Site icon Sanchika

చుక్ చుక్ రైలుబండి

[dropcap]చు[/dropcap]క్ చుక్ చుక్ రైలుబండి
చక చక చక సాగునండి – ఇది
భారతీయ రైలుబండి
బాధ్యతతో పయనించునండి
చుక్-చుక్-చుక్-చుక్ ॥చుక్॥

కులమతాలు లేని బండి
ప్రాంతం, భాష లేని దండి
ఎప్పుడైనా, ఎక్కడికైనా
గమ్యానికి క్షేమంగా చేర్చునండి
చుక్-చుక్-చుక్-చుక్ ॥చుక్॥

నేరోగేజైనా, మీటర్ గేజైనా
బ్రాడ్ గేజైనా, పట్టాలేవైనా
పట్టు తప్పక పరుగిడునండి
ప్రయాణమెంతో ప్రమోదమండి
చుక్-చుక్-చుక్-చుక్ ॥చుక్॥

స్టీమింజనైనా, డీజిలింజెనైనా
కరెంటింజనైనా, ఏ ఇంజనైనా
బండిని భలేగ లాగునంతె
గమనంలో యివి మేలుబంతె
చుక్-చుక్-చుక్-చుక్ ॥చుక్॥

Exit mobile version