Site icon Sanchika

భూతాల బంగ్లా-7

[box type=’note’ fontsize=’16’] ‘భూతాల బంగ్లా’ అనే నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[బైట ప్రపంచానికి కార్ల మెకానిక్‌గా మంచి పేరు పొందిన భరత్, తనకు వచ్చిన పోస్టు చూస్తూ ఫ్రం అడ్రస్ లేని కవర్‌ని గమనిస్తాడు. అది వారం క్రితం హత్యకు గురైన సుదర్శన్ అనే అధికారి వ్రాసిన ఉత్తరం. అందులోని రహస్య సమాచారం ఆధారంగా – కనకరాజ్, తంగవేలు అనే రౌడీషీటర్లు – చెన్నయి నగరంలో మాదకద్రవ్యాల సరఫరాలో కీలకవ్యక్తులుగా గుర్తిస్తాడు భరత్. సుదర్శన్ వ్రాసిన ఉత్తరంలోని క్లూ ఆధారంగా ఒక ఇంటిని గుర్తించి దాని ఎలెక్ట్రిసిటీ బోర్డు మెయిన్ స్విచ్ కింద ఉన్న మైక్రో చిప్‍ని సంపాదిస్తాడు భరత్. అందులోని వివరాలను తన పై అధికారులకు పంపుతాడు. కనకరాజ్, తంగవేల్ లను రహస్యంగా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతారు. భూతాలబంగ్లాలో దొంగతనానికి ప్రణాళిక వేసుకున్న సెల్వం, మారిముత్తులు ఆ బంగ్లాలో ప్రవేశిస్తారు. మేడ ఎక్కిన మారిముత్తు కింద చూసిన దృశ్యానికి భయపడి అక్కడ్నించి కాలుజారి క్రిందపడి మరణిస్తాడు. సెల్వం పారిపోతాడు. కాలేజీకి సమీపంలో మత్తుపదార్థాలు సేవిస్తున్న యువకులను అధికారులు రహస్యంగా గమనిస్తుంటారు. అధికారుల నిర్బంధంలో ఉన్న్న తంగవేల్, కనకరాజ్ లు నోరు విప్పరు. అప్పుడు ఏం చేయాలో తన క్రింది అధికారికి చెప్పి వెళ్ళిపోతాడు భరత్. ఆయన చెప్పినట్టే చేస్తారు వాళ్ళు. భరత్ ప్రయోగించిన పద్ధతికి నిందితులు నిజం చెప్పేస్తారు. మర్నాడు ఉదయం నిందితులకి ఇడ్లీ పెట్టించి వాళ్ళతో మాట్లాడుతాడు భరత్. ఇక చదవండి.]

[dropcap]అ[/dropcap]ప్పుడు భరత్ “మీరు అమ్ముతున్న మాదకద్రవ్యాల వలన మీవంటి వారు ధనవంతులు కావచ్చు కాని కొన్ని వేలమంది ఆ మత్తు పదార్థాలకు లోనై తమ జీవితాలను నరకప్రాయం చేసుకుంటున్నారు. ఈ వేదన అర్థం కావాలంటే మీ బిడ్డలు కూడా ఈ విషవలయంలో చిక్కుబడాలి. అప్పుడు తెలుస్తుంది, వేలమంది తల్లితండ్రులు అనుభవించే వేదన ఏమిటో? అసలు ఈ మత్తుపదార్ధాలు ఎంతటి ప్రమాదకరమైనవో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా ఏటా 5.6 జనాభా అంటే నూట ఎనభై అయిదు మిలియన్ల మంది ఈ మత్తుపదార్ధాలు వినియోగిస్తున్నట్లు తేలింది. మీలాంటి వారే భారతదేశ యువతను నిర్వీర్యం చేయాలి అనుకునే దేశద్రోహులు. మీకు విధించే శిక్షచూసి మిగిలిన వ్యాపారులు భయంతో వణికిపోవాలి. దేశద్రోహానికి అదే తగిన శిక్ష” అన్నాడు.

అతని మాటలు విన్న ఆ ఇద్దరు మాదక ద్రవ్యవ్యాపారులుగా తాము ధనాపేక్షతో ఎంత తప్పు చేసామో తెలుసుకుని భయంతో వణికిపోయారు.

వారి వద్దనుండి పై అంతస్తుకు వెళ్ళిన భరత్, రాత్రికి ఏమిచేయాలో తమ వాళ్ళకు వివరించి వెళ్ళిపోయాడు.

మరుదినం అన్నిదినపత్రికలలో, టి.వి.చానల్స్‌లో నగరంలోని ప్రముఖ రౌడీషీటర్స్ దుర్మరణం అనే వార్త వచ్చింది. “గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన నగరానికి చెందిన కనకరాజ్, తంగవేల్ అనే ఇద్దరు పేరుమోసిన రౌడిషీటర్స్ బాగా తాగి టూవీలర్‍పై ప్రయాణం చేస్తూ బెంగుళూరు-చెన్నయ్ రహదారిలో దిండివనం అనే ఊరి సమీపంలోని రహదారి చప్టాపై బండి అదుపు తప్పి ఇరువురు అక్కడే ఉన్న నీళ్ళలో పడి శ్వాస అందక మరణించారు. స్ధానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు” అని అన్నిపత్రికలు రాసాయి, టి.వి.లు ప్రకటించాయి.

మరణించిన రౌడి షీటర్లు ప్రముఖ రాజకీయపార్టీకి చెందినవారు, స్ధానిక రాజకీయ నాయకుడు కాళిదాసు మనుషులు కావడంతో పోలీసులపై ఒత్తిడి పెరగసాగింది. కనీసం వారి ఫోన్లు ఏమయ్యాయో తెలుపమని కొందరు రాజకీయ నాయకులు అడగసాగారు.

స్ధానిక ఎస్.పి., డి.ఐ.జి.ని కలసి “సర్ వాళ్ళను ఎవరు హత్య చేయలేదు,  ఆల్కాహాల్ ఎక్కువ తీసుకుని డ్రైవ్ చేస్తూ నీటిలో పడి శ్వాస అందక మరణించారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోస్టుమార్టం రిపోర్టులోకూడా అలానే వచ్చింది. వీళ్ళ ఫోనులు ఏమయ్యాయో తెలియడంలేదు దర్యాప్తు కొనసాగుతుంది” అన్నాడు.

“త్వరగా కేస్ క్లోజ్ చేయండి. నా పైన రాజకీయ నాయకుల ఒత్తిడి అధికంగా ఉంది. రిపోర్టు కాగితాలు నాకు పంపు” అన్నాడు ఐ.జి.

రాజకీయ నాయకులు ఎంత ప్రయత్నించినా, ఎన్ని మార్గాల్లో అన్వేషించిన ఫలితం శూన్యం. ప్రతి విషయం తమకు అందించే ఇన్‌ఫార్మర్‌లు ఈ విషయంపై నోరు విప్పడం లేదు. ఎంత ధనం ఆశ చూపించినా చిన్న క్లూ కూడా దొరకలేదు.

అది ఎన్‌కౌంటర్ అని తెలిసినప్పటికి ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదు. హతులు గత రెండు రోజులు ఎక్కడ ఉన్నారు, ఏ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు అనేది చిదంబర రహస్యంలా ఉండిపోయింది.

దినపత్రిక చూసిన ఆ యువ ఆఫీసర్ భరత్ నవ్వుకున్నాడు. తంగవేల్, కనకరాజ్‌ల ఫోన్లు భద్రంగా ఆడియో లేబరేటరిలో ఉన్నాయి. ఈ ఎన్‌కౌంటర్ భరత్ తెలివిగా చేయించాడన్న నిజం ప్రపంచానికి ఏనాటికి తెలియకుండా శాశ్వత సమాధి అయింది.

***

మరో ఆదివారం తనతో పని చేస్తున్న మాదక ద్రవ్య నిరోధక ఉద్యోగుల సమావేశంలో భరత్ మాట్లాడుతున్నాడు.

స్ధానికంగా కుగ్రామాల్లో సారాయి తయారు చేయబడుతుంది. రాజకీయ నాయకుల ప్రముఖ అనుచరులే – పాలకవర్గం కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి వారి అధ్వర్యంలో ఈ సారా వ్వాపారం నిర్వహింప బడుతుంది. ఇంకా కొందరు స్ధానికంగా పేరుపొందిన రౌడీషీటర్లు వాళ్ళ అనుచరులు కూడా మత్తుపదార్థాల వ్యాపారం నిర్వహిస్తుంటారు. నెల నెలా ఎవరికి ఎంత ముడుపులు చెల్లించాలో చెల్లిస్తుంటారు.

తగినంత సిబ్బంది లేకపోవడం రాజకీయ నాయకుల ఒత్తిడితో ఎక్స్‌సైజ్ శాఖ ఎప్పుడో ఒకసారి దాడిచేసి ఓ అనామకుడిని కోర్టులో హజరు పరుస్తుంది.

మనషిని మధ్యపానం ఎలా దిగజారుస్తుందో తెలుసుకుందాం!

మద్యపానం తీసుకోవడంతో ఆరోగ్యం పాడవుతుందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినప్పటికీ చాలామంది మద్యం తీసుకోవడం మానలేకపోతున్నారు. కొన్నేండ్లుగా పెరుగుతున్న మద్యం వాడకం కారణంగా ప్రజల్లో అనారోగ్య పరిస్థితులు మరింత పెరుగుతున్నాయి. తాగుడు వల్ల ఆరోగ్య సమస్యలే కాక, ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. తాగుడుకు అలవాటు పడిన వారి పని సామర్థ్యం తగ్గి పోతుంది.

ఒక వ్యక్తి ప్రతిరోజూ ఆల్కహాల్‌ను తీసుకుంటే అది శరీరంలో హానికరమైన ప్రభావాలను చూపుతుంది. మద్యంతో వచ్చే వ్యాధుల గురించి మరింత సమాచారం చెప్తాను.

గుండె వ్యాధులు: ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవటం వల్ల సాధారణంగా రక్తంలో కొవ్వు పదార్థం ఎక్కువవుతుంది. శరీరం యొక్క రక్తపోటు పెరుగుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉంటే, అది గుండెను ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా ఇది శరీరం యొక్క మంచి కొలెస్ట్రాల్‌ స్థాయి మీద ప్రభావితం చేసి గుండె పోటు అపాయాలను పెంచుతుంది.

మూత్రపిండాల పనితీరు పై ప్రభావం: ప్రతి రోజు ఆల్కహాల్‌ తీసుకోవటం వల్ల సాధారణంగా మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. ఈ ఆల్కహాల్‌ సాధారణంగా హార్మోన్‌ల పనితీరు మీద ప్రభావితం చేసి, కొన్ని సమయాల్లో మూత్రపిండ వైఫల్యం కుడా సంభవించవచ్చు.

కాలేయం దెబ్బతింటుంది: మద్యం అధికంగా తీసుకోవడంతో కాలేయం పాడైపోతుంది. దీంతోపాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఎన్నో పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవటం కాలేయం మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్‌ కాలేయంలో కొవ్వును పెరిగేలా చేస్తుంది. అందువల్ల కాలేయం పాడయ్యి ఫ్యాటీ లివర్‌ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఇతర అనేక వ్యాధులకు కారణం అవుతుంది. ఆహారం జీర్ణం కావడంలో సమస్యలు తలెత్తుతాయి.

మధుమేహం: శరీరం యొక్క రక్తంలో చక్కెర స్థాయి తగ్గిస్తుంది. ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం యొక్క రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఈ పరిస్థితి మధుమేహ వ్యాధి రావడానికి కారణమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయి అధిక స్థాయిలో ఉంటే రక్త నరాల్లో సమస్యలు వస్తాయి. రక్తనాళాలు మూసుకుపోయి రక్తప్రసరణ వ్యవస్థ నాశనానికి కారణమవుతుంది. అధిక మద్యపానం శాశ్వతంగా నరాల హానిని కూడా కలిగించవచ్చు.

జీర్ణ సమస్యలు: ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవాహిక అంతర్గత పూతకు నష్టం కలిగుతుంది. ఈ కారణంగా జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. ఇది పొట్టలో పుండ్లు (అల్సర్‌), పొట్టకు సంబంధించిన ఇతర సమస్యలతో పాటు పెద్దప్రేగు కాన్సర్‌కు దారితీస్తుంది.

క్యాన్సర్‌: ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణావయవాలలో నోరు, గొంతు, కంఠనాళం, కడుపు, శ్వాసావయవాలు, క్యాన్సర్‌ వ్యాధికి గురయ్యే ప్రమాదముంది. కాలేయం క్యాన్సర్‌కు మద్యపానానికి దగ్గరి సంబంధం ఉంది. తాగుడు వల్ల ఆరోగ్య సమస్యలే కాక, ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. తాగుడుకు అలవాటు పడిన వారి పని సామర్థ్యం తగ్గి పోతుంది.

మెదడు: ఆల్కహాల్‌వల్ల ప్రత్యక్షంగా కంటి చూపును, జ్ఞాపకశక్తి కోల్పోతారు. మెదడు సాధారణ పనితీరు మీద ఆల్కహాల్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడు నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అధిక మద్యపానం అసందర్భ సంభాషణ, అనైతిక ప్రవర్తనకు కారణమవుతుంది. ఆలోచన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

బరువు: అధిక బరువు పెరగడానికి ఆల్కహాల్‌ కారణం. ప్రతి రోజు మద్యం సేవించడం ద్వారా అధిక కేలరీలు తీసుకోవటం వల్ల స్థూలకాయం వంటి సమస్యకు కారణమవుతుంది. ఈ కారణంగా బరువులో హెచ్చుతగ్గులు రావడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అధిక రక్తపోటు పెరుగుతుంది.

చర్మం: చర్మం మీద ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్‌ ప్రభావం శరీరానికే పరిమితం కాలేదు, చర్మానికి కూడా హాని చేస్తుంది. ఆల్కాహాల్‌వాడకం వల్ల కండ్ల కింద నల్లని వలయాలు, కండ్లు ఉబ్బినట్లు ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి.

రక్తహీనత: మద్యం ఎక్కువగా తీసుకునేవారిలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. తెల్ల కణాల శాతం తగ్గిపోయి వారిలో వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కాలేయం దెబ్బతిని పేగుల నుండి రక్తం స్రవిస్తుంది. రక్తం గడ్డ కట్టే గుణం క్రమంగా తగ్గిపోయి.. రక్తహీనత వస్తుంది.

లైంగిక వాంఛ: పురుషుల్లో మద్యపానం వల్ల లైంగిక వాంఛ తగ్గిపోతుంది. మితిమీరి మద్యం తాగితే పురుషత్వ హార్మోన్ల ఉత్పత్తిలో మార్పులు వస్తాయి. అలాగే మానసిక, శారీరక ఒత్తిడి టెస్టోస్టీరాన్‌ స్థాయిని త్వరగా కుంగదీస్తుంది. అకస్మాత్తుగా కార్టిసాల్‌ పెరగడానికి ఒత్తిడి కారణమవుతుంది. మద్యం ఎక్కువగా తాగేవారిలో హార్మోన్స్‌ కూడా ఎక్కువ ఉత్పత్తి కావు. అంతేకాకుండా గుండెజబ్బులు, ఎముకలు బలహీనపడటం వంటివి కూడా జరుగుతాయని ఇటీవల పరిశోధనలో తేలింది.

సంతానలేమి: జననేంద్రియ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్‌ ఎక్కువగా సేవించడం వల్ల శరీరం యొక్క జననేంద్రియ వ్యవస్థ నాశనానికి కారణం అవుతుంది. ఆల్కహాల్‌ తీసుకోవటం వల్ల పరోక్షంగా సంతానలేమి సమస్య వస్తుంది.

సరదా ప్రారంభమై వ్యసనంగా మారి మిమ్మల్ని అనారోగ్యం పాలు చేసే మద్యానికి దూరంగా ఉండటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మద్యపానం అలవాటుగా మొదలయి చివరికి వ్యసనముగా మారుతుంది. తాగుడుకు అలవాటై, వ్యసనంగా మారి దానికి బానిసైపోయిన వ్యక్తి పతన ప్రస్థానం ఇలా సాగుతుంది.

సరదాగా అప్పడప్పడు త్రాగడం.త్రాగడం అలవాటు మొదలు. దొంగతనంగా త్రాగడం. అపరాధ భావము. కష్టాలు చెప్పకోలేక పోవడము. త్రాగి డ్రైవింగ్ చేసి అపరాధ రుసుము చెల్లించడం. స్వాధీనం తప్పి అతిగా త్రాగడం. గొప్పలు చెప్పుకుంటు అతిగా ప్రవర్తించడం. చేసిన వాగ్దానాలు, తీర్మానాలను నిలబెట్టుకోలేకపోవడము. చుట్టాలను, స్నేహితులను తప్పించుకు తిరగడము. ఉద్యోగము, సంపాదనలో కష్టాలు. అకారణముగా కోపము. ఆహారంపై అశ్రద్ధ. అనైతిక కార్యక్రమాలు. హానికలిగించు ఆలోచన ధోరణి. ఏ పని ప్రారంభించలేక పోవడము. అస్పష్టమైన అధ్యాత్మిక చింతన. సంపూర్ణ ఓటమి అంగీకారము. త్రాగుడు నుండి తప్పించుకోలేక బానిసగా మారడము – ఇవీ ఫలితాలు.

పరిమిత స్థాయిలో మద్యం తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్న దానికి సరైన ఆధారాలు లేవని శాస్త్రజ్ఞులు తెలిపారు. మద్యపానం వల్ల ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లుతుంది. మద్యపానం వల్ల రక్తపోటుతో పాటు గుండెపోటు కూడా వచ్చే ప్రమాదముంది. మద్యంలోని మాల్ట్ సుగర్ వల్ల కొందరి శరీరంలో అధికంగా క్రొవ్వు చేరి అనారోగ్యం పాలవుతారు.

దేశవ్యాప్తంగా మద్యనిషేధం అమలుకు ఆదేశాలివ్వాలని, ప్రభుత్వం ఆదాయాన్ని మాత్రమే పట్టించుకుంటూ రాజ్యాంగ బాధ్యతను విస్మరిస్తోందని, 1995నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రొహిబిషన్‌ చట్టానికి సవరణలు తీసుకొస్తూ 1997లో చేసిన చట్టాన్ని రద్దు చేయాలంటూ నిజామాబాద్‌కు చెందిన ఎం.నారాయణ హైకోర్టులో పిటిషన్‌దాఖలు చేశారు.

వాదనలు:

“1995లో మహిళలు ఉద్యమించడంతో నిషేధం విధించారు. అనంతరం సడలించారు. నిషేధం కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో సడలించామన్నారు. మద్య నియంత్రణను చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు మద్యం వినియోగం వల్ల భంగం వాటిల్లుతుంది.

మద్యం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి.

వాహనదారులు శిరస్త్రాణం (హెల్మెట్‌) ధరించే విషయాన్ని ప్రజల ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే మద్య నిషధంలోనూ ఉండాలి.

మద్యంతో సంపాదించే లాభాలు వ్యాపారులకు, ప్రభుత్వానికి పెద్దమొత్తంలో సొమ్ము సంపాదించి పెట్టవచ్చును కానీ, సమాజాన్ని నష్టపరుస్తాయి. ఉత్పాదకతను దెబ్బతీస్తాయి. ఎంతో విలువైన మానవ వనరులను బలహీనపరుస్తాయి. కష్టజీవుల శ్రమఫలితంలో అత్యధిక మొత్తాన్ని అపహరించి జాతికి తీరని అపకారం చేస్తుంది.

సంపూర్ణ మద్యనిషేధం వల్ల తాగుబోతుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, స్త్రీలపై అత్యాచారాలు, ఇతర నేరాలు తగ్గిపోతాయి” అని వాదించారు.

పాఠశాల, దేవాలయం, ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలోపుగా దుకాణం ఏర్పాటు చేయకూడదు.

పాఠశాల గుర్తింపు పొందినదై ఉండాలి. అలాగే దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలోనిదై ఉండాల్సి ఉంటుంది. 30 పడకల ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలోపు మద్యం దుకాణం ఏర్పాటు చేయకూడదు.

దుకాణం ఏర్పాటు నిర్దేశించిన స్థలం మేరకే ఉండాలి. దుకాణంతో పాటు ప్రత్యేక గదులు, బార్‌ స్థాయి ఏర్పాట్లు చేయకూడదు. దుకాణం అమ్మకం స్థానం మాత్రమే. కొన్నచోటే తాగటానికి ఏర్పాట్లు చేయటం నిషిద్దం.

మద్యం వ్యాపారులు లిక్కరు, బీరు ఇతర మద్యాన్ని బాటిల్‌పై వేసిన ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి.

విక్రయాలు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు మాత్రమే జరపాలి. అంతకుమించి సమయాన్ని దాటి అమ్మకాలు జరిపిన వారికి జరిమానా విధిస్తారు.

బార్‌లు అయితే రాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచే వెసులుబాటు ఉంది.

ఆల్కోపాప్స్‌ను ఎక్సైజ్‌శాఖ సాధారణ మద్యం విభాగంలో చేర్చింది. తియ్యగా పండ్ల రసంలా ఉంటుంది. త్రాగినవారు క్రమేపీ దీనికి అలవాటు పడిపోతారు. చివరికి ఇది మద్యపానానికి దారితీస్తుంది. దీన్ని ‘రెడీ టు డ్రింక్‌’ అని పిలుస్తారు. నారింజ, బెర్రీ… ఇలా రకరకాల పండ్ల రుచుల్లో లభిస్తున్నాయి. పండ్ల రసంతోపాటు వీటిలో 4.8 శాతం ఆల్కహాలు ఉంటుంది. సాధారణ మద్యం కంటే దీని ధర, వినియోగం కూడా మూడురెట్లు ఎక్కువగా ఉంది.

మితంగా తాగినా చేటే. తగు మోతాదులో మద్యం తాగితే హృదయం పదిలంగా ఉంటుందని చెప్పడం అతిశయోక్తే అని శాస్త్రజ్ఞులు తాజాగా ప్రకటించారు. పరిమిత స్థాయిలో మద్యం తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్న దానికి సరైన ఆధారాలు లేవని న్యూజిలాండ్‌కు చెందిన శాస్త్రజ్ఞులు తెలిపారు. మితంగా మధ్యం తాగితే హృదయ సంబంధ వ్యాధులు దగ్గరకు రావంటూ గతంలో రెండు సర్వేలు వెలువడ్డాయి. మద్యపానం వల్ల ఆరోగ్యానికి పెనుముప్పు అని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. మద్యపానం వల్ల రక్తపోటుతో పాటు గుండెపోటు కూడా వచ్చే ప్రమాదముందని వారు హెచ్చరించారు. సారాయి వలన ముఖ్యంగా కాలేయం దెబ్బతింటుంది. నాటు సారా వలన చూపు కోల్పోయినవారు, ఆరోగ్యం పూర్తిగా చెడి శేషజీవితం మంచానికే పరిమితమైనవారు ఎందరో. తాగిన వాహనం నడుపుతూ మరణించేవారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఏది ఏమైనా మధ్యపానం దుర్వ్వసనమే ప్రాణాంతకమే! మద్యపానం తరువాత మాదకద్రవ్యాల వినియోగానికి తొలిమెట్టు ధూమపానం.

(సశేషం)

Exit mobile version