భూతాల బంగ్లా-14

0
2

[box type=’note’ fontsize=’16’] ‘భూతాల బంగ్లా’ అనే నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[భూతాల బంగ్లాలో రెండు రోజులు బస చేయడానికి స్నేహితురాళ్ళతో కలిసి వస్తుంది ఆ భవనం యజమాని సాగర్ కూతురు భువన. తమ తోటలో సీతాఫలాలు ఉన్నాయా అని శివయ్యని అడుగుతుంది. సీతాఫలాల కోసం చూస్తున్న శివయ్యకు అక్కడ కొన్ని పక్షి ఈకలు కనిపిస్తాయి. శివయ్యపై అనుమానం కలిగిన భువన చెన్నయ్ రెడ్ క్రాస్ వారికి ఫోన్ చేసి తనకి కావల్సిన సమాచారం సేకరిస్తుంది. తర్వాత శివయ్యని నిలదీస్తే, తాను స్పెషల్ ఆఫీసర్ భరత్‌నని ఒప్పుకుంటాడతను. ఆ భవనంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి వచ్చినట్టు చెప్తాడు. భువన భరత్‍ని ఇష్టపడి అతనితో కలిసి జీవించాలనుకుంటున్నట్లు చెబుతుంది. ఈ రహస్యాన్ని తమిద్దరి మధ్యే ఉంచమని చెప్తాడు శివయ్య ఉరఫ్ భరత్. వివరీతమైన తుఫాను రావడంతో నగరమంతా కరెంటు పోతుంది. భూతాల బంగ్లాలో కూడా జనరేటర్ పని చేయదు. ఆ సమయంలో భరత్ పై గదులకి వెళ్ళి అక్కడ సీక్రెట్ కెమెరాని అమర్చి వస్తాడు. ఆ రాత్రి సాగర్ తన మనుషులతో వచ్చి, తెల్లవారు ఝూమున ఎప్పటిలా అట్టపెట్టెలు కారు డిక్కిలో పెట్టుకు వెళ్ళడమంతా కెమెరాలో రికార్డయి సంబంధిత అధికారులకు చేరిపోతుంది. పోలీసులు బంగ్లాను సీజ్ చేస్తారు. సాగర్ ఆత్మహత్య చేసుకుంటాడు. పోలీస్ అధికారులతో సమావేశమైన భరత్ మత్తుమందుల గురించి మాట్లాడుతాడు. ఇక చదవండి.]

[dropcap]భ[/dropcap]రత్ మాట్లాడుతున్నాడు.

“సినీ పరిశ్రమ అంటేనే వైకుంఠపాళి లాంటిదని.. ఎప్పుడు అందలం ఎక్కుతారో.. ఎప్పుడు అధఃపాతాళానికి వెళ్తారో తెలియదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని తెలిపారు. డ్రగ్స్‌ను ఓ రిక్రియేషన్‌గా మొదలు పెడతారని, క్రమంగా బానిసవుతారని పేర్కొంటున్నారు. తర్వాత వారే డ్రగ్స్‌ సప్లయర్లుగా మారుతారని.. రియా చక్రవర్తి ఉదంతమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు.

రాజధానిలో గ్రాము ధర ఇలా

మత్తు పదార్థం ధర (రూపాయల్లో)

  1. కొకైన్‌ 3,000 – 4,000
  2. ఓపియం 2,000 – 3,000
  3. హెరాయిన్‌ 2,000 -3,000
  4. ఎల్‌ఎస్‌డీ 1,500-3,000
  5. ఎండీఎంఏ 4,000-6,000.

గుజరాత్‌లో అదానీ పోర్టులో 3 వేల కిలోల హెరాయిన్‌ పట్టుబడింది. ఆ సందర్భంగా తనిఖీలు నిర్వహించగా ఢిల్లీ, నోయిడాలో కూడా పట్టుబడింది. దీనికి సరిగ్గా నెల రోజుల ముందు ముంబాయిలో రూ.1800 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ 300 కిలోలు దొరికింది. దానికి ముందు శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.121 కోట్లు విలువ చేసే సరుకు దొరికింది. అసోంలో రూ.163 కోట్ల విలువ చేసే సరుకు దొరికింది. తాజాగా లఖనవ్‌‌పూర్‌లో 972 కిలోల గంజాయి దొరికింది. ఇవే కాకుండా గత ఆరు నెలల్లో తెలంగాణలో 4200 కిలోల గంజాయి పట్టుబడింది. విశాఖపట్నంలో అయితే సంవత్సరానికి రూ.7200 కోట్ల మేర గంజాయి వ్యాపారం జరుగుతున్నదని అంచనా.

ప్రపంచ వ్యాప్తంగా 269 మిలియన్ల మంది మాదక ద్య్రవాలకు బానిసలయ్యారు. వీరు కాకుండా ఒక్కసారైనా వాడుతున్నవారు 5.5 శాతం మంది వున్నారు. ఇండియాలో అయితే మద్యం 16 కోట్ల మంది, గంజాయి 3.1 కోట్ల మంది, హెరాయిన్‌ 2.8 కోట్ల మంది, కొకైన్‌ ఇతర మత్తు పదార్థాలు 1.18 కోట్ల మంది వాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2004లో 21 శాతం వాడుతుంటే ఇప్పుడది 29.5 శాతానికి పెరిగిందని 2020లో ఐక్యరాజ్యసమితి విభాగమైన డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం మాదకద్రవ్యాల వాడకం వలన ప్రపంచవ్యాప్తంగా అర మిలియన్‌ మంది 2019లో మరణిస్తే.. ఇండియాలో జరిగిన ఆత్మహత్యల్లో అధిక శాతం ఈ కోవకు చెందినవేనని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు ఉపయోగించేవారు 0.71 శాతం ఉంటే, ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఇండియాలో 2.65 శాతం ఈ ప్రమాదకరమైన డ్రగ్స్‌ వాడుతున్నారని ఆ నివేదిక పేర్కొంది. 1985లో నార్కొటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ చట్టం ప్రకారం మాదకద్రవ్యాలు వాడడం, కలిగి ఉండడం, సరఫరా, ఉత్పత్తి చట్టరీత్యా నేరం. అయినా ఈరోజు మన దేశంలో విచ్చలవిడిగా డ్రగ్స్‌ దొరుకుతూనే ఉన్నాయి. వాడకం పెరుగుతూనే ఉంది.

ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 157 దేశాల్లో గంజాయి సాగు అవుతున్నది. ఇండియా నివేదిక ప్రకారం దేశంలో 27 రాష్టాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, అంతర్జాతీయ పోర్టులు, ప్రైవేటు పరం అయిన పోర్టుల ద్వారా ఈ సరఫరా ఎక్కువగా జరుగుతున్నది. ముంద్రా అయినా, దానితో సంబంధాలు ఉన్నాయని వస్తున్న క్రిష్ణపట్నం పోర్టు అయినా, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు అయినా, ముంబయిలో పట్టుబడినది అయినా ఇవన్నీ ప్రైవేటు పోర్టులు కావడం గమనార్హం. ఈ మహమ్మారికి బలైపోతున్న దేశాలు కూడా అత్యంత పేదరికంతో ఉన్న ఆఫ్రికా దేశాలు. ఆ తరువాత ఆసియా దేశాలు ఉన్నాయి. ప్రపంచీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేసే ఇండియా లాంటి దేశాలలో ఈ వ్యాపారం విస్తరిస్తున్నది. 2030 నాటికి మాదకద్రవ్యాల వ్యాపారం 11 శాతం పెరగబోతున్నదని ఆ నివేదిక పేర్కొన్నది. ఆకలి, దారిద్య్రం, పేదరికం, నిరుద్యోగం, వైద్యం అందకపోవడం వంటి సకల బాధలకు గురవుతున్న ప్రజానీకాన్ని సైతం విడిచిపెట్టకుండా.. పెట్టుబడిదారులు మాదకద్రవ్యాల వ్యాపారంతో దోచుకుంటున్నారు. వారి నుంచి పైసలు పిండుకునేందుకు డ్రగ్స్‌ను వెదజల్లుతున్నారు. మత్తుకు బానిసలైన యువత ఎలాగైనా సరే డబ్బు పోగుచేసి మాదకద్రవ్యాలను కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నారు.

మన దేశంలో డ్రగ్స్‌ సేవిస్తున్న వారిలో 80 శాతం మంది 35 ఏళ్ల లోపు వారే. వారిలో కూడ ధనిక వర్గాల వారు హెరాయిన్‌, కొకైన్‌, ఒపియాడ్స్‌, ఇంజెక్షన్ల వంటి వాటి ద్వారా సేవిస్తే.. పేద, మధ్యతరగతి యువకులు గంజాయి వంటివి తీసుకుంటున్నారు. ధనిక వర్గానికి ఇవి మొదట పబ్‌లు, క్లబ్‌లు, సినీ పరిశ్రమ ద్వారా సరఫరా అయితే.. ఇప్పుడు ఆ తరగతి యువత చదువుతున్న విద్యా కేంద్రాలకు విస్తరించింది. విలాసాలకు అలవాటున పడిన చదువుకున్న యువకుల ద్వారా.. మధ్యతరగతికి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు.

ఈ మత్తు పదార్ధాలు బారిన పడిన మానసిక రుగ్మతకు లోనైన వారి వేదన గురించి మానసిక నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం!

44 సంవత్సరాల మైఖేల్ అనేక రకాల శారీరక బాధలతో క్లినిక్‌కి చాలా నెలలుగా వెళ్తున్నాడు. అతని ప్రధాన బాధలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, తరచుగా ఉదయాన వాంతులవడం, ఎప్పుడూ నలతగా ఉండడం. ఒకరోజు అతను పొట్టలో విపరీతమైన నెప్పితో క్లినిక్‌కి వచ్చాడు. కడుపులో ఏసిడ్‌ని తగ్గించే మందులు ఇదివరకు లాగా పని చెయ్యడం లేదు. అతన్ని డాక్టరు చూచి ఇంకా ఎక్కువ ఏసిడ్‌ని తగ్గించే మందుల్ని కడుపులోని పుండు మానడానికి ఉపయోగపడే రానిటిడిన్ మాత్రల్ని ఇచ్చాడు. అతను హాస్పటల్ నుంచి బయల్దేరే సమయంలో మైఖేల్ చెమటతో తడిచి పోవడాన్ని చేతులు వణకడాన్ని డాక్టరు గమనించాడు. డాక్టరు అతన్ని ఆపి, ఇంకా ఏమైనా బాధలు ఉన్నాయా అని అడిగాడు. అప్పుడు మైఖేల్ కూర్చుని ఏడవడం మొదలు పెట్టాడు. తన ప్రధాన సమస్య పని ఒత్తిడితో కొన్ని నెలలుగా ఇంకా ఇంకా ఎక్కువగా మద్యాన్ని తాగానని ఒప్పుకున్నాడు. కాని ఇప్పుడు మద్యం తాగడమే పెద్ద సమస్యయి పోయింది. ఇప్పుడు తను తాగుడు లేకుండా కొన్నిగంటలు కూడా ఉండలేక పోతున్నానని చెప్పాడు.

సమస్యేమిటి? మైఖేల్ మద్యం మీద ఆధార పడుతున్నాడు. అతనికి ఉన్న చాలా బాధలు అతని శరీరం మీద మద్యం వ్యసనం ప్రత్యక్షంగా కొట్టిన దెబ్బ ఫలితమే. కొన్ని బాధలు మద్యాన్ని మానాలకున్నప్పుడు కలిగే లక్షణాలు.

లీ 18 ఏళ్ళ హైస్కూల్ విద్యార్థి. అతను ఎప్పుడూ మంచి విద్యార్థి, కష్టపడి చదివేవాడు, నిజాయితీ కలిగిన వాడు. కాని ఇటీవల లీ బాగా పొద్దుపోయే వరకు బయటే తిరుగుతున్నట్లు, పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్నట్లు, ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తున్నట్లు వాళ్ళ అమ్మ గమనించింది. క్రితం వారం తన పర్సులోని డబ్బు కొంత పోయినట్లు ఆమె గుర్తించి, అది లీ పనేనేమోనని బాధపడింది. ఆమె లీ తన పూర్వపు స్నేహితులతో, కుటుంబంతో తక్కువ సమయాన్ని గడుపుతున్నాడని, తన తల్లిదండ్రులకు పరిచయం చెయ్యని ఒక కొత్త మిత్ర బృందంతో తిరుగుతున్నాడని కూడా గమనించింది. ఆమె అతనికి ఒక కౌన్సిలర్‌ని కలవమని సూచించింది, కాని అతను దానికి నిరాకరించాడు. ఆరోగ్య కార్యకర్తల్ని ఇంటి దగ్గర కలవడానికి నిర్ణయించుకున్నాడు. మొదట లీ అతనితో చర్చించడానికి అసలు ఇష్టపడలేదు. కాని ఆరోగ్య కార్యకర్తపై కొంత విశ్వాసం కలిగాక తను కొన్ని నెలలుగా హెరాయిన్ అనే మత్తుమందుకు అలవాటు పడ్డానని, ఇప్పుడు దానిని తప్పించుకోలేక పోతున్నానని అంగీకరించాడు. అతను చాలా సార్లు దాని నుంచి బయట పడేందుకు ప్రయత్నించాడు, కాని ప్రయత్నించిన ప్రతిసారీ ఎంతో బాధకు గురయి మళ్ళీ ఆ మందును తీసుకుంటున్నాడు. తను ఈ వ్యసనం నుంచి బయట పడాలనుకుంటున్నానని, కాని ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదని చెప్పాడు.

సమస్యేమిటి? లీ హెరాయిన్‌కి అలవాటు పడ్డాడు. దీని వలన అతను చదువులో వెనకబడ్డాడు, అతను తన లాగానే మత్తుమందులకు అలవాటు పడిన వారితో స్నేహం చేస్తున్నాడు. మత్తుమందుల్ని కొనడానికి డబ్బును దొంగిలిస్తున్నాడు.

ఒక వ్యక్తి యొక్క శారీరక, మానసిక, సాంఘిక ఆరోగ్యంపై మద్యం లేక మత్తుమందుల ప్రభావం ఉన్నప్పుడు అతను ఆ వ్యసనానికి లోనయినట్లుగా భావించవచ్చు. ఈ వ్యసనానికి లోనయినవాళ్ళు దీనినుండి బయట పడడం కష్టం. వాళ్ళు మందును మానడానికి ప్రయత్నించినప్పుడల్లా అనేక శారీరక బాధలు కలగడం, ఆ మందును తీసుకోవాలనే కోరిక విపరీతంగా పెరగడం జరుగుతుంది (విత్‌డ్రాయల్ లక్షణాలు). మద్యం, మత్తుమందుల వ్యసనానికి లోనయిన వ్యక్తులకే కాక వారి కుటుంబాలకు, సమాజానికి కూడా ఎంతో నష్టం, బాధ కలుగుతాయి. ఉదాహరణకు మద్యం వ్యసనం శారీరక బాధల్ని కలగజేయడమే కాక ఆత్మహత్యల సంఖ్య పెరగడానికి, వివాహాలు విఫలమవడానికి, గృహ హింస తీవ్రమవడానికి, రహదారి ప్రమాదాలు ఎక్కువవడానికి, పేదరికం పెరగడానికి దారితీస్తుంది. మద్యం వ్యసనం బారిన పడినవారిలో చాలా మందికి చికిత్స నిమిత్తం హాస్పటల్‌కి రావడానికి మద్యం ప్రధాన కారణం కాదు. అందువలన హాస్పటల్‌కి వచ్చిన వారిని వారి బాధల గురించి అడిగేటప్పుడు, ముఖ్యంగా వారి బాధలు మద్యం సంబంధమైనవిగా తోచినప్పుడు వారి తాగుడు అలవాట్ల గురించి అడిగి తెలుసుకోవాలి.

మద్యం వ్యసనం యొక్క కీలక లక్షణాలు:

మద్యం వ్యసనానికి లోనయిన వ్యక్తి ఈ క్రింది వాటిలో కొన్ని బాధల్ని అనుభవిస్తాడు.

  • కడుపు లోపలి పొర ఎర్రబడడం, పుండు పడడంతో కడుపు నెప్పి.
  • కాలేయం దెబ్బ తిని పచ్చ కామెర్లు రావడం.
  • రక్తపు వాంతులవడం.
  • వణుకు, ముఖ్యంగా ఉదయం పూట.
  • ప్రమాదాలు జరగడం, గాయాలవడం.
  • మందు మానే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫిట్స్ రావడం, చెమటలు పట్టడం, గందరగోళంలో పడడం.

భావన:

  • నిస్సహాయంగా ఉన్నానని, నియంత్రణను కోల్పోతున్నానని భావించడం.
  • తన తాగుడు అలవాటు గురించి కించ పడడం.

ఆలోచనలు:

  • మద్యం తాగాలనే వెర్రి కోరికతో కూడిన ఆలోచనలు.
  • తరువాత మళ్ళీ తాగడం గురించే ఎల్లప్పుడూ ఆలోచించడం.
  • ఆత్మహత్య గురించి ఆలోచనలు.

ప్రవర్తనలు:

  • నిద్ర పోవడం కష్టమవడం.
  • పగలు కూడా త్రాగడం అవసర పడడం.
  • శారీరిక బాధల్ని తగ్గించుకోవడానికి ఉదయాన్నే తాగవలసి రావడం.

అనేక రకాల మత్తు మందుల వ్యసనం అలవడవచ్చు. మద్యం కాక సాధారణంగా అలవాటయే మత్తుమందులు కన్నాబిస్, గంజాయి సంబంధిత మందులు, హెరాయిన్, కొకెయిన్, స్పీడ్ లాంటి ప్రేరేపక మందులు, నిద్ర మందులు. వీటి కీలక లక్షణాలు .

మత్తుమందుల వ్యసనం యొక్క కీలక లక్షణాలు:

మత్తుమందుల వ్యసనం బారిన పడిన వ్యక్తికి ఈ క్రింది వాటిలో కొన్ని లక్షణాలు ఉంటాయి.

శారీరక:

  • శ్వాస తీసుకోవడం కష్టమవడం, ఉబ్బసం.
  • మత్తు మందుల్ని ఇంజక్షన్ రూపంలో తీసుకుంటే చర్మానికి ఇన్ఫెక్షన్‍లు, పుండ్లు.
  • మందును తీసుకోకపోతే విత్‌డ్రాయల్ లక్షణాలు, వికారం, ఆందోళన, వణుకులు, విరేచనాలు, కడుపులో నెప్పి, చెమటలు పట్టడం

భావన:

  • నిస్సహాయంగా ఉన్నానని, నియంత్రణను కోల్పోతున్నానని భావించడం.
  • తన మత్తుమందుల అలవాటు గురించి కించపడడం.
  • విచార పడడం, డిప్రెషన్‌కి లోనవడం.

ఆలోచన:

  • మత్తుమందును తీసుకోవాలనే తీవ్రమైన కోరిక.
  • మళ్ళీ మత్తుమందును తీసుకోవడం గురించే ఎప్పుడూ ఆలోచించడం.
  • ఆత్మహత్య గురించి ఆలోచనలు.

ప్రవర్తనలు:

  • నిద్ర పోవడం కష్టమవడం.
  • చిరాకు పడడం, ఉద్రేక పడడం.
  • మత్తుమందుల్ని కొనడానికి డబ్బును దొంగిలించడం. పోలీసులతో సమస్యల్ని తెచ్చుకోవడం.
  • వ్యక్తుల ఆరోగ్యాన్ని నష్ట పరచే ఇతర వ్యసనాలు, సిగరెట్లను వాడడం, నిద్ర మాత్రలను వాడడం, జూదమాడటం వంటివి.

తీవ్రమైన మానసిక వ్యాధులు (సైకోసెస్)

ఈ గ్రూపులో మూడు రకాల మానసిక వ్యాధులు ఉంటాయి: షిజోఫ్రినియా మానిక్ డిప్రెసివ్ డిజార్డర్ (బైపోలార్ డిజార్డర్ అని కూడా అంటారు), ఇంకా స్వల్పకాల సైకోసెస్. ఈ వ్యాధులు అరుదుగా వస్తాయి. కాని చాలా అసహజమైన ప్రవర్తనలు, విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి. ఈ కారణం వల్లే మానసిక వ్యాధులంటే ఇవేననే ధోరణి ఉంది. సైకియాట్రిక్ హాస్పటల్స్‌లో చాలా ఎక్కువమంది సైకోసెస్‌తో బాధపడుతున్న వారే ఉంటారు.” అంటూ ఆపాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here