Site icon Sanchika

చుక్కల ముగ్గు

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘చుక్కల ముగ్గు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సా[/dropcap]యంకాలం సెలవంటూ వెళ్లిపోగానే
నీలి రంగు కాగితంలా విచ్చుకుని
విశాలంగా పరుచుకుంది ఆకాశం

నేనేమో రాత్రంతా కూర్చుని
అందమయిన ‘చుక్కల’ ముగ్గేసాను

మిలమిలా మెరుస్తున్న
ఆ చుక్కల మెరుపుల్ని చూసి
చిక్కటి చీకటి చిరునవ్వు నవ్వింది
సంబరపడ్డ ఆకాశం
గుస గుసగా ముచ్చట పెట్టింది

తూర్పున తెల్లారగానే
సూర్యుడు వెలుతురు కిరణాల్ని కురిపించి
చుక్కల ముగ్గుల్ని చెరిపేసాడు

నేనూ ఆకాశం
దిగులు ముఖాలేసుకున్నాం

చీకటేమో
మళ్లొస్తానని చెప్పి
పత్తాలేకుండా పారిపోయింది

Exit mobile version