Site icon Sanchika

బూతులు నేర్పబడును

[రాజకీయనాయకుల బూతులు విని, విసుగెత్తి ఈ గేయం రాశారు ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు.]

[dropcap]తె[/dropcap]రువు ఒక coaching సెంటర్
భలే డిమాండ్ ఉంది
ఇది నేటి trend 📈

మాజీలు, తాజాలు
తిట్టుకుంటున్నారు
పోటీ పడి లోపల బయట

సిగ్గు లేని జనాలు
వింత చూస్తున్నారు
ముక్కు మీద వేలేసుకొని

బూతుల డిక్షనరీ రాయించు
పెద్దగా గిట్టు బాటు అవుతుంది
Hot 🔥 Hot 🔥 గా
అమ్ముడైతాయి

ఈ రంగంలో అవుతావ్
నువ్వే ఆధ్యుడవ్
పోటీ లేదు at present

సిగ్గుపడాలి జనం
నోట్ కు అమ్ముకున్నందుకు
Vote

ఒక్కడు కుక్క అంటాడు
ఒక్కడు గాడిద అంటాడు
ఒక్కడు చెప్పు చూపుతాడు

ఒక్కడు బట్టలు వూడదీసి
నడి బజార్లో కొడతా అంటే
మేము చేతులు ముడుచుకోము అంటాడు
మరొక్కడు

రా చూసుకుందాం అంటే ఒకడు
రా ఇప్పుతా అంటాడు మరొక్కడు

వాడు ఇప్పడు
వీడు చూడడు
చూద్దాం అని ఎదిరి చూసే వారు
నిరాశతో ఇంటి ముఖం పడుతారు

At present పురుషులు
తిట్టుకుంటున్నారు
మహిళలు రంగప్రవేశం
చేస్తే.. భయమేస్తుంది బాబూ

Exit mobile version