Site icon Sanchika

చౌరస్తాలో సముద్రం – పుస్తక పరిచయం

[dropcap]సం[/dropcap]గెవేని రవీంద్ర రచించిన 47 కవితల సంపుటి “చౌరస్తాలో సముద్రం“.

***

సంగెవేని రవీంద్ర ఏ కవితలోనైనా మనిషి ప్రస్తావన కనపడుతుందనే అభిప్రాయాన్ని ముందుమాట “‘అనంతు’ అన్నదేమంటే…!” లో అత్తిలి అనంతరాం వ్యక్తపరిచారు. ఇందులోని 47 కవితలలో కొన్ని కవితలు: నిర్లక్ష్యపు నీడలో, నీ పాదముద్రలే, అఛూత్, లోలకం, కలల ప్రపంచం, ఇదో దాహమే, చౌరస్తాలో సముద్రం.

ఈ కవితల సంపుటి నుంచి కొన్ని కవితలు:

***

ఓ తెలుగు రాజా.. ఓ మరాఠీ తేజా..!
నేనో బతుకమ్మను .. నేనో గుడిపాడ్వాను…
నేనో సంక్రాంతిని…
నన్ను కేవలం ఓటు ముద్రను చేయకండి…
అక్కడో ఇక్కడో ఎక్కడో
నన్నో మట్టిరేణువుగానైనా గుర్తించండి..!
ఆ మట్టిని నాకు వీర తిలకంగా దిద్దండి..!!  (నిర్లక్ష్యపు నీడలో)

***

బయటెక్కడో కాదు
చీకటి మన లోలోపలే
ఆశల సింహంలా నక్కి ఉంటుంది… (అసందిగ్ధం)

***

అనుకుంటాం కానీ
ఏ ఉదయమూ ప్రశాంతంగా రాదు
చితికిన ఉదయాల బతుకు చిత్రాలు
మరో ఉదయానికి పురుడు పోస్తాయి.. (గాయపడ్డ ఉదయం)

***

చూపులు దారి తప్పితే
గమ్యం …
రాయని పద్యమై గాయం చేస్తుంది… (నువ్వే నేను కూడా)

***

నేను నూరు గాయాల అజేయున్ని
గాయం కాని ప్రతి ఒక్కడూ
పరాజితుడే…!!  (అజేయం)

***

చౌరస్తాలో సముద్రం (కవిత్వం)
రచన: సంగెవేని రవీంద్ర
ప్రచురణ: ఏప్రిల్ 2018
పేజీలు: 108, వెల: రూ.100/-

ప్రతులకు:
సంగెవేని రవీంద్ర, సి.వి.కాంపౌండ్, 7/4; హనుమాన్ లేన్, లోయర్ పరేల్, ముంబై 400013
ఇంకా ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.

Exit mobile version