సెల్పంచకం

0
2

[box type=’note’ fontsize=’16’] మనుషులపై సెల్‌ఫోన్లు చూపుతున్న ప్రభావాన్ని పద్యపంచకం రూపంలో వివరిస్తున్నారు పుప్పాల జగన్మోహన్రావుసెల్పంచకం“లో. [/box]

[dropcap]అ[/dropcap]ల్లన మెల్లన చల్లగ
నెల్లలు లేకుండ జేసి ఎల్లరి కెలమిన్
జల్లుచు నుండగ సెల్లును
ఒల్లని వారేరి జూడ ఉర్విని ధరణీ ? ౧

ఎల్లరి యుల్లము లొల్లగ
సెల్లుకె చెల్లంగ చెల్లె చిత్రము గాదే
సెల్లును ఒల్లని వారలు
చెల్లరు చిల్లర కయినను సిద్ధము ధరణీ ౨

సెల్లుకు చెల్లదు కాలము
సెల్లే సర్వమ్ము సుమ్ము చిన్మయ మాయెన్
సెల్లును కాదన కూడదు
సెల్లే చేకూర్చు జ్ఞాన సిరులను ధరణీ ౩

సెల్లొసగును విజ్ఞానము
సెల్లొసగును సకల శాస్త్ర చిన్నెల నిలలో
సెల్లొసగును సంతోషము
సెల్లును వదలంగ తరమ చెప్పుము ధరణీ ౪

సెల్లే సర్వుల గురువిల
సెల్లుండిన నేర్వ వచ్చు చెలగుచు సర్వం
బుల్లాసమ్ముగ నమ్ముము
సెల్లే మార్గమ్ము జూపు చెలియర ధరణీ ౫

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here