[dropcap]అ[/dropcap]న్ని చెట్ల పేర్లు తెలియవు అందరికి
కొన్ని చెట్ల పేర్లు మాత్రమే తెలుస్తాయి కొందరికి
చెట్టు పేరు తెలియనంతమాత్రాన
ఆ చెట్టుకు పేరు, ప్రయోజనం లేదనగలమా
మేక తినని ఆకు
వైద్యానికి పనికిరాని చెట్టు ఉండవంటారు
చెట్లు ఆరోగ్యానికి ఆ(ని)లయాలు
కొన్ని చెట్లను శ్రద్దగా పెంచుతారు
ఎన్నో చెట్లు ఎవరూ పెంచకపోయినా
విచ్చలవిడిగా పెరుగుతాయి
మర్రి, రావి భవనాల పగుళ్ళలో పుట్టెస్తాయి
పట్టించుకోకపోతే గోడలు పగిలిపోతాయి
గుడి, బడి, భవనం కట్టాలంటే
కొన్ని చెట్లు కూల్చబడతాయి
కూల్చబడే చెట్లు
సోఫాలు, మంచాలు, కుర్చీలు, బెంచీలు
ఇలా ఎన్నోమూర్తులుగా నిలుస్తాయి
ప్రజలకు ఉపకారం లేని చెట్టు
నేలమీద లేనేలేదు
చెట్లను రక్షించడం మానవుల బాధ్యత
వాటి ప్రయోజనం పొందడం
ప్రతిప్రాణీ జన్మ హక్కు