[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘చివరి ఊపిరి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]మ్మ కడుపులో
తొమ్మిది నెలల పాటు
ఎంతో పోరాటం చేసి
భూమి మీదకు వచ్చాం
క్షణికావేశంతోనో
సమస్యలు వున్నాయనో
విలువైన జీవితాన్ని
మధ్యలోనే తుంచేయడం కంటే
నమ్మకద్రోహం ఆత్మకు లేదు
అంతకంటే పిరికితనం వేరేది లేదు
ఆత్మహత్య చేసుకుంటే
పుట్టుకే నిన్ను అసహ్యించుకుంటుంది
తిట్టుకుని మరీ ఆత్మ అపహాస్యం అవుతుంది
గట్టు ఎపుడూ దూరంగానే ఉంటుంది
పట్టుబట్టి చేరుకోవాలి కానీ
నది మధ్యలో జలసమాధి కారాదు
జీవితం ఎంత భారమైనా
ఇష్టంగానే సాగించాలి
చివరి ఊపిరి కూడా నీదే అనిపించాలి.