Site icon Sanchika

బుర్రా లక్ష్మీనారాయణ సంస్మరణ సభ

[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత బుర్రా లక్ష్మీనారాయణ సంస్మరణార్థం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్‌ హాల్‌లో ఆత్మీయసభ జరుగుతుంది.

ఈ సభకు డాక్టర్‌ రూప్‌కుమార్‌ డబ్బీకార్‌ అధ్యక్షత వహిస్తారు. సభలో కె.వి.ఎస్‌. వర్మ. ఏనుగు నరసింహారెడ్డి, ఎం. నారాయణశర్మ, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్‌ లతో పాటు కొందరు బుర్రా లక్ష్మీనారాయణ గారి మిత్రులు, సన్నిహితులు, బంధువులు  ప్రసంగిస్తారు.

15 ఏప్రిల్‌ 2024 సోమవారం సాయంత్రం ఆరు గంటలకు బాగ్‌లింగం పల్లిలోని షోయబ్‌ హాల్‌లో ఈ సభ జరుగుతుంది.  కథలు, కవిత్వం రాసిన బుర్రా లక్ష్మీనారాయణ 7 ఏప్రిల్‌ 2023న ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు.

వారు రాసిన కథా సంపుటాలు

  1. కల చాలనమ్‌ 2. ద్వాదశి 3. నాలుగు పుంజీలు 4. ఫాలచుక్కలు, 5. దేహనది 6. మట్టి అరుగు.

కవితా సంపుటాలు 1. ఇదీ వరస. 2. ఎన్నెల మొగ్గలు.

కథలు, కవిత్వంలో పాటు చక్కటి వ్యాసాలు రచించారు. ఏది రాసినా అందంగా, లలితంగా రాయడం వారి అలవాటు. చక్కని వచనంతో పాఠకులను ఆకట్టుకున్న రచయిత. ఈ సభ సందర్భంగా బుర్రా లక్ష్మీనారాయణ గారి పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.

 

Exit mobile version