Site icon Sanchika

అడ్డదారి తొక్కిన “బైపాస్”

[box type=’note’ fontsize=’16’] “అప్పటికి గొప్ప నటులుగా ఎస్టాబ్లిష్ కాకపోయినా, ఈ లఘు చిత్రం వాళ్ళు సామాన్యులు కాదు అని చెబుతుంది” అంటూ ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖిల గురించి చెప్తూ ‘బైపాస్’ షార్ట్ ఫిల్మ్‌ని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

[dropcap]ఈ[/dropcap] వారం మరో లఘు చిత్రం “బైపాస్”. ఇది 2003 లో తీసినది. కాని నా దృష్టికి ఈ మధ్యే వచ్చింది. ఇక మీరు ఎందుకు చూడాలంటారా? 2003 నాటికి ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖిలు ఎలా వున్నారో చూడాలని కుతూహలంగా వుందా? ఇర్ఫాన్ లో తక్కువ సిధ్ధిఖి లో ఎక్కువ మార్పు వుంది, అప్పటికీ-ఇప్పటికీ. అప్పటికి గొప్ప నటులుగా ఎస్టాబ్లిష్ కాకపోయినా, ఈ లఘు చిత్రం వాళ్ళు సామాన్యులు కాదు అని చెబుతుంది. ముఖ్యంగా ఎలాంటి సంభాషణా లేకుండా కథను తమ కళ్ళతోనే చెప్పడం ద్వారా.

రాజస్థాన్ లో ఏదో ప్రాంతం. సరాసరి వెళ్తున్న దారి ఒక చోట రెండుగా చీలుతుంది. ఎడంవైపు రహదారి అయితే కుడివైపు బైపాస్. వొక కొత్తగా పెళ్ళైన జంట పూలతో అలంకరించబడిన కారులో అల్లరి చేస్తూ వెళ్తుంతారు. ఆ అల్లరిలో రోడ్డు పక్కనే వాలి వున్న వో గద్దను గాని, ఆ చీలిక వద్ద మార్గసూచిక రాయిని గాని గమనించకుండా బైపాస్ రోడ్డు మీదుగా వెళ్తారు. అక్కడ ఇద్దరు బందిపోట్లు దారి కాచి వున్నారు ఇలాంటివాళ్ళ కోసం. ఒకడు మాటలు రాని మూగ జీవి (సుందర్ దాన్ డేథా), మరొకడు మాటలొచ్చినా సైలెంట్ చిత్రంలో మాట్లాడలేని నవాజుద్దీన్ సిద్దిఖి. కారు దగ్గరికి రావడం, నవాజుద్దిన్ రాయి పుచ్చుకుని కారు ముందు అద్దం పగిలేలా కొట్టడం, కారు ఆగిపోవడం, ఇద్దరూ వెళ్ళి డబ్బు దోచుకోవడం జరిగిపోతాయి. భర్త చనిపోయి వున్నాడు, భార్య స్పృహలోనే వుంది. భర్త చేతికి రోలెక్స్ వాచి వుంది. కాని తీయడానికి వీలు లేకుండా అతని చేయి స్తీరింగులో చిక్కుకుని వుంది. అర్థం చేసుకున్న మూగవాడు తన చేతిలో వున్న కత్తిని నవాజుద్దీన్ కి అందిస్తాడు. వెనక మోటర్ సైకిల్ మీద ఇన్స్పెక్టర్ (ఇర్ఫాన్ ఖాన్) వస్తుండడం చూసి ఇద్దరూ పారి పోతారు. ఆ తర్వాత కథ సినెమాలోనే చూడండి. ఎందుకంటే ఇందులో కథ కంటే కథనమే ముఖ్యం.

అమిత్ కుమార్ దీనికి దర్శకుడు, స్క్రీన్‌ప్లే వ్రాసినవాడు. మాన్సూన్ షూటౌట్ అనే చిత్రం, ద లాస్ట్ అవర్ అనే టీవీ సీరీస్ తీశాడు. నేను అవి చూడలేదు. కాని ఈ లఘు చిత్రంతోనే తన ప్రతిభను కనబరిచాడు. మనిషి రకరకాల కారణాలతోటి అడ్డదారి తొక్కుతారు. ఆ విషయం తెలిసిన ఇంకొంతమంది అదే అడ్డదారి మీద కాపుకాసి ఇతరులను దోచుకుంటారు. డబ్బు చేతులు మారుతుందంటారే, అలాంటి విన్యాసమే ఇక్కడా చూస్తాము అయితే చాలా వేగంగా, గగుర్పొడిచే విధంగా. కథ కంటే కథనం ముఖ్యమైన చిత్రమిది అన్నాను కదా, దర్శకుడు ఎక్కడ కట్ చేస్తున్నాడో చూడండి. రోలెక్స్ వాచి కోసం చేతినే నరకడానికి చెయ్యెత్తిన కత్తి ని కట్ చేసి మరో చోట మటన్ ను నరకడానికి కత్తి ఎత్తడం తో కలపడం. అలాగే ఆ రోలెక్స్ వాచి ప్రయాణాన్ని కూడా సినెమా అంతా గమనించండి. దాని మీద ప్రత్యేకమైన ఫోకస్ లేకుండా వుంటుంది. ఈ వాక్యం వ్రాయకుండా వుంటే బాగుణ్ణు, కాని వ్యాపార చిత్రాల్లో ఠఠఠాం అన్న భయంకర మ్యూసిక్ తో పాటు ఆ ప్రాపర్టీ ని జూం చేసి మరీ చూపిస్తారు. ఇందులో మనమే గమనించుకోవాలి. ప్రతి ప్రాపర్టీ తన కథ చెబుతుంది. వీటి కారణంగా మొదటి మార్కు దర్శకుడికి. ఆ తర్వాత ఇద్దరు మహానటులకి. ఎక్కడా overplay చెయ్యకుండా matter of fact గా నటించి మెప్పించారు. చిన్న చిన్న nuances ని వాళ్ళ ముఖాల్లో చూస్తే భలే సంతోషంగా వుంటుంది. అంతే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ రాజస్థాన్ ఎడారుల మధ్య ఈ నటుల విన్యాసాలు. అందంగా కెమెరాలో బంధించీ రాజీవ్ రవి. అంతే అందంగా సంగీతంతో గోడచేర్పు ఇచ్చిన డేరియో మరియనెల్లి అనే ఇటాలియన్ సంగీతకారుడు. ఈ చిత్రాన్ని తప్పక చూడండి. యూట్యూబులో వుంది.

Exit mobile version