Site icon Sanchika

చింతన!

[dropcap]ఆ[/dropcap]డుతూ పాడుతున్న వయసులో
పిల్లల్లో విషపు తలపుల పరిచయం
అమాయకపు చిరు నవ్వుల వర్షంలో
కారు మేఘాల అవరోధం
కలుపు మొక్కల జననం
నలుపోడంటే తెలుపోడికి గర్వం
చిన్న కులపోడని పెద్ద కులమోడికి అహం
పొట్టి వాడని పొడుగోడికి సంబరం
పనిలేని రెడ్డి సాబుకి పని చేస్తున్న సాకలోడంటే చిన్నచూపు
కంచి పట్టు చీర కట్టుకున్న కమ్మ-అమ్మ గోరుకి కమ్మరోడంటే తిరస్కారం
చస్ ఆడ జాతి అని మగ జాతికి డంభం
పేదోడంటే గొప్పోడికి అసహ్యం
ఆడది పక్కున నవ్వితే ముక్కున వేలు
మగవాడు వంట వండితే కళ్ళు ఐదింతలు
అందరితో కలిసి మందు కొట్టకపోతే అపహాస్యం
ప్రేమ పెళ్లి అంటే పేద్ద నిషిద్ధం
మొగుడు పోతే ఆడది అపశకునం
ఆడ పిల్ల పుడితే ఇంటికే అరిష్టం
ఊరికే సమాజం మీద ఏడిస్తే ఏం లాభం
మనమే కదా అందులో భాగం
మన చింత మారితే మన భవిత మన చెంత
మన పిల్లల ఆలోచనా విధానం క్షేమం
పెరిగే పిల్లలకి మనం నేర్పే పాఠాలే జీవితం
మనం చెప్పే నీతులే సుభాషితం
పిల్లలని గారాబు చెయ్యక, మంచి నడత నేర్పు
అమ్మాయి గారాలు పొతే గరిటతో రెండెయ్యి
అబ్బాయి తెలివి మీరితే పది వడ్డించు
రామ్ మోహన్ రాయ్, చంద్ర బోస్ లు రావక్కరలేదు
రాము గాడు, సూరి గాడు, పక్క సందులోని అరుణ
అందరూ ప్రతిభావంతులే అభివృద్ధికి వంతెనలే
ఒక్కడు, మరొక్కడు, ఇంక్కొక్కడు
ఇలా ముందడుగేస్తే భవిష్యత్తు సుసంపన్నం
మన కలలు సఫలం
మన పిల్లలు భద్రం
దేశ భవిత సుభిన్నం!

Exit mobile version