Site icon Sanchika

చాచ్‍నామా వ్యాఖ్యాన సహిత అనువాద ధారావాహిక.. సంచికలో అతి త్వరలో – ప్రకటన

[dropcap]భా[/dropcap]రత చరిత్రను తిరుగులేని రీతిలో ప్రభావితం చేసిన సంఘటనలకు నిదర్శనం ఆ చరిత్ర రచన!!!

ఇస్లాం ఆవిర్భావాన్ని, భారతదేశంలో ఇస్లాం ప్రవేశాన్ని అర్థం చేసుకునేందుకు ఆంగ్లేయులు ప్రామాణిక చారిత్రక గ్రంథంలా భావించిన రచన అది!!!

భారతదేశ విభజన సమర్థనకు ఆధార గ్రంథంలా ఉపయోగపడిన రచన అది.. పాకిస్తాన్ దేశంలో చరిత్ర పాఠ్యపుస్తకం అది!!!

2010  టైమ్ స్క్వేర్ దాడికి ముందు తీవ్రవాది ఫైజల్ శెహజాద్  ఉదహరించిన గ్రంథం అది!!!

భారతీయులలో తమ చరిత్ర గురించి ఉన్న అనేక అపోహలను దూరంచేసే చరిత్ర రచన అది!!!

ఫతేహ్ నామా ఎ హింద్ గా ప్రసిధ్ధి పొందిన చాచ్‍నామా.. వ్యాఖ్యాన సహిత అనువాదం తెలుగులో తొలిసారిగా!!!

ప్రామాణిక చరిత్ర గ్రంథాలను ప్రామాణిక వ్యాఖ్యాన సహిత అనువాదంతో అందించి నిజానిజాలను పాఠకుల ముందుంచే ఏకైక తెలుగు పత్రిక సంచికలో త్వరలో ఆరంభం..

భారతదేశంపై మహమ్మద్ బిన్ ఖాసిం దండయాత్రను కళ్ళకు కట్టినట్టు వివరించే ప్రామాణిక చారిత్రిక గ్రంథం.. చాచ్‍నామా వ్యాఖ్యాన సహిత అనువాద ధారావాహిక.. సంచికలో అతి త్వరలో..

చదవండి.. చదివించండి.. మన గురించి తెలుసుకోండి..

చాచ్‍నామా

Exit mobile version