Site icon Sanchika

బ్రతుకు కావ్యం

[dropcap]అ[/dropcap]ర్చనలు చేయ అలిగినంతట
అలిగెనక్షరము అరక్షణము
అలమటించ దాహము తీరిన పిమ్మట
వెలిగెనక్షరము క్షణక్షణము

ముసుగులో మౌనమెంతసేపని
విసుగులో కసిరెను కలము
అలుసా కావ్యమంటె నీకని
కన్నీరు ఒడికెను హృదయ రాట్నము

వెలుగుచు ఆరుచు
మిణుగురులా మసలెను ప్రాణము
సృష్టి రహస్యమిదియని
స్పష్టతెక్కడ సరింగని కొసరెను తర్కము

వెర్రివారమా మూర్ఖులమాయని
హృదిగదులు మార్మ్రోగెను
మనసొక మానసికరోగ నిలయమని
మొరుగుచుండెను మస్తిష్కము

మనిషీ మనిషీ
మనసూ మనసూ
అంతర్గోడలతో ఇళ్ళులన్నీ నిండగా

మెరుగైన నిండైన సమాజమిదని
నినదించుటేల సంభవమని..!

అందుకే అంటారు కాబోలు
‘వేలంవెర్రీ’ అని..

Exit mobile version