుడు దాగి ఉండవచ్చని భావించే ఎక్కడైనా ఉంచాలి. గదిలో పిచికారీ చేయాలి. పిల్లలకి హాని కలిగించే లేదా ఫాబ్రిక్స్ లేదా పెయింట్‌కు నష్టం కలిగించే ఏదైనా ఉపయోగించకూడదని నిర్ధారించుకోవాలి.

పిల్లల నరాలను శాంతింపచేయడానికి నిద్రపోయే సమయంలో నిత్యకృత్యాలను ప్రోత్సహించాలి. వెచ్చని స్నానం, ఒక గ్లాస్ నీరు, ఒక నిద్రవేళ కథ. మెత్తగా పాడిన పాట – నిద్ర వాతావరణాన్ని ప్రోత్సహిస్తాయి. పిల్లల చీకటికి భయపడినట్లయితే, వీటిని రాత్రిపూట ఉపయోగించాలి. కుటుంబ పెంపుడు జంతువుతో నిద్రించడం కూడా రక్షణను కలిగిస్తుంది.

‘ధైర్య’ ప్రవర్తనకు బహుమతినివ్వాలి. కొంతమంది పిల్లలు తమ దృష్టిని ఆకర్షించడానికి శ్రద్ధగా ప్రవర్తిస్తారు, కాబట్టి పెద్దలు తమ ఆలోచనలను మళ్లీ చెప్పాలి. క్లుప్తంగా ‘రాక్షసుడు’కి చెక్ పెట్టేలా ధైర్యం ఇవ్వాలి, ఆ తరువాత గదిలోంచి బయటకు వచ్చేయాలి. బాల/బాలుడు తన గదిలోకి పిలవకుండానే రాత్రులు ట్రాక్ చేయడానికి వారి పక్కన స్టిక్కర్లు లేదా ఇతర గుర్తులను ఉపయోగించాలి. ఒక వారం స్టిక్కర్లు విలువైనవి సేకరించినప్పుడు, పిల్లవాడికి ఒక ట్రిప్ లేదా కుకీల బ్యాచ్ వంటి ఇష్టమైన ట్రీట్ ఇవ్వవచ్చు.

పిల్లల భయం పట్ల ఎప్పుడూ నవ్వకూడదు, భయం కలిగి ఉండటాన్ని, భయం చెడు ప్రవర్తనను అడ్డుకోవటానికి లేదా అతనిని హేళన చేసేందుకు ముప్పుగా మారుతుంది. పిల్లల భావాలకు గౌరవం ఇవ్వడం సున్నితత్వం చూపుతుంది, అయితే అలా చేయడం తాము అందరికీ మంచివారని వారికి హామీ ఇస్తుంది.

టీన్స్, పెద్దలలో Teraphobia:

పెద్ద పిల్లలు మరియు పెద్దలలో, భూతాల భయం సాధారణంగా మరింత నిర్దిష్ట రూపాన్ని తీసుకుంటుంది. భయానక చలన చిత్రాలు అనేక స్వల్పకాలిక భయాలకు కారణమవుతాయి, ప్రత్యేకించి నిద్రించే ముందు చూసేవారిలో. ఈ భయాలు సాధారణంగా కొన్ని రాత్రులు మాత్రమే కొనసాగుతాయి. సున్నితమైన, హాస్య కార్యక్రమాలు చూడటం వంటి చర్యలను కొనసాగించడం ద్వారా ప్రశాంతంగా నిద్రపోతారు. భయం కొన్ని రాత్రులు కంటే ఎక్కువ ఉంటే, అది నిజమైన భయం యొక్క చిహ్నం కావచ్చు.

రాక్షసుడు మరింతగా, నిరంతరంగా ఉన్నట్లు అనిపిస్తే ఆ భయం మత లేదా సాంస్కృతిక భయాలలో మూలాలను కలిగి ఉండవచ్చు.

భయం సామాన్యంగా ఉండవచ్చు లేదా రక్త పిశాచులు, జాంబీస్, లేదా దయ్యాలు వంటి నిర్దిష్ట జీవి భయం కావచ్చు. మంత్రవిద్య భయం కొన్నిసార్లు భూతాల భయంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ భయాలు తరచూ మూఢనమ్మకాలు, అర్బన్ లెజెండ్స్, ఇంకా మత బోధనల కలయికపై ఆధారపడి ఉంటాయి.

చాలామంది ప్రజలకు జ్ఞానం శక్తి లాంటిది. భయభరితమైన భూతాల గురించి పురాతన, ఆధునిక పురాణాలను అధ్యయనం చేయడం, ముఖ్యంగా పురాణాల వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్రం, చిన్న భయాలను అడ్డుకోవటానికి తరచుగా సరిపోతుంది. మరింత తీవ్రమైన భయాల కోసం, వృత్తిపరమైన సహాయం అవసరం కావచ్చు.

ఒక చికిత్స చేయని రాక్షసుడి భయం కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. సామాజికంగా ఒంటరి అయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా యువకులకు! దీని వల్ల స్నేహితులు ఆ పిల్లవాడిని హాస్యమాడవచ్చు, ఎగతాళి చేయవచ్చు.

చాలామంది యువకులు ‘లెజెండ్ ట్రిప్స్’ ఆడుతారు, దీనిలో వారు సమీప బృందానికి సమీపంలోని అర్బన్ లెజెండ్స్‌ని ఎదుర్కొనేందుకు బృందంలోకి వెళతారు; భయానక చిత్రాలు, మారథాన్లు టీనేజ్ పిల్లల రాత్రి జీవితంలో ప్రధానమైనవి. పాల్గొనడానికి భయపడిన పిల్లలు అపహాస్యం చేయబడతారు, హేళనకి గురవుతారు.

పెద్దలు, టీన్స్ కోసం చికిత్స:

అదృష్టవశాత్తూ, అన్ని phobia లలో, monster phobia చికిత్సకు బాగా స్పందిస్తుంది. వారు తరచూ ఇతర భయాలపై ఆధారపడి ఉంటారు కాబట్టి, చికిత్స యొక్క ప్రాథమిక లక్ష్యాలపై నిర్ణయం తీసుకుంటారు వైద్యులు.

ఈ మందులు క్రమం తప్పకుండా వాడండి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి” అని మందులు రాసి ఇచ్చాడు.

మోహనరావు తన కుమారుడి ప్రవర్తన ప్రారంభ దశలోనే గమనించడం వలన తన బిడ్డ రవిని ఆరోగ్యంగా దక్కించుకున్నాడు. సంపాదనలో పడి తమ బిడ్డల ప్రవర్తన గమనించకుండా మత్తు మహమ్మారికి తమ సంతతిని  బలి పెట్టుకున్నవారు ఎందరో!

(సశేషం)

Exit mobile version