చింతకాయంత చిన్నోడు

0
2

[box type=’note’ fontsize=’16’] కావలి లోని రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్లో ఐదో తరగతి చదువుతున్న కె. హేమ వ్రాసిన కథ “చింతకాయంత చిన్నోడు“. బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ కథను అందిస్తున్నాము. [/box]

[dropcap]ఒ[/dropcap]క ఊరిలో చింతకాయంత చిన్నోడు ఉన్నాడు. చింతకాయంత చిన్నోడికి ఉసిరికాయంత ఉద్యోగం దొరికింది. ఉసిరికాయంత ఉద్యోగంతో ఇటుక రాయంత ఇల్లు కడతాడు. ఇటుక రాయంత ఇంట్లో బీరకాయంత బీరువా పెడతాడు. బీరకాయంత బీరువాలో వంకాయంత వజ్రం పెట్టి తాటికాయంత తాళం వేసి ఊసిరికాయంత ఉద్యోగానికి వెళ్తాడు.

అప్పుడు దొండకాయంత దొంగ చూసి తాటికాయంత తాళాన్ని పగలగొట్టి వంకాయంత వజ్రాన్ని తీసుకెడుతుంటే మునక్కాయంత ముసలమ్మ చూసి చింతకాయంత చిన్నోడికి చెబితే, చింతకాయంత చిన్నోడు పొట్లకాయంత పోలీసుకి చెబితే, పొట్లకాయంత పోలీసు జీడిపప్పు అంత జీపులో తీసుకెళ్లి జాజికాయంత జైల్లో వేసి వంకాయంత వజ్రాన్ని చింతకాయంత చిన్నోడికి ఇప్పిస్తాడు. అప్పుడు చింతకాయంత చిన్నోడు ఇటుకరాయంత ఇంటికి వెళ్లి సంతోషంగా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here