Site icon Sanchika

బొమ్మ-బొరుసు

[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘బొమ్మ-బొరుసు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నే[/dropcap]ను మంచోడినని అంటారందరూ
నిజమా అని నాకనిపిస్తుంది
ఎవరైనా కష్టంలో ఉంటే ఓదారుస్తా
వెళ్ళి వాళ్ళ కన్నీళ్ళు కూడా తుడుస్తా

ఇంటికొచ్చాక ఏదో తెలియని ఆనందం
మనసులో పొంగుతూ ఉంటుంది
మంచి పని అయ్యిందిలే అనిపిస్తుంది
పైశాచిక ఆనందం పెల్లుబుకుతుంది

అప్పుడే అచ్చు గుద్దిన కొత్త నాణెం
రెండు ముఖ చిత్రాలు దానికి
బొమ్మ బొరుసు తూర్పు పడమర
కొత్త నాణెం లాంటి వాడినా నేను

ముఖంలో మంచితనమనే బొమ్మ
గుండెల్లో వికృతమైన బొరుసు
సైతాను తాను కొలువై ఉన్నాడా నాలో
అయినా బొమ్మ బొరుసు రెండూ
ఉంటేనే కదా నాణేనికి విలువ
అందుకేనేమో నాకంత మంచి పేరు

Exit mobile version