[dropcap]క[/dropcap]లలతీరాల వెంట ఒంటరిగా నడుస్తున్నాను!
కావ్యఖండికల నిండా అక్షరాల హరివిల్లులని నింపుతున్నాను!
నువ్వేమైనా కనిపిస్తావేమోనన్న చిన్నిఆశతో
అలుపెరగని పయనాన్ని సాగిస్తున్నాను!
స్వప్నాల నిండా నువ్వే..
స్వగతాల నిండా నువ్వే..
తలపుల పున్నమిల్లో మెరిసే నాయిక నువ్వే..
జీవితం సంబరాల మయమయ్యేలా
జ్ఞాపకాల చందనాల సుపరిమళం నువ్వే..
కళ్ళెదురుగా కానరాకపోయినా..బ్రతుకంతా జతగా నువ్వే కదా..
ఈ హృదయం అంతా నీదే కదా..
నా ఊపిరి రాగానికి జీవం నువ్వే కదా!!