Site icon Sanchika

భూతాల బంగ్లా-11

[box type=’note’ fontsize=’16’] ‘భూతాల బంగ్లా’ అనే నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[భరత్ సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ధూమపానం ఎన్ని దుష్పరిణామాలకు కారణమవుతోందో చెబుతాడు. దేశంలో భంగు వాడకం, దాని దుష్ప్రభావాన్ని గుర్తు చేస్తాడు. గంజాయి, నల్లమందుల అనర్థాలను వివరిస్తాడు. డ్రగ్స్ పురాతన కాలం నుంచీ ఉన్నాయనీ, ఆధునిక మాదకద్రవ్యాలకు ప్రాచీన కాలంలోనే కనుగొన్న గంజాయి, నల్లమందు, ఉమ్మెత్త వంటి మొక్కలే మూలమని అంటాడు. తొలి రోజుల్లో వైద్యులు మాదకద్రవ్యాలను నొప్పి నివారిణులగా వాడేవారని, క్రమేపి వాటి చెడు ప్రభావం తెలిసాకా, వాటిని సిఫార్సు చేయడం మానుకున్నారని చెబుతాడు. ఇరవయ్యో శతాబ్ది నాటికి ప్రపంచ దేశాలన్నీ కాస్త తెలివి తెచ్చుకుని మాదక ద్రవ్యాలపై నిషేధాజ్ఞలు విధించాయనీ, వాటి ఫలితంగా మాదక ద్రవ్యాల ఉత్పాదన విరివిగా జరిగే దేశాల్లో మాఫియా ముఠాలు తయారయ్యాయని అంటాడు. మాదక ద్రవ్యాల అక్రమ ఉత్పాదన ఏయే దేశాల్లో జరుగుతోందో చెప్తాడు. అధికారులు తమ దృష్టిని మత్తుపదార్థాలు చిల్లర వ్యాపారం చేసే వాళ్ళపైన కాకుండా, వారికి సరుకు అందించే వారిపైన, పెద్దమొత్తంలో దిగుమతి చేసుకునే వ్యాపారులపైన ఉంచాలని అంటాడు. తన పోరాటంలో వారందరి సహకారం కావాలని కోరుతాడు. కాపీ, టీ లు కూడా కొంత మేరకు వ్యసనమే అంటూ కాపీ గురించి చెప్పడం మొదలుపెడతాడు భరత్. ఇక చదవండి.]

[dropcap]భ[/dropcap]రత్ మాట్లాడుతూ “కాఫీ ఇథియోపియా గొర్రెల కాపరులచే 9వ శతాబ్దములో కనిపెట్టబడింది. ఇథియోపియా కొండ ప్రాంతాలలో మేతమేస్తున్న గొర్రెలు ఒక విధమైన మొక్కలలో ఉన్న పండ్లను తిని ఉత్సాహంతో గంతులు వేస్తుండటం గమనించి, ఆ పండ్లలో ఏదో వింతైన శక్తి ఉన్నట్లు గ్రహించి, వాటిని ఉపయోగించడము ప్రారంభించి, దానికి కాల్ది అని నామకరణము చేశారు. తరువాతి కాలంలో ఇది ఈజిప్ట్, యెమన్ దేశాలలో వ్యాప్తి చెందింది. 15వ శతాబ్దానికి ఇది మధ్య తూర్పు ప్రాంతాలైన ఉత్తర ఆఫ్రికా, పర్షియా, టర్కీలని చేరింది. 1585వ సంవత్సరములో లెయాన్ హార్డ్ ర్యూవుల్ఫ్ (Leonhard Rauwolf) అనే జర్మన్ వైద్యుడు తన పది సంవత్సరాల తూర్పు దేశ వాసము పూర్తిచేసి తిరిగి జర్మనీ చేరుకున్న తరువాత కాఫీని నరాల బాధా నివారిణిగా తీసుకొమ్మని రోగులకు సలహా ఇచ్చాడు.

ముస్లిమ్ దేశాలనుండి కాఫీ ఇటలీ దేశానికి వ్యాప్తి చెందింది. క్రమంగా కాఫీ ఉత్తర ఆఫ్రికా, వెనిస్, ఈజిప్ట్, మధ్యప్రాచ్యదేశాల మధ్య ముఖ్యమైన వాణిజ్య వస్తువైంది. వెనిస్ నుండి మిగిలిన ఐరోపా ఖండములో ఇది వ్యాప్తి చెందటము ప్రారంభించింది. 8వ పోప్ క్లెమెన్ట్ దీనిని క్రైస్తవ పానీయంగా గుర్తించడంతో ఇది క్రైస్తవుల అంగీకారాన్ని పొంది వారి సంప్రదాయ పానీయంగా చోటు చేసుకుంది. యురోపియన్ మొట్టమొదటి కాఫీశాల 1645లో ఇటలీలో ప్రారంభించబడింది. కాఫీని పెద్ద మొత్తంగా డచ్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. అరబ్ దేశాలు కాఫీ మొక్కలను, పచ్చి కాఫీ గింజలను ఎగుమతి చేయడంపై నిషేధం విధించడంతో డచ్ కాఫీ మొక్కల పెంపకాన్ని జావా, సిలోన్ లలో ప్రారంభించింది. ఈస్టిండియా కంపనీ వలన కాఫీ ఇంగ్లండ్‌లో వ్యాప్తి చెందింది తరువాత ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, పోలెండ్, వియన్నాలలో వ్యాప్తి చెందింది. ఉత్తర అమెరికాలలో కాలనీల కాలంలో ప్రారభమైన కాఫీ వాడకము ఐరోపాలో ప్రారంభంలో అమెరికన్లను ఆకర్షించకపోయినా కాఫీకి అమెరికన్ల మధ్య కొంత చోటు మాత్రం లభించింది. తరువాతి కాలంలో అవసరానికి కావలసినంత సరుకు లభించని కారణంగా వ్యాపారులచే కాఫీ ధర విపరీతంగా పెంచబడింది. 1812 లో జరిగిన యుద్ధానంతరము టీ దిగుమతులు ఇంగ్లండ్ తాత్కాలికంగా నిలిపి వేయడంతో అమెరికాలో కాఫీ వాడకం ఊపందుకుంది. కాఫీ పొడి తయారీలో సాంకేతిక నైపుణ్యము మెరుగుపడసాగింది. తరువాతి కాలంలో అమెరికన్లకు కాఫీ తప్పనిసరి ఆహార పానీయాలలో ఒకటిగా మారింది.

కాఫీ ఇథియోపియన్ల ద్వారా కాకతాళీయంగా కనిపెట్టబడినదే అయినా దీనిని పంటలుగా పండించి అభివృద్ధి చేసిన ఘనత మాత్రము అరేబియనులదే. 15వ శతాబ్ద మధ్యకాలంలో కాఫీని సేవించినట్ల ఆధారాలు లభ్యమౌతున్నాయి. దక్షిణా అరేబియా ఏమన్ చెందిన సూఫీలు దీనిని సేవించినట్లు ఆధారాలు లభ్యమౌతున్నాయి. ముస్లిమ్ దేశాల నుండి ఇది ఇటలీకి విస్తరించింది. తరువాత ఇండోనేషియా, తూర్పు ఐరోపా మరియు అమెరికాలకు విస్తరించింది.

కాఫీ చెట్లు వాడని పచ్చదనాన్ని కలిగిన చిన్న చెట్లు. ఇవి సాధారణంగా కొండ ప్రాంతాల్లో నాటబడతాయి. ఇవి 3-9 మీటర్ల ఎత్తువరకు పెరుగుతాయి. ఇవి సామాన్యంగా సంవత్సరానికి ఒకసారి ఆకుపచ్చ గింజల రూపంలో వికసిస్తాయి. ఎనిమిదవ సంవత్సరంలో ఇది వాణిజ్యమైన మంచి దిగుబడిని ఇవ్వగలుగుతుంది. కాఫీ పానీయాన్ని తాగుతున్నప్పుడు అందులో ఉన్న కెఫిన్ (ఆల్కలాయిడ్) మనకు కావలసిన ఉత్సాహాన్నిచ్చి మానసిక స్థితిని ఒక ఉచ్చదశకు తీసుకెళ్తుంది. అందులో ఉన్న మరో పదార్థం కాఫీయోల్ చాలా హాయినిచ్చే రుచి సువాసలనలు కాఫీకి అందజేస్తుంది. కాఫీకి చికోరీ చేర్చడం వలన ఒక విధమైన రుచి వస్తుంది. కాఫీ తీసుకోవడం ద్వారా అల్జీమర్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చునని దక్షిణ ఫ్లోరిడా యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. కాఫీలోని కెఫిన్‌ శరీరంలోని రక్తపు స్థాయిని పెంచుతుందని ఆ అధ్యయనంలో వెల్లడైంది. కాఫీ గింజల్లోని కెఫిన్‌ల ద్వారా జ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యాధులు కూడా నయమవుతాయని తెలియవచ్చింది. కఫెనేటెడ్ కాఫీ సాధారణంగా రక్తపు గ్లూకోజ్ స్థాయిని పెంచుతుందని యూఎస్ఎఫ్ న్యూరోసైంటిస్ట్ చవాన్‌హయ్ కో తెలిపారు. అలాగే కాఫీ తాగడం వల్ల ఉత్సాహం, చురుకుదనం కలగడమే కాకుండా గుండెకు మేలు జరుగుతుంది. కెఫిన్‌ గుండెకు రక్షణ కల్పిస్తుంది. క్రమం తప్పకుండా కాఫీ సేవించడం వల్ల గుండె క్రమబద్ధంగా పనిచేస్తుందని సర్వేలో తేలింది. కెఫిన్ కాపీ తాగడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుందని చవాన్ వెల్లడించారు. ఒక రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగితే పక్షవాతం వంటి వ్యాధులు దరిచేరవని స్వీడన్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అదే సమయంలో ఇష్టానుసారంగా తాగితే మాత్రం బీపీ వంటి రోగాలు కొని తెచ్చుకున్నట్టేనని వారు హెచ్చరిస్తున్నారు. స్వీడన్‌లోని పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయన వివరాలను పరిశీలిస్తే.. 1960 నుంచి స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు దాదాపు ఐదు లక్షల మంది కాఫీ ప్రియులపై ఈ అధ్యయనం చేసినట్టు తెలిపింది. కాఫీ తాగితే మెదడులో రక్తం గడ్డ కట్టడాన్ని 14 శాతం తగ్గిస్తుందని వారు తెలిపారు. అలాగే, కాఫీ ద్వారా చెడు కొలస్ట్రాల్ నుంచి మెదడును కాపాడవచ్చు. అయితే కాఫీ మోతాదు ఎక్కువైతే రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరించారు. ఈ విషయాలన్నీ అమెరికన్ జర్నల్‌లో ప్రచురితం చేశారు. కాఫీ తాగే వారిలో కెఫిన్ ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఇది రక్తపు పోటును పెంచుతుందని తద్వారా ధమనులు మొద్దుబారుతాయన్నారు. పైపెచ్చు.. గుండె వేగాన్ని పెంచే ఒత్తిడి హార్మోన్‌ స్థాయిలను పెంచుతుందన్నారు. ఈ విషయం అమెరికాకు చెందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు 400 మంది గుండెపోటు బాధితులపై జరిపిన సర్వేలో వెల్లడైనట్టు డైలీ టైమ్స్ పత్రిక పేర్కొంది.

కాఫీ మరీ అనారోగ్యకరమైన వ్యసనమేమి కాదని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. కాఫీతో కొన్ని ఆరోగ్యకరమైన లాభాలు కూడా ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది. టైప్‌ 2 డయాబెటిస్‌, గుండె సంబంధింత వ్యాధులు, సమస్యలతో బాధపడేవారికి కాఫీ మేలు చేస్తుందని తెలిసింది. కానీ కొన్ని సైడ్‌ ఎఫెక్ట్‌లు కూడా ఉన్నాయని తేలింది. కాఫీలోని కెఫిన్‌ మూలంగా శరీరంలో ఒకరకమైన వ్యాధి నిరోధక శక్తి అనూహ్యంగా పెరుగుతుంది. ఫలితంగా ఈ శక్తి కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు, క్యాన్సర్‌, టైప్‌2 డయాబెటిస్‌ సమస్యలను నివారిస్తుంది. కాఫీలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కప్పు కాఫీలో 6 కేలరీలు ఉంటే అందులో కలిపే చక్కెరలో 23 నుంచి 27 కేలరీలు ఉంటాయి. కాఫీలో చక్కెర కలపకుంటే కేలరీలు పెరిగే సమస్యే ఉండదు.

లో (low) బ్లడ్‌ ప్రెషర్‌తో బాధపడే వారికి కాఫీ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని సేవిస్తే బ్లడ్‌ ప్రెషర్‌ లెవెల్స్‌ క్రమక్రమంగా పెరుగుతాయి. కానీ ఎక్కువగా కాఫీ తీసుకుంటే శరీరంలో యాంటిఆక్సిడెంట్స్‌ పెరుగుతాయి. ఫలితంగా గుండెలో మండినట్టవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడతాయి. కాఫీ ఎక్కువగా తీసుకుంటే ‘కాఫీ జిట్టర్స్‌’ అనే స్థితికి చేరుకుంటారు. కెఫీన్‌ ఎక్కువగా శరీరంలో చేరడం వల్ల యాంగ్టిటీతో పాటు నిద్రలేమి సమస్యలు కూడా ఏర్పడతాయి. ఎక్కువగా దీన్ని సేవిస్తే ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాఫీని అవసరమైన మేరకు సేవిస్తేనే మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

దీర్ఘకాలం రోజూ కాఫీ తాగితే గుండెజబ్బులు, మధుమేహము వచ్చే అవకాశము తగ్గుతుంది. కాఫీ వాడకం వల్ల వృద్ధాప్యము దూరమవుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కాఫీ లోని కెఫిన్‌.. న్యూరొట్రాన్స్మిటర్స్ అయిన ‘నార్ ఎడ్రినాలిన్‌ , అసిటైల్ కొలిన్‌, డోపమైన్‌’ స్థాయిలను పెంచుతుంది. వీటిమూలాన పనిలో ఏకాగ్రత, చురుకుతనము, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. కెఫిన్‌ తక్కువమోతాదులో ఉత్సాహాన్ని పెంచి.. అలసటను తగ్గిస్తుంది. కెఫిన్‌ మెటబాలిక్ రేట్‌ను పెంచి.. తాత్కాలికంగా హుషారుగా ఉండేటట్లు చేస్తుంది. కెఫిన్‌ క్యాస్సర్ వచ్చే అవకాశాలు తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. కెఫిన్‌ ‘పార్కిన్సనిజం’ జబ్బు వచ్చే అవకాశాలు తగ్గిస్తుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. కెఫిన్‌ ’టైప్ 2 మధుమేహము’ వచ్చే రిస్క్ తగ్గిస్తుందని ఆధారాలు ఉన్నాయి. కెఫిన్‌ కొన్ని కాలేయ క్యాన్సర్లు రానీయదని పరిశోధనలు ఉన్నాయి .

కెఫిన్‌ రక్తనాళాలను కుదించడం (vasoconstriction) వలన రక్తపోటు పెరిగే అవకాశము ఉన్నది. హై బ్లడ్ ప్రషర్ వలన అనేక గుండె జబ్బులు.. స్ట్రోక్‌లు, రక్తనాళాలు మూసుకుపోవడము.. వచ్చే అవకాశము ఉన్నది. కెఫిన్‌ శరీరములో చలన కదలికలు (Motor movements) నియంత్రించడము వలన చేతులు వణకడము అనే గుణము కలుగవచ్చును. కెఫిన్‌ Diuretic గా పనిచేయడం ద్వారా అతిమూత్రము కలుగజేయును. కెఫిన్‌ కార్టిసాల్ (cortisol) తయారీ ఎక్కువ చేయడం వల్ల cortisol Tolerance పెరుగును. కెఫిన్‌ ఎక్కువ మోతాదులో గాబరా (anxiety) ని కలుగుజేయును. కెఫిన్‌ అలవాటుగా మారి అది త్రాగడం మానివేసే పక్షములో విత్డ్రాల్ (withdrawal) లక్షణాలు.. తలనొప్పి, అలసట, నీరసము, సమయస్ఫూర్తి లోపము కలుగును. కెఫిన్‌ ఎక్కువైతే నిద్రలేమి కలిగి.. తత్సంబందిత దుష్పరిణామాలు కలుగుతాయి.

టీ అంటే తేనీరు గురించి… ఇది కూడా మాదకద్రవ్యాల అలవాటుకు ఇతోధికంగా సహాయపడుతుంది.

ఆంగ్లేయులు రాక మునుపు భారతీయులకు టీ, కాఫీలు తెలియవు.

నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ త్రాగడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపడం జీవితంలో ఓ అంతర్భాగమైపోయింది. సగటు భారతీయుల్లో దాదాపు సగం మందికిపైగా టీ సేవిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం మానసిక విశ్రాంతి కోసం కాఫీ సేవించడం అలవాటుగా ఉండేది. ఇళ్ళలో కూడా కాఫీ మాత్రమే వాడుకలో ఉండేది. ఫిల్టర్ కాఫీ బాగా వాడుకలో ఉన్న రోజుల్లో ఇన్‌స్టంట్ కాఫీలు రావడం, వాటితోపాటు పలు రకాల టీ పౌడర్లు మార్కెట్‌లోకి విడుదల కావడం, టీకి జనసామాన్యంలో అధిక వినియోగం ఏర్పడడం, పైగా అది సామాన్య మానవుడికి అందుబాటు ధరలలో లభించడం టీకి మరింత ప్రాధాన్యత పెరగడానికి దోహదపడింది.

దాదాపు ప్రతి దేశంలోనూ టీ వినియోగంలో ఉన్నా భారతదేశం ఉత్పాదించే టీ వైవిధ్యానికీ, విశిష్టతకూ ప్రసిద్ధి పొందింది. పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ టీ మిక్కిలి నాణ్యమైనది. ఇది సువాసనభరితమైనది. ముఖ్యంగా ఇక్కడి మంచుతో కూడిన హిమాలయ పర్వత వాతావరణ పరిస్థితుల వల్ల, ఈ ప్రదేశంలో భూసార రచనా విధానం వల్ల ఇక్కడ ఉత్పత్తి కాబడే టీకి ప్రత్యేక రుచి, సువాసన సిద్ధిస్తుంది. భారతదేశంలో తేయాకు సాగు ప్రాతిపదికగా అనేక మందికి జీవనోపాధి కలుగుతోంది. ఈ రంగంలో సుమారు 20 లక్షల మంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ శ్రామికులు ఉన్నారు. వీరిలో 50 శాతం స్త్రీలు.

4వ శతాబ్దంలో ఒక చైనా వైద్యుడు ఆకులను త్రుంచి, ఎండబెట్టి, ఒక ప్రత్యేక ఉష్ణోగ్రతకు వేడి చేసి, వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్య పరీక్షకు త్రాగాడు. ఈ టీ డికాక్షన్ను త్రాగినందువల్ల ఇతడు ఉత్తేజాన్ని పొందాడు. టీ సేవన ద్వారా మొట్టమొదటగా ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ పొందిన వ్యక్తి ఇతనే. 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచంలో టీ త్రాగడం ప్రారంభమయ్యింది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వినిమయ పద్ధతిలో బట్టలు, వెండికి, అనధికారికంగా నల్లమందుకు బదులుగా టీని చైనా నుండి దిగుమతి చేసుకునేది. చాలాకాలం తర్వాత 1823లో బ్రిటన్‌కు చెందిన బ్రూస్ సోదరులు అస్సాంలో దేశీయంగా తేయాకును కనిపెట్టినప్పుడు భారతదేశంలో టీ ఉత్పాదన ప్రారంభమయ్యింది. విస్తారంగా టీ వృద్ధి చెందే ప్రాంతాలను వీరు కనుగొన్నారు. ఇవి సింగ్‌ఫో జాతులు తోటల పెంపకంలో మిగిలినవై ఉండవచ్చు. ఈ కొండ ప్రదేశాలలో జనులు టీ ఆకులతో చేసిన నాటు సారాను త్రాగుతూ ఉండేవారు. మొట్టమొదట 1838 లో దిబ్రుఘర్ నుంచి 8 పెట్టెలు ఎగుమతి చేయబడ్డాయి. ఈ బ్లాక్ టీ సౌచోంగ్, పీకో అని రెండు గ్రేడులుగా చాలా ప్రసిద్ధి పొందింది. చైనాతో 1833 లో ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్య వ్యాపార సంబంధాలు చెడిపోయినప్పుడు, ఇంగ్లాండు భారతదేశంలో టీ ఉత్పాదనకు తీవ్ర మైన ప్రయత్నాలు ప్రారంభించింది. 1860 నాటికి భారతదేశంలో టీ ప్లాంటేషన్ తోటలు బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడే టీ ఉత్పాదన సుమారు పది లక్షల కేజీలు ఉండేది.

చైనా నుండి బ్లాక్, గ్రీన్ టీ రకాల విత్తనాలను లార్డ్ మెకార్డెనీ తెప్పించి, భారతదేశంలో 1793లో కలకత్తా బొటానికల్ గార్డెన్స్‌లో ప్రవేశపెట్టాడు. ఇవి పశ్చిమ బెంగాల్, కచార్, నీలగిరి ప్రదేశాలలో నాటబడ్డాయి. నేడు భారతదేశంలో సగానికి సగం టీ మొక్కలు ఆ తోటల పెంపకానికి చెందినవే. ఆ తరువాత అనతికాలంలో 1860 నాటికి చైనా టీ ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వృద్ధిపొందింది. నేడు అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రాంతాలు భారతదేశంలో టీని అధికంగా ఉత్పాదించే రాష్ట్రాలుగా ప్రసిద్ధిపొందాయి. ఇవి మొత్తం సుమారు 98 శాతం టీని ఉత్పాదిస్తున్నాయి. భారతదేశపు టీ ఉత్పాదక ప్రదేశాలలో త్రిపుర, కర్ణాటక, మణిపూర్, సిక్కిం, అరుణాచలప్రదేశ్ ముఖ్య పాత్రను వహిస్తున్నాయి. నీలగిరి కొండలలో భారతదేశపు ఉత్తమ రకం టీ ఉత్పాదించబడుతుంది. సతతహరితపు మొక్క అయిన టీకి వర్షపాతం అధికంగా ఉండాలి. అప్పుడే అది పుష్కలంగా, సమృద్ధిగా పెరుగుతుంది. దిగుబడి అధికంగా ఉంటుంది. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండే ప్రదేశాలలో పెరిగే టీ ఉత్తమమైనది. కానీ మైదానాలలో పెరిగే టీ వల్ల అధిక ఫలసాయం వస్తుంది.

చైనా, జపాన్‌లలో టీ త్రాగడం విస్తారమైన తంతుతో కూడిన ఒక గొప్ప ఉత్సవం (Tea Ceremony) గా పరిణమించింది. అక్కడ టీ డికాక్షను కాచి పంచదార, పాలు కలపకుండా త్రాగుతారు. ఒక్కొక్కప్పుడు నిమ్మరసం, పంచదార కలిపి త్రాగుతారు. అమెరికాలో సామాన్యంగా టీలో ఐస్ వేసి, పంచదారతో త్రాగుతారు. భారతదేశం, బ్రిటన్‌లలో పాలు, పంచదార కలిపి త్రాగుతారు. టిబెటియన్‌లు గ్రీన్ టీని ఉప్పు, యాక్ వెన్నతో కొయ్య కప్పులలో త్రాగుతారు. ఆఫ్రికాలో డికాక్షనును చిలికి నురగగా తయారు చేసి త్రాగుతారు. పశ్చిమ ఆసియాలో టీని యాలకులతో కలిపిన డికాక్షన్‌తో త్రాగితే, భారతదేశంలో గుజరాతీలు మసాలా టీ త్రాగుతారు. బ్లాక్ లేక గ్రీన్ టీని ఏలకులు, కొట్టిన బాదంపప్పు కలిపి కహ్వా అని కాశ్మీరీలు త్రాగుతారు. ఇది చాల పుష్టికరమైన, రుచికరమైన పానీయం.

టీ సహజమైన పానీయం. దీనిలో రసాయనిక పదార్ధాలుగానీ, కృత్రిమ సువాసనల ద్రవ్యాలుగానీ, ఇతర రంగులుగానీ చేరి ఉండవు. ఇది ఆరోగ్యదాయకమైన, శక్తిదాయకమైన పానీయం. దీనిలో విటమిన్లు ముఖ్యంగా బీ గ్రూప్ విటమిన్లు, రిబోఫ్లేవిన్, నియాసిన్ ఉంటాయి. దీన్లో అతి తక్కువగా లభించే కెఫీన్ మానవ శరీరానికి ఆరోగ్యకరమైనది. అపాయకారి కాదు. వయసుతో నిమిత్తం లేకుండా టీని సేవించడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు అతిథులకు మర్యాదపూర్వకంగా ఇచ్చే టీ ఈనాడు త్రాగే నీరులాగా అతి సాధారణ పానీయం అయింది. ఎక్కడబడితే అక్కడ టీ దుకాణాలు వెలవడం ప్రజలు ఈ పానీయానికి ఎంతగా అలవాటుపడ్డారో తెలుపుతుంది.

ఇంత సమాచారం మీకు ఎందుకు చెపుతున్నానంటే, మాదకద్రవ్యాల వినియోగం వలన ఎటువంటి కష్టం, నష్టం ఉందో సమాజానికి తెలియజేయడానికి. ఇది ఏ ఒక్కరి వలనో అయ్యే పని కాదు, సమిష్టిగా బాధ్యతగా అందరు దీని నిర్మూలనకు కృషిచేస్తేనే విజయం సాధించగలం.

మనలో తప్పుడు మార్గాన నడుస్తూ మన విషయాలు మాఫియావారికి అందించే వారికి నా చేతిలో మరణం తప్పదని మరోమారు హెచ్చరిస్తు సెలవు. జైహింద్” అని సెల్యూట్ చేసాడు.

వేదిక దిగువున ఉన్న పోలీసు అధికారులు సెల్యూట్ చేసారు. భరత్‌కి‌ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్‌ని పరిచయం చేయసాగాడు ఓ పోలీస్ ఉన్నత అధికారి.

(సశేషం)

Exit mobile version