Site icon Sanchika

చెలియా ఓ చెలియా

[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘చెలియా ఓ చెలియా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఏ[/dropcap]టి ఒడ్డున కూర్చుంటే
వేడి గాలి తగులుతుందేంటి
పూల తోటలో పూలను చూస్తే
నీ సొగసే అన్నింటా కనిపిస్తోంది

జాబిల్లిని చూద్దామని నింగి లోకి
తొంగి చూస్తే నీ మోము అగుపించింది
చుక్కలనడిగా నా చెలి ఏదని
నీ కన్నుల్లోనే ఉంది చూడమన్నాయి

చెలియా ఓ చెలియా ఎక్కడున్నావు
నా గుండె చప్పుడు ఇప్పుడు
ఏమంటుందో తెలుసునా చెలియా
నిన్నే పిలుస్తున్నట్టు తలస్తున్నట్టు

చెలియా ఓ చెలియా ఎక్కడున్నావు
నిద్దుర పోదామంటే కనుదోయి
మూత పడదే నా గుండె తలుపులు
తెరిచి చూస్తే చిత్రంగా నీ చిత్తరువు
నా గుండెలోనే కొలువున్నావా చెలియా

Exit mobile version