[dropcap]బ[/dropcap]డి, బడి – చదువుల గుడి
మా బడి – మమతల ఒడి
అక్షరాలే లక్షలుగా
పాఠాలే బాటలుగా
సాగే సమతా ఒరవడి ॥బడి॥
ఉపాధ్యాయులే ఊపిరిగా
విద్యార్థులే జీవికగా
క్రమశిక్షణే నాదంగా
విజ్ఞానానికి వేదికగా
నిలబడే మా బడి ॥బడి॥
సద్గుణాల నిలయంగా
సంఘసేవే ధ్యేయంగా
పరిశుభ్రతే ప్రాణంగా
ఉత్తమ విలువల కేంద్రంగా
వెలుగొందే మా బడి ॥బడి॥