Site icon Sanchika

చిన్ని పాప మాటలు

[మాయా ఏంజిలో రచించిన ‘Little Girl Speakings’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(చిన్న పిల్లలకు తల్లిదండ్రులే అందరికన్నా గొప్ప. పసిపిల్లల మాటలకు పెద్దగా అర్థాలుండవు. అలాంటి పసిపలుకులే ఈ కవిత!)

~

[dropcap]మా[/dropcap] నాన్నకంటే మంచివారెవరూ లేరు
నీ క్వార్టర్ నాణెం నీ దగ్గరే ఉంచుకో
నేనేం మీ కూతురిని కాదు

నా డాలీ ఏమంత అందంగా లేదు
నేను చెప్పేది విన్నారా
దాని తలపై తట్టవద్దు
నా డాలీ ఏమంత అందంగా లేదు

మా అమ్మకంటే కమ్మగా
వంట చేసే మహిళ లేదు
నేనేం అబద్ధం చెప్పను
కావాలంటే
ఆ పాయసం వాసన చూడండి
మా అమ్మకంటే కమ్మగా
వంట చేసే మహిళ మరి లేదు!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ

Exit mobile version