Site icon Sanchika

చేయాల్సింది చేసేయ్

[box type=’note’ fontsize=’16’] “ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే, అనుకున్నది సాధించవచ్చు. చీడలు పడతాయనుకుంటూ చిగురించడమే మానేస్తావా?” అంటున్నారు కిలపర్తి దాలినాయుడుచేయాల్సింది చేసేయ్” కవితలో. [/box]

[dropcap style=”circle”]ఎ[/dropcap]వడుంటాడోయ్ మూడేభైలు
చేయాల్సింది చేసేయ్!
అధిరోహిస్తే ఎవరెస్టైనా
కాళ్ళకిందనుంటుందోయ్!

ముళ్ళున్నాయని ముడుచుకుపోతే
మూగబోతుంది నీలక్ష్యం!
ఆంజనేయునావాహనచేస్తే
కడలే మడుగౌతుందోయ్!

చీడలుపడతాయనుకుంటూ
చిగురించడమే మానేస్తావా?
నీడలుపుడతా యనిదీపం
వెలిగించడమే మానేస్తావా?

దారులు కనబడలేదంటూ
దూరాలను లెక్కిస్తావా?
తారలనైనా అందుకోగలవు
శరమై దూసుకు పోతే!

ఫలప్రదమైతే నీచుట్టూ
పదిమంది చేరికూర్చుంటారోయ్
పెద్దల ఆశీర్వచనాలే
శ్రీరామ రక్షలౌతాయోయ్!

Exit mobile version