Site icon Sanchika

సినిమా క్విజ్-1

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. జగ్గయ్య నిర్మించిన ‘పదండి ముందుకు’ చిత్రంలో ఏ ప్రముఖ హీరో మొదటిసారి కనిపిస్తాడు?
  2. అక్కినేని ‘భార్యాభర్తలు’ చిత్రంలో అక్కినేని లవ్ చేస్తున్న అమ్మాయిలలో ఏ ప్రముఖ తార కనిపిస్తుంది?
  3. ‘సహస్ర శిరశ్ఛేద అపూర్వ చింతామణి’ చిత్రంలో విలన్‍గా నటించినదెవరు?
  4. ఎన్‍టిఆర్‌కు సతీమణిగా నటించిన జయలలిత తల్లి ‘సంధ్య’ గారు ఆయనకు తల్లిగా ఏ సినిమాలో నటించారు?
  5. నటి జయచిత్ర తల్లి అమ్మాజీ (జయశ్రీ) ఎన్‌టిఆర్‌తో హీరోయిన్‍గా ఏ సినిమాలో నటించారు?
  6. ఎన్‍టిఆర్, పద్మిని నటించిన ఏ జానపద చిత్రానికి డి. యోగానంద్ దర్శకత్వం వహించారు?
  7. అక్కినేని నటించిన ఓ చిత్రంలో పి.బి.శ్రీనివాస్ పాడిన పాట, రికార్డు రూపంలో వచ్చినా, తిరిగి అదే పాటను ఘంటసాలతో పాడించిన చిత్రం ఏది?
  8. హిందీ సంగీత దర్శకుడు ఓ.పి. నయ్యర్ సంగీతం అందించిన తెలుగు చిత్రం ఏది?
  9. హిందీ సంగీత దర్శకులు శంకర్-జైకిషన్‍ గార్లు సంగీతం అందించిన తెలుగు చిత్రం ఏది?
  10. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు హిందీలో ఒకే ఒక పాట పాడినది ఏ సినిమా?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 సెప్టెంబరు 13వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 1 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2022 సెప్టెంబరు 18 తేదీన వెలువడతాయి.

Exit mobile version