[box type=’note’ fontsize=’16’] ‘భూతాల బంగ్లా’ అనే నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]
[చెన్నై నగరంలో మాదకద్రవ్యాల రిటైల్ డీలర్లు ఇద్దరు ఒకేసారి మరణించడంతో, మాదకద్రవ్యాల రవాణా ఎక్కడి అక్కడ ఆగిపోతుంది. విషయం తెలుసుకున్న చిన్నడీలర్లు, రౌడీషీటర్లు, పేరు మోసిన గూండాలు తక్షణం నగరం వదిలి పారిపోతారు. నగరంలోని పోలీసు ఉన్నత అధికారులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో మాట్లాడుతూ భరత్ – మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు కేంద్రం తనను ప్రత్యేకాధికారిగా పంపిందని, తనకి వారందరి సహకారం కావాలని కోరుతాడు. గంజాయి, నల్లమందు, బ్రౌన్‌షుగర్, హెరాయిన్, కొకైన్, చెర్రస్‌తదితర మాదకద్రవ్యాలకు బానిసలై కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారనీ, వాళ్ళని కాపాడాలని చెబుతాడు. ఈ మత్తుపదార్థాలకి అసలు మూలం ఎక్కడో తెలుసుకోవాలనీ, దీనికి సూత్రధారి ఎవరు అన్నది తెలుసుకోగలిగితే సమాజాన్ని ఈ రుగ్మతనుండి కాపాడే ప్రయత్నం చేయవచ్చుననీ అంటాడు. గంజాయి సాగు ఎలా జరుగుతోందో, దానికి బానిసలైన యువత ప్రవర్తన ఎలా ఉంటుందో వివరిస్తాడు. దేశంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా చట్టం ఎలా ఏర్పడిందో వెల్లడిస్తాడు భరత్. ఇక చదవండి.]
[dropcap]”భా[/dropcap]రతదేశంలో కన్నబిస్ ధూమపానం కనీసం 2000 బిసి నుండే ప్రాచుర్యంలో ఉంది. మొట్టమొదటగా అథర్వణ వేదంలో ప్రస్తావించబడింది, ఇది క్రీ.పూ. కొన్ని వందల సంవత్సరాలకి చెందినది. భారతీయ హేమ్ప్ డ్రగ్స్ కమిషన్, 1893లో భారతదేశంలో భారత్-బ్రిటీష్ అధ్యయనం భారతదేశంలో గంజాయి వాడకం గురించి ‘మనస్సుపై ఎటువంటి హానికరమైన ప్రభావాలను ఉత్పత్తి చేస్తుంది’, ‘ఏ నైతిక గాయం ఏదీ కాదు’. వాటిపై అధ్యయనం చేసింది. హేమ్ప్ మత్తు పదార్థాల యొక్క ‘మితమైన’ ఉపయోగం ‘వాస్తవంగా ఎటువంటి చెడు ఫలితాలచే హాజరుకాలేదు’ అని కనుగొన్నారు. ఔషధం యొక్క ‘మితిమీరిన’ వినియోగంపై కమిషన్ – “ఇది కచ్చితంగా చాలా హానిగా అంగీకరించబడుతుంది, అయినప్పటికీ చాలా ఎక్కువ మంది వినియోగదారుల్లో గాయం లేదా నష్టం స్పష్టంగా గుర్తించబడదు” అని అంగీకరించారు. కమిషన్ యొక్క నివేదిక కనీసం 3,281 పేజీలు, సుమారు 1,200 ‘వైద్యులు, కూలీలు, యోగులు, ఫకీర్‍లు, వెర్రివాళ్ళ శరణాలయములు, భంగ్ రైతులు, పన్ను సంగ్రాహకులు, అక్రమ రవాణాదారులు, సైన్యం అధికారులు, జనపనార డీలర్లు, గంజా ప్యాలస్ ఆపరేటర్లు, మతాధికారులు’ యొక్క సాక్ష్యంతో సమర్పించింది. గంజాయి, దాని ఉత్పన్నాలు (గంజాయి, హషీష్/చరస్, భంగ) 1985 వరకు భారతదేశంలో చట్టబద్ధంగా విక్రయించబడ్డాయి, ప్రజలకు వినోదభరితమైన ఉపయోగం సాధారణమైంది. గంజాయి వినియోగం సాంఘికంగా దెబ్బతినే ప్రవర్తనగా చూడబడలేదు, మద్యం వినియోగం మాదిరిగానే ఉండేది. గంజ, చరస్‌లను పేదవాని యొక్క మత్తుపదార్థంగా ఎగువ తరగతి భారతీయులు భావిస్తారు. అయితే ధనవంతులు హోలీ సమయంలో మాత్రం భంగును సేవిస్తారు. 1961లో నార్కోటిక్ ఔషధాలపై సింగిల్ కన్వెన్షన్ దత్తత తీసుకున్న తరువాత యునైటెడ్ స్టేట్స్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని మాదకద్రవ్యాలపై ప్రచారం మొదలుపెట్టింది. ఏదేమైనా, భారతదేశం ఈ చర్యను వ్యతిరేకించింది, దాదాపు 25 సంవత్సరాల పాటు గంజాయిని చట్టవిరుద్ధం చేయడానికి అమెరికా ఒత్తిడిని తట్టుకుంది. 1980వ దశకంలో అమెరికన్ ఒత్తిడి పెరిగింది, 1985లో, రాజీవ్ గాంధీ ప్రభుత్వం భారతదేశంలో అన్ని మాదక ఔషధాలను నిషేధించి, ‘నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, 1985’ అనే చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ‘మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్ధాల చట్టం, 1985’ – ఇది భారతదేశం మొత్తంలో వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 14 నవంబర్ 1985న భారతదేశం గెజిట్లో దీనిని నోటిఫై చేసిన తర్వాత ఇది అమలులోకి వచ్చింది. చట్టం యొక్క సెక్షన్ 2 సందర్భంలో అవసరమయ్యేంత వరకు, దానిలో ఉపయోగించిన వివిధ పదాలను నిర్వచిస్తుంది. కొన్ని నిర్వచనాలు క్రింద ఇవ్వబడ్డాయి. చట్టంలో ఉపయోగించిన పదాలు, వ్యక్తీకరణలు, నిర్వచించబడలేదు, కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో నిర్వచించబడ్డాయి. “గంజాయి (హెంప్)” అనగా: (ఎ) చరస్, అనగా గాఢమైన తయారీ, రెసిన్ కలిగి ఉంటుంది, వేరుచేసిన రెసిన్, గంజాయి మొక్క నుండి పొందిన ముడి లేదా శుద్ధి చేయబడినా, ఏ రూపంలోనైనా, హాషీష్ చమురు లేదా ద్రవ గంజాయి అని పిలుస్తారు. (బి) గంజ, అంటే, గంజాయి మొక్క యొక్క పైన పుష్పించే లేదా ఫలాలు కాస్తాయి (విత్తనాలు, ఆకులు మినహాయించకపోతే పైవాటిని మినహాయించకూడదు), ఏ పేరుతో అయినా పిలుస్తారు లేదా కేటాయించ బడతాయి, (సి) గంజాయి పైన ఉన్న ఏవైనా తటస్థ పదార్ధాలతో లేదా ఏ మిశ్రమాన్ని అయినా అక్కడ తయారుచేసిన ఏదైనా పానీయం ‘గంజాయి మొక్క’ అంటే జాతి గంజాయి యొక్క ఏదైనా మొక్క. (బి) పాపవర్ నుండి నల్లమందు లేదా ఏ ఫెనన్ట్రెన్ ఆల్కాలియిడ్ను సంగ్రహించవచ్చునో దాని యొక్క ఇతర జాతుల మొక్క, ఇది కేంద్ర ప్రభుత్వం, అధికారిక గెజిట్లో నోటిఫికేషన్ ద్వారా, ఈ చట్టం యొక్క ప్రయోజనాల కోసం నల్లమందు గసగసాల అని ప్రకటించబడినది; ‘గసగసాల గడ్డి’ అంటే నల్లమందు గసగసాల అన్ని భాగాలు (అసలు విత్తనాలు మినహాయించి) అంటే వాటి అసలు రూప ‘నల్లమందు’ అంటే: (ఎ) నల్లమందు గసగసాల యొక్క గడ్డకట్టిన రసం, (బి) నల్లమందు గసగసాల యొక్క గడ్డకట్టిన రసం యొక్క ఏదైనా తటస్థ పదార్థంతో లేదా ఏదైనా మిశ్రమం, కానీ 0.2 శాతం కన్నా ఎక్కువ మోతాదులో ‘నల్లమందు ఉత్పన్నం’ అనగా: (ఎ) ఔషధ నల్లమందు, అనగా, ఔషధ వినియోగం కోసం ఇది అనుగుణంగా అవసరమైన పధ్ధతులు, ఇది భారత ఔషధరంగం యొక్క అవసరాలకు అనుగుణంగా లేదా ఈ తరపున కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయబడిన ఏవైనా ఇతర ఫార్మకోపోయియా, పొడి రూపంలో లేదా గ్రాన్యులేట్ లేదా తటస్థ పదార్థాలతో మిళితం లేదా కలిపినట్లయితే; (బి) నల్లమందు తయారుచేసిన, అనగా, నల్లమందు ఒక సారానికి అనువుగా రూపకల్పన చేసిన ఏదైనా వరుస పరికర్మములు (ఆపరేషన్ల) ద్వారా పొందిన నల్లమందు యొక్క ఏదైనా ఉత్పత్తి, ధూమపానం, నల్లమందు తర్వాత మిగిలిపోయిన మిగిలిన అవశేషాలు ధూమపానం చేయబడతాయి; (సి) ఫెనన్ట్రెన్ అల్కలాయిడ్లు, అవి, మోర్ఫిన్, కోడైన్, తెబైన్, వాటి లవణాలు; (డి) డైసిటైల్మోర్ఫిన్, అనగా ఆల్కలాయిడ్ డయా-మార్ఫిన్ లేదా హెరాయిన్, దాని లవణాలు అని కూడా పిలుస్తారు;, (ఇ) 0.2 శాతం కంటే ఎక్కువ ఉన్న అన్ని మత్తుమందు (మార్ఫిన్) లేదా ఏ డయాసిటిలర్మోరిన్ కలిగిన తయారీలు. ‘నల్లమందు గసగసాలు’ అనగా: (ఎ) పాపవర్ సోనిఫెరియం ఎల్ జాతులు; ఇవ్వన్ని వైద్యరీత్య వరాలైతే, మాదక ద్రవ్యాలుగా మానవాళికి శాపాలుగా మారాయి. మత్తు మందులు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగివున్నవారు చట్టపరంగా కఠినంగా శిక్షార్హులు. ఇలాంటి వ్యసనపరుల్ని మళ్ళీ మామూలు మనుషుల్ని చేడడం చాలా కష్టమైన పని. వీరిని డ్రగ్ అడిక్షన్ కేంద్రాలు, మానసిక వైద్యుల ద్వారా చికిత్స చేసి కాపాడవచ్చును.
ఈ డ్రగ్స్ ప్రధానంగా నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్ధపైన చాలా ప్రభావం చూపుతాయి. ఇది మాదకద్రవ్యాల వలన తలెత్తే తక్షణ దుష్ప్రభావం. వీటిని వాడుతుండే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్ధలపైనా దారుణమైన అనారోగ్యానికి శరీరం లోనౌతుంది. ప్రధానంగా జరిగే అనర్థాలు ఇవి:
- రోగనిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది.
- జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతిని, శరీరం శుష్కించిపోతుంది.
- కాలేయంపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి, చివరకు అది పూర్తిగా పనిచేయని స్థితి ఏర్పడుతుంది.
- ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది.
- గుండె వేగంలో అవాంఛనీయమైన మార్పులు తలెత్తుతాయి.
- రక్తనాళాలు కుంచించుకుపోయి, రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి.
- గుండె పనితీరు దెబ్బతిని, అకస్మాత్తుగా ఆగిపోయే పరిస్థితి తలెత్తుతుంది.
- జ్ఞాపకశక్తి క్షీణించడంతో పాటు ఏకాగ్రత లోపిస్తుంది.
- మెదడు దెబ్బతిని మూర్ఛ, పక్షవాతం వంటి పరిస్థితులు తలెత్తుతాయి.
- ఎదురుగా ఏం జరుగుతోందో అర్థంచేసుకోలేని గందరగోళం ఏర్పడుతుంది.
పరిస్థితులను గ్రహించి వాటికి అనుగుణంగా స్పందించే శక్తి నశిస్తుంది. మాదకద్రవ్యాల వాడకం వేలాది సంవత్సరాలుగా మనుషులకు తెలుసు. ఆదిమ మతాలకు చెందిన వారు మాదకతను కలిగించే గంజాయి వంటి ఆకులను, ఆకుల పసర్లను, కొన్ని రకాల మొక్కల నుంచి దొరికే గింజలను వాడేవాళ్లు. వీటిని వాడితే విచిత్రమైన తన్మయావస్థ, లేనిపోని భ్రాంతులు కలుగుతాయి. ఆదిమ మతాలకు చెందిన వారు ఇలాంటి అనుభూతినే దివ్యానుభూతిగా, ఇదంతా దైవానికి సన్నిహితం చేసే ప్రక్రియగా అపోహ పడేవారు.
పాతరాతి యుగంలోనే – అంటే, దాదాపు అరవైవేల ఏళ్ల కిందటే మనుషులు మత్తును మరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది నాటికి ఈజిప్టు, భారత్ ప్రాంతాల్లో మత్తునిచ్చే సోమరసం, దాదాపు అలాంటిదే అయిన ‘హవోమా’ వంటి మాదక పానీయాలను మతపరమైన వేడుకల్లో ‘దివ్యానుభూతి’ కోసం విరివిగా వాడేవారు.
క్రీస్తుపూర్వం 2700 నాటికి మనుషులు గంజాయిని కనుగొన్నారు. ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా దొరికేది. గంజాయి ఆకులను ఎండబెట్టి, మట్టితో తయారు చేసిన చిలుంలో వేసి, వాటిని కాల్చి, దాని పొగను పీల్చేవారు. ఈజిప్టు, పర్షియా, ఆఫ్రికా, భారత ఉపఖండం, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఆ కాలంలోనే గంజాయి వాడకం ఉండేది. భారత ఉపఖండంలోనైతే, గంజాయి పొగ పీల్చడంతో పాటు, పచ్చి గంజాయి ఆకులను నూరి తయారు చేసిన ‘భంగు’ను పానీయాల్లో కలిపి సేవించే పద్ధతి కూడా ఉంది.
గంజాయిని కనుగొన్న కాలంలోనే ఉమ్మెత్త మొక్కల వేర్లను, ‘రుబార్బ్’ మొక్కల వేర్లను కూడా మాదకద్రవ్యాలు వాడటం మొదలైంది. క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటికి నల్లమందు వాడకం మొదలైంది. క్రీస్తుశకం పదహారో శతాబ్దిలో కోకా ఆకులను మాదకద్రవ్యంగా కనుగొన్నారు. కోకా ఆకుల నుంచే ‘కొకైన్’ తయారు చేస్తారు. చాలావరకు ఆధునిక మాదకద్రవ్యాలకు ప్రాచీన కాలంలోనే కనుగొన్న గంజాయి, నల్లమందు, ఉమ్మెత్త వంటి మొక్కలే మూలం.
డ్రగ్స్‌లో కొన్నింటిని ముక్కుతో పీలుస్తారు. కొన్నింటిని సిగరెట్ లేదా చిలుంలో చింపుకుని పొగ తాగుతారు. కొన్నింటిని శీతల పానీయాలు లేదా మద్యంలో చల్లుకుని, తాగుతారు. ఇవి కాకుండా మాత్రల రూపంలో, ఇంజెక్షన్ల రూపంలో దొరికే మాదకద్రవ్యాలూ ఉన్నాయి. వైద్యచికిత్స ప్రయోజనాల కోసం ఉపయోగించే కొన్ని మాత్రలు, ఇంజెక్షన్లను కొందరు మత్తులో మునిగితేలడం కోసం యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు. గంజాయి, నల్లమందుతో పాటు కొకైన్, మార్ఫిన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ (లైసెర్జిక్‌యాసిడ్‌డైఈథాలమైడ్), బ్రౌన్‌సుగర్, ఎండీఎంఏ (మీథైల్‌ఎనడయాక్సీ–మెథాంఫెటామైన్) వంటి డ్రగ్స్ ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడుకలో ఉన్నాయి. వీటిపై ఎన్ని ఆంక్షలు, నిషేధాలు ఉన్నా ఇవి అంతకంతకూ విస్తరిస్తూనే ఉన్నాయి. మనదేశంలోనూ ఇవి తరచుగా పోలీసు దాడుల్లో పట్టుబడుతూనే ఉన్నాయి.
వైద్యశాస్త్రం ఆధునికతను సంతరించుకున్న తొలినాళ్లలో మార్ఫిన్, కొకైన్, హెరాయిన్‌వంటి మాదకద్రవ్యాలను నొప్పినివారిణులుగా వాడేవారు. వీటిని వైద్యులే రోగులకు సూచించేవారు. అప్పటి పత్రికల్లో హెరాయిన్, కొకైన్‌ల ప్రకటనలు కూడా వచ్చేవి. శస్త్రచికిత్సలు జరిగిన రోగులకు, తీవ్రమైన గాయాలకు లోనై ఇన్ఫెక్షన్లు, నొప్పులతో బాధపడేవారికి మార్ఫిన్ ఇచ్చేవారు. మార్ఫిన్ ఎంతటి నొప్పినైనా మరిపిస్తుంది గాని, నొప్పులు తగ్గినా మార్ఫిన్ మాదకతకు రోగులు బానిసైపోతారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో గాయపడిన సైనికులకు మార్ఫిన్ ఇచ్చేవారు. హెరాయిన్, కొకైన్‌లూ దాదాపు ఇదే తీరులో పనిచేస్తాయి. కొన్నాళ్లు వీటిని వాడిన వారు వీటికి బానిసలు కావాల్సిందే. ఆ తర్వాత వాటి నుంచి బయటపడటం దుస్సాధ్యం.
పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో వైద్యులు చిన్నపాటి పంటి నొప్పుల మొదలుకొని నానా రకాల జబ్బులకు కొకైన్‌ను ఎడాపెడా సూచించేవారు. హెరాయిన్‌ను దగ్గుమందుగా వాడేవారు. అమెరికాలాంటి అగ్రరాజ్యంలో సైతం ఆనాటి వైద్యులు విచక్షణారహితంగా వీటిని సూచిస్తూ పోవడంతో లక్షలాదిమంది వీటికి బానిసలుగా మారారు. దాదాపు శతాబ్దకాలం తర్వాత వైద్యులు వీటి దుష్ప్రభావాలను గుర్తించడంతో ప్రభుత్వాలు వీటిపై నిషేధం విధించాయి. నిషేధం తర్వాత పత్రికల్లో వీటి ప్రకటనలైతే నిలిచిపోయాయి గాని, వీటి ఉత్పత్తి మాత్రం నిలిచిపోలేదు. అక్రమమార్గాల్లో వీటి ఉత్పత్తి, రవాణా, సరఫరా జరుగుతూనే ఉన్నాయి.
మాదకద్రవ్యాలపై నిషేధాజ్ఞలు జారీ చేసిన తొలి దేశం చైనా. అక్కడ నల్లమందు వాడకం విపరీతంగా ఉండేది. జనాలంతా నల్లమందుభాయీలుగా మారడంతో ఆందోళన చెందిన చైనా ప్రభుత్వం 1729లో తొలిసారిగా నల్లమందుపై నిషేధం విధించింది. అది పెద్దగా ఫలించలేదు. అయినా పట్టువదలని చైనా ప్రభుత్వం 1796, 1800 సంవత్సరాల్లో కూడా మరో రెండుసార్లు నల్లమందుపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. అయినా, ఇవేవీ ఫలించలేదు. ప్రభుత్వం నిషేధం విధించినా, నల్లమందు మరిగిన చైనా జనాలు సొంతగానే దొంగచాటుగా గసగసాల సాగు చేస్తూ, సొంత వాడకానికి కావలసిన నల్లమందు తయారు చేసుకోవడం మొదలు పెట్టారు. సొంత సాగుకు వీలు కుదరని వారు విదేశాల నుంచి దొంగచాటుగా నల్లమందును దిగుమతి చేసుకునేవారు. ఫలితంగా నిషేధాజ్ఞలకు ముందు 40 లక్షలుగా ఉన్న నల్లమందుభాయీల సంఖ్య 1836 నాటికి ఏకంగా 1.20 కోట్లకు చేరుకుంది. ఇది గమనించిన చైనా ప్రభుత్వం నల్లమందు దిగుమతిపై నిషేధాన్ని మరింత కట్టుదిట్టం చేసే చర్యలు ప్రారంభించడంతో అవి వికటించి, బ్రిటన్‌తో మొదటి నల్లమందు యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం 1839లో ప్రారంభమై నాలుగేళ్లు కొనసాగింది. ఆ తర్వాత 1856లో రెండో నల్లమందు యుద్ధం జరిగింది. రెండో యుద్ధంలో బ్రిటిష్ సేనలతో ఫ్రెంచి సేనలు కూడా జతకలసి చైనాతో తలపడ్డాయి. రెండు యుద్ధాలూ చైనాకు ఆర్థిక నష్టాన్ని, సైనిక నష్టాన్ని మిగిల్చాయి.
ఇరవయ్యో శతాబ్ది నాటికి ప్రపంచ దేశాన్నీ కాస్త తెలివి తెచ్చుకుని మాదక ద్రవ్యాలపై నిషేధాజ్ఞలు విధించాయి. నిషేధాజ్ఞల ఫలితంగా మాదక ద్రవ్యాల ఉత్పాదన విరివిగా జరిగే దేశాల్లో మాఫియా ముఠాలు తయారయ్యాయి. అంతర్జాతీయ స్థాయిలో మాదక ద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేయడమే కాకుండా, దారుణమైన నేరాలకు పాల్పడుతూ దేశ దేశాల్లో వేళ్లూనుకున్నాయి. ఈ మాఫియా ముఠాలు సమాంతర ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయి. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో సాగుతోందో, దానిపై వచ్చే లాభాలు ఏమేరకు ఉండవచ్చో కచ్చితమైన అంచనాలేవీ లేవు. అయితే, ఐక్యరాజ్య సమితి 1997లో విడుదల చేసిన ‘వరల్డ్ డ్రగ్ రిపోర్ట్’ నివేదిక మాదక ద్రవ్యాల ఆక్రమ వ్యాపార లాభాలు దాదాపు 4 లక్షల కోట్ల డాలర్ల (రూ.278 లక్షల కోట్లు) వరకు ఉండవచ్చని అంచనా వేసింది. ఈ అంచనా ఇరవైరెండేళ్ల కిందటిది. ఆ తర్వాత దీనిపై అధికారిక లెక్కలేవీ అందుబాటులో లేవు. ఇప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో ఇక ఊహించుకోవాల్సిందే! మాదకద్రవ్యాల నిషేధానికి ఎన్ని దేశాలు ఎన్ని చట్టాలను తెచ్చినా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి ఎంత భారీ యంత్రంగాన్ని ఏర్పాటు చేసుకున్నా, మాఫియా ముఠాల ప్రాబల్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గుతున్న దాఖలాల్లేవు.
మాదకద్రవ్యాల ఉత్పత్తి అత్యధికంగా జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారత్‌తో పాటు అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, మయన్మార్, టర్కీ, లావోస్, తదితర దేశాల్లో గసగసాల సాగు భారీ స్థాయిలో సాగుతోంది. దీని ద్వారా తయారయ్యే నల్లమందు, దాని నుంచి ఏటా ఉత్పత్తి చేసే మాదకద్రవ్యాలు ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 27.5 కోట్ల మంది నిషిద్ధ మాదకద్రవ్యాలకు బానిసలుగా ఉన్నారని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విడుదల చేసిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో గంజాయి వాడేవారి సంఖ్య అత్యధికంగా 19.2 కోట్ల వరకు ఉంటుందని, ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ పుచ్చుకునేవారి సంఖ్య 1.10 కోట్ల వరకు ఉంటుందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. మాదకద్రవ్యాల దుర్వినియోగం కారణంగా సంభవించే మరణాలసంఖ్య నానాటికీ పెరుగుతుండటం మరో ఆందోళనకరమైన పరిణామం. యునైటెడ్ నేషన్స్ ఆఫీన్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్(యూఎన్‌ఓడీసీ) వెల్లడించిన వివరాల ప్రకారం 2000 సంవత్సరంలో డ్రగ్స్‌కారణంగా 1.05 లక్షల మంది మరణిస్తే, 2015 నాటికి ఈ సంఖ్య 1.68 లక్షలకు చేరుకుంది.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు కొన్ని దేశాలు కీలక స్థావరాలుగా ఉంటున్నాయి. మెక్సికో, కొలంబియా, పెరు, బొలీవియా, వెనిజులా వంటి దేశాల నుంచి భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలు అమెరికా, కెనడా, యూరోప్ దేశాలకు చేరుతున్నాయి. ఇరాన్, అఫ్ఘానిస్తాన్, మయన్మార్ తదితర దేశాల నుంచి భారత్‌సహా దక్షిణాసియా దేశాలకు మాదకద్రవ్యాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సరిహద్దుల వద్ద ఎంతటి కట్టుదిట్టమైనా భద్రత ఏర్పాట్లు ఉన్నా, ఏటా వివిధ దేశాల సరిహద్దు భద్రతా దళాలకు టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలు పట్టబడుతూనే ఉన్నా, మాఫియా ముఠాలు మాత్రం ఏదో ఒక రీతిలో భద్రతా బలగాల కళ్లు గప్పి వీటిని తాము చేరవేయదలచుకున్న ప్రాంతాలకు చేరవేస్తూనే ఉన్నారు. డ్రగ్స్‌ను విక్రయించే స్థానిక దళారులు యువతకు వీటి మత్తును మప్పి, వీటికి బానిసలుగా తయారు చేస్తున్నారు. మన దేశంలో పెద్ద నగరాలే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లోనూ మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం విస్తరిస్తోంది. పంజాబ్ ఉదంతాన్ని తీసుకుంటే, అక్కడి యువత మత్తులో మునిగి తేలే పరిస్థితులు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. అక్కడి పరిస్థితులపై రూపొందించిన ‘ఉడ్‌తాపంజాబ్’ దేశాన్ని ఉలిక్కిపడేలాచేసింది.
- గంజాయి: ఇది మొక్కల భాగాలనుండి తయారు చేస్తారు. కెనబిస్ సెటైవమ్ దీని శాస్త్రీయనామం. పొగరూపంలో పీల్చిఆనందిస్తారు. తక్కువ ధరలో ఎక్కువ ఉల్లాసాన్ని కలిగించే వాటిలో ఇది ఒకటి.
- ఎం.డి.ఎం.ఎ: దీన్ని ఉల్లాసం కోసం వాడతారు. నాడీవ్యవస్ధను ధ్వంసం చేసే ప్రమాదకారి.
- క్రిస్టల్మిథేన్: దీనివాడకం వలనమెదడుపై ప్రభావం అధికంగా ఉంటుంది. మతిభ్రమ, జ్జాపకశక్తి కోల్పోవడం వంటి పలు రుగ్మతలకు దారితీస్తుంది. దీని వాడకానికి అలవాటు పడితే దీనినుండి బైటపడటం చాలాకష్టం.
- కొకైన్: అత్యంత వ్యసనాత్మక మందులలో ఇది ఒకటి.ఇది తీసుకుంటే మెదడులో డోపమైన్ అధికమోతాదులో విడుదలచేస్తుంది.
- యల్.యస్.డి.: లైసెర్జిక్ యాసిడ్ డైథేలామిడ్‌గా పిలిచే ఒక శక్తివంతమైన సైకేడేలిక్ ఔషధం. దీర్ఘకాలంగా వాడితే మానసిక రుగ్మతలు, మతిభ్రమణం కలుగుతుంది. ఒక్కసారి వాడితే దీని మత్తు పన్నెండుగంటల పాటు ఉంటుంది.
- హెరాయిన్: ఇది మత్తుపదార్ధాలలో రాణి. ఇది విడుదలచేసే డోపమైన్ మొత్తం ఒక ఉద్వేగ సమయంలో విడుదలయ్యే మొత్తానికి వందరెట్లు అధికంగా ఉంటుంది. ఇది మెదడుకు అత్యంత ప్రమాదకారి.
- స్పీడ్ బాల్: హెరాయిన్, కొకైన్‌ల కలయికే ఈ స్పీడ్ బాల్. అధికమోతాదులో వాడితే మరణం తధ్యం.
- మెథాంఫెటామైన్: అత్యంతప్రమాదకారి. ఈ పొడిని కాల్చి పొగ పీలుస్తారు. ఇది ఊపిరితిత్తులు, గుండె, మెదడు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. త్వరగా దీనికి బానిసలు అవుతారు. దీనినుండి బైటపడటం అంత సులభం కాదు.
మాదకద్రవ్యాల బదులు కొంతమంది వ్యాధిగ్రస్తులు వైద్యనిమిత్తం రోజువారి మందుల్లో మిన్‌కెన్, కొకైన్, కోడీస్, హెరాయిన్, కాఫ్ సిరప్పు, పెయిన్ కిల్లర్స్, నిద్రమాత్రలు వంటివి డాక్టర్ ప్రిస్ర్కిప్షన్‌తో వాడుతుంటారు. డ్రగ్స్ కు అలవాటుపడినవారు డ్రగ్స్ అందకపోతే పై మందులు వాడుతూ మత్తులో తేలుతుంటారు. ఇలా స్పిరిట్, కరోనా వ్యాప్తిని అరికట్టే శానిటైజర్లు కూడా వదలకుండా పలువురు మరణం పొందారు.
మార్పిన్, మెథాడోన్ మందులు పేషంట్ల ట్రీట్‌మెంట్‌లో భాగంగా వైద్యులు వాడుతారు కనుక వాటిని ప్రభుత్వం ఎన్‌డిపిఏ చట్టంనుండి మినహాయింపు ఇచ్చింది.
ఇవి ఇంత విచ్చలవిడిగా అందరికి అందుబాటులోనికి రావడానికి మాఫియానే కారణం. ఇరాన్ నుండి గుజరాత్‌కు రెండు కంటైనర్ల నిండా మూడువేల కిలోల హెరాయిన్ పట్టుపడింది. దీని విలువ 21 వేల కోట్ల రూపాయలు.ఇవి ఆఫ్ఘన్ తీవ్రవాదులు తమ ఆయుధాలు కొనుగోలుకు మత్తుపదార్ధాల పండిస్తూ వ్యాపారం చేస్తున్నారన్నది అందరికి తెలిసిన నిజం.
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎంత చిత్త శుద్ధితో పనిచేస్తున్నా వీటిని సమూలంగా నిర్మూలించలేకపోతున్నాయి.
ఎదుటపడి యుధ్ధబలంలో మనలును ఎదుర్కొనలేని శత్రుదేశాలు మత్తు పదార్ధాలు మనదేశంలోనికి అత్యంత రహస్యంగా పంపుతున్నాయి. ముఖ్యంగా కళాశాలలు, పబ్బులు వంటి ప్రదేశాలలో యువత ఎక్కువ ఉంటారు కనుక వారందరికి అందుబాటులో లభిస్తుంది. అత్యంత ప్రమాదకరమై ఈ తప్పుడు వ్యాపారాన్ని ధనార్జన కోసం నిర్వహిస్తున్నారు. అటువంటివారిలో ఎక్కువమంది తాము చేస్తున్నది ఎంతటి తప్పో, ప్రమాదకరమో తెలియకుండానే చేస్తున్నారు.
ఇక్కడ మనం దృష్టి మత్తుపదార్థాలు చిల్లర వ్యాపారం చేసే వాళ్ళపైన కాదు వీరికి అందించే వారిపైన, పెద్దమొత్తంలో దిగుమతి చేసుకునే వ్యాపారులపైన నిఘా పెంచాలి. దేశానికి పట్టిన ఈ చీడపురుగులను ఏరివేయాలి. కేంద్రప్రభుత్వం ఈ మాదకద్రవ్యాలు అరికట్టడంలో నన్ను విశేష అధికారాలతో నియమించింది. నేను ఈ విషయంలో ఎక్కడా రాజీ పడను. ఈ నా పోరాటంలో మీ అందరి సహయ సహాకారాలు ఉంటాయని ఆశిస్తాను.
మత్తుపదార్థాలతో పాటు తక్షణం ఉత్సహం కొరకు కాఫీ, టీ తాగుతుంటారు. కాఫీ వలన ప్రయోజనం, దుష్ప్రభావం గురించి అసలు కాఫీ ఎక్కడ పుట్టింది దీని ప్రయోజనం ఓ పర్యాయం పరిశీలిద్ధాం!” అంటూ ఆపాడు భరత్.
(సశేషం)