Site icon Sanchika

సినిమా క్విజ్-10

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. హిందీ చిత్రం ‘కాగజ్ కీ నావ్’ ఆధారంగా వచ్చిన తెలుగు చిత్రం ఏది?
  2. ఎ.ఎన్.ఆర్., సావిత్రి నటించిన ‘ఆరాధన’ ఏ పేరున హిందీలో వచ్చింది?
  3. ఎన్.టి.ఆర్. ‘తల్లా పెళ్ళామా’ చిత్రం హిందీలో ఏ పేరున వచ్చింది?
  4. ‘సంతోషమేలా, సంగీతమేలా, పొంగిపొరలే మనస్సీ వేళ’ పాట ఏ హిందీ చిత్రం పాటకు కాపీ? (క్లూ: చలం, కుసుమ గార్లు, అక్కినేని, సావిత్రి నటించిన ‘సంతానం’ చిత్రం లోనిది. సంగీత దర్శకుడు – సుసర్ల దక్షిణామూర్తి.)
  5. ‘నీలి మేఘమాలవో నీలాల తారవో’ అంటూ పి.బి. శ్రీనివాస్ పాడిన ఈ పాటకు ఆధారమైన హిందీ సినిమా?
  6. బిమల్ రాయ్ తీసిన ‘దో బీఘా జమీన్’ అనే హిందీ చిత్రాన్ని తెలుగులో ఏ పేరున తీశారు?
  7. ఎన్.టి.ఆర్. నటించిన తెలుగు చిత్రం ‘భలే తమ్ముడు’కి మాతృక అయిన హిందీ చిత్రం ఏది?
  8. షమ్మీ కపూర్, బి. సరోజా దేవి నాయికా నాయకులుగా, కథానాయకుడి తండ్రిగా పృథ్వీరాజ్ కపూర్ నటించిన హిందీ చిత్రం ఏది?
  9. కిషోర్ కుమార్, జమున హీరో హీరోయిన్‍లుగా నటించిన హిందీ చిత్రం ఏది?
  10. తెలుగు తార దేవిక నటించిన జెమిని వారి హిందీ చిత్రం ఏది?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 నవంబరు 15వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 10 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2022 నవంబరు 20 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 8 జవాబులు:

1.ఉమాసుందరి 2. ఆంచల్ 3. కళ్యాణ పరిసు 4. దాదీమా 5. రాజ్ కపూర్, మీనా కుమారి 6. జిందగీ 7. మన్‍మౌజీ, కిషోర్ కుమార్. 8. పూజా కే ఫల్ 9. కర్పగం 10. మంచి కుటుంబం

సినిమా క్విజ్ 8 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

Exit mobile version