సినిమా క్విజ్-103

0
1

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. పి.ఎస్. రామకృష్ణారావు దర్శకత్వంలో భానుమతి, జగ్గయ్య, అమర్‍నాథ్ నటించిన ‘వరుడు కావాలి’ (1957) చిత్రానికి మూలమైన అమెరికన్ చిత్రం ఏది?
  2. కె. బి. నాగభూషణం దర్శకత్వంలో అక్కినేని, ఎస్. వి. రంగారావు, ఎస్. వరలక్ష్మి నటించిన ‘సతీ సావిత్రి’ (1957) చిత్రానికి శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి గారు కథ అందించారు. ఈ సినిమాకి నిర్మాత ఎవరు?
  3. అశ్వత్థామ సంగీత దర్శకత్వంలో ఘంటసాల, పిఠాపురం నాగేశ్వర రావు పాడిన ‘నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా ఓ జీవా’ అనే పాటని ఏ సినిమాలో ఎవరి పై చిత్రీకరించారు? (క్లూ: దర్శకుడు పి. పుల్లయ్య, కథ సదాశివ బ్రహ్మం.)
  4. గురజాడ అప్పారావు గారి రచన ఆధారంగా ఎన్.టి.ఆర్., సావిత్రి, గుమ్మడి, షావుకారు జానకి నటించిన ‘కన్యాశుల్కం’ (1955) సినిమాలోని ‘బొమ్మల పెళ్ళి’ పాటలో ఆరేళ్ల పాపగా నటించిన ప్రముఖ తార ఎవరు?
  5. పి. పుల్లయ్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., అంజలి నటించిన ‘రేచుక్క’ (1954) చిత్రానికి అశ్వత్థామ సంగీతం అందించారు. ఈ సినిమాకి ప్రేరణ అయిన ఇంగ్లీషు సినిమా ఏది?
  6. పి. పుల్లయ్య దర్శకత్వంలో శాంతకుమారి, కౌశిక్ నటించిన ‘ధర్మదేవత’ (1952) చిత్రానికి సి.ఆర్. సుబ్బరామన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి స్క్రీన్‍ ప్లే అందించినదెవరు?
  7. డి. యోగానంద్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., లలిత, పద్మిని నటించిన ‘అమ్మలక్కలు’ (1953) చిత్రానికి సంగీతం సి.ఆర్. సుబ్బరామన్, జి. రామనాథన్ అందించగా, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అందించినదెవరు?
  8. శరత్‍చంద్ర నవల ‘నిష్కృతి’ ఆధారంగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని, ఎస్.వి.రంగారావు, కన్నాంబ, సావిత్రి నటించిన ‘తోడికోడళ్ళు’ (1957) చిత్రానికి ఎడిటర్ ఎవరు?
  9. తమిళ చిత్రం ‘మర్మవీరన్’ (1957) తెలుగులో ‘వేగుచుక్క’గా డబ్ చేయబడింది. ఇదులో శ్రీరాం, వైజయంతిమాల నటించగా అతిథులుగా ఒక పాటలో ఎన్.టి.ఆర్., శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎస్. వి. రంగారావు, ఆర్. నాగేశ్వరరావు కనిపిస్తారు. ఈ సినిమాకి నిర్మాత ఎవరు?
  10. సముద్రాల సీనియర్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి, జమున, గుమ్మడి నటించిన ‘వినాయక చవితి’ (1957) చిత్రంలో నారద పాత్రధారి ఎవరు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 ఆగస్టు 25 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 103 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 సెప్టెంబర్ 01 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 101 జవాబులు:

1.నల్లం నాగేశ్వరరావు 2. బి.ఎస్. రంగా 3. ఇద్దరు పెళ్లాలు (1954) 4. పెండ్యాల నాగేశ్వరరావు 5. పి. ఆదినారాయణ రావు 6. తోలేటి వెంకటరెడ్డి 7. బి. ఎన్. కొండారెడ్డి 8. బి. నరసింహారావు, మాస్టర్ వేణు 9. చెరపకురా చెడేవు (1955) 10. భలే రాముడు (1956)

సినిమా క్విజ్ 101 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • సిహెచ్.వి. బృందావన రావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • పి. వి. రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి
  • సునీతా ప్రకాశ్
  • శంబర వెంకట రామ జోగారావు
  • వనమాల రామలింగాచారి
  • జి. స్వప్నకుమారి
  • డి. సుధాకర్
  • కొన్నె ప్రశాంత్

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here