2020-2021 సంవత్సరానికి గాను ఈ ఫెలోషిప్ ‘తెలుగు సాహిత్యంలో కరోనా కల్లోలం’ అనే అంశంపై 2 సంవత్సరాల పాటు పరిశోధించి పత్రసమర్పణ చేయవలసి ఉంటుంది.
ఈ పరిశోధనకు గాను ప్రకాష్‌కు రెండేళ్లపాటు ప్రతి నెలకు రూ 20,000/- చొప్పున ఫెలోషిప్ నగదు వేతనంగా అందిస్తారు.
గతంలో ఇదే కేంద్రప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖనుండి ‘అత్యాధునిక కవితారూప ప్రక్రియ-నానీ’ అనే అంశంపై పరిశోధన చేసి చలపాక జూనియర్ ఫెలోషిప్ అందుకోగా మళ్ళీ ఇప్పుడు సీనియర్ ఫెలోషిప్ అందుకోవడం విశేషం.