Site icon Sanchika

చిగురించే ఆశ

“శక్తివంచన లేకుండా చేస్తే రేపన్నది ఎప్పుడైనా.. ఆశలనూ, ఆశయాలనూ తప్పకుండా నెరవేర్చే ‘మదురమైన రోజు’ గా చిగురిస్తుంటుంది” అంటున్నారు గొర్రెపాటి శ్రీను “చిగురించే ఆశ”లో.

రేపటిని సరికొత్తగా ఆవిష్కరించాలనుకుంటూ..
ఎన్నోకలలు కంటాం.. ఇలా చేయాలి.. అలావుండాలి..
అనుకుంటూ.. ప్రణాళికలు రచిస్తుంటాం..
కదా..!
ఆశలూ, ఆశయాలు ఫలించాలంటే..
నేటి రోజును సరిగ్గా వినియోగించుకుంటూ.. సాగిపోతుంటే..
ఎన్నో ప్రయత్నాలు, మరెన్నోపోరాటాలు.. జీవితగమనంలో
శక్తివంచన లేకుండా చేస్తుంటే ..
రేపన్నది ఎప్పుడైనా ..
ఆశలనూ, ఆశయాలనూ తప్పకుండా నెరవేర్చే ..
‘మదురమైన రోజు’ గా చిగురిస్తుంటుంది!

Exit mobile version