[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘చందలూరి మినీ కవితలు’ అనే రెండు చిన్న కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
~
1. ఎందుకు?
అత్తరు మాటలెందుకు?
పూల పదాలుండగా..
సహనంతో కూర్చి మాలగా కడితే
సువాసన మనసుకు ఉచితం కాదా?
ప్రకృతి మనిషికి బంధువు కాదా?
2. రోజుకో తలపు
తలుపు కొట్టినప్పుడల్లా
కల సిగ్గుతో కళ్ళ చాటుకు
నిన్ను పిలుచుకుని
తీపి ఊహలను తాగించి
దప్పిక తీర్చుకుంటుంది..