భ్రమలో..!!

1
2

[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘భ్రమలో..!!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ను[/dropcap]వ్వు – నేను..,
నీకూ – నాకూ మధ్యలో
ఎందరెందరో..
అంతుచిక్కని
స్నేహబంధాలు
చిక్కుపడిన
అనుబంధాలు!
ఎవరికి వారే
మనసులో –
స్వంత రచనలు చేసుకుంటూ
దానిని ‘ప్రేమ’ అని భ్రమిస్తూ
మనసంతా నీచుట్టూ
పెనవేసుకుని
పరిభ్రమిస్తూ.. వుంటే ,
నేనెమో అయోమయంలో,
నీ హృదయంలోకి –
తొంగి తొంగి చుస్తూ
నిరాశగా నిలబడిపోయాను!
నీ నిర్ణయాన్ని–
నిండు హృదయంతో,
ఆహ్వానించాను!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here