Site icon Sanchika

సినిమా క్విజ్-106

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, భానుమతి నటించిన ‘మల్లీశ్వరి’ చిత్రానికి మూలం బుచ్చిబాబు గారి ‘రాయలకరుణకృత్యం’ అనే నాటిక. ఈ సినిమాలో శ్రీ కృష్ణదేవరాయలుగా నటించిన నటుడు ఎవరు?
  2. కమలాకర కామేశ్వర రావు మొదటిసారిగా దర్శకత్వం వహించిన ‘చంద్రహారం’ (6–1-1954) చిత్రంలో ఎన్.టి.ఆర్, ఎస్.వి.ఆర్. శ్రీరంజని, సావిత్రి ముఖ్య తారాగణం. ఈ చిత్రంలో సావిత్రి పోషించిన పాత్ర పేరు?
  3. తాతినేని ప్రకాశరావు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో ఎన్టీఆర్, షావుకారు జానకి, కృష్ణకుమారి నటించిన ‘పిచ్చిపుల్లయ్య’ (17-7-1953) చిత్రానికి మాటలు అనిసెట్టి. ఈ చిత్రంలో ‘వసంత’ పాత్రలో నటించినదెవరు?
  4. పి.ఎస్.రామకృష్ణ దర్శకత్వంలో అక్కినేని, భానుమతి నటించిన ‘చక్రపాణి’ (19-03-1954) చిత్రానికి సంగీత దర్శకులెవరు?
  5. పి.ఎస్.రామకృష్ణ దర్శకత్వంలో అక్కినేని, భానుమతి, రేలంగి నటించిన ‘విప్రనారాయణ’ (10-12-1954) చిత్రంలో ‘మహరాజు’ పాత్ర వేసిన నటుడు ఎవరు?
  6. డి.యోగానంద్ దర్శకత్వంలో NTR, అంజలి, వహీదారెహ్మాన్, SVR, కాంతారావు నటించిన ‘జయసింహ’ (21-10-1955) చిత్రంలో వహీదారెహ్మాన్ తండ్రిగా రఘువీర్ పాత్రలో నటించినదెవరు?
  7. టి. ప్రకాశరావు దర్శకత్వంలో NTR, ANR, SVR, సావిత్రి, అంజలీదేవి నటించిన ‘చరణదాసి’ (20-12-1956) చిత్రానికి ఆధారం రవీంద్రనాథ ఠాగూరు రచించిన ‘నౌకాడూబి’. ఈ చిత్రంలో ‘బసవయ్య’ పాత్ర పోషించిన నటుడు ఎవరు?
  8. కె.వి. రెడ్డి దర్శకత్వంలో NTR, ANR, SVR, సావిత్రి నటించిన ‘మాయాబజార్’ (27-3-1957) చిత్రంలో ఘటోత్కచుడు (SVR), శశిరేఖ జాడ గురించి ఒక ముసలివాడిని అడగగా ఆ వృద్ధుడు తన శైలిలో ‘అటు నేనే ఇటు నేనే’ అంటూ పాట రూపంలో తత్వాలను బోధిస్తాడు. ఆ వృద్ధుడి వేషం వేసిన నటుడు ఎవరు?
  9. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఎన్టీఆర్, అంజలీదేవి, నాగయ్య, పద్మనాభం నటించిన ‘పాండురంగ మహాత్యం’ (28-11-1957) చిత్రం ద్వారా నటి బి. సరోజాదేవి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో దృత్తాసుర మరియు కుక్కుట ముని పాత్రలు పోషించిన నటుడు ఎవరు?
  10. అక్కినేని, అంజలీదేవి నటించిన ‘సువర్ణసుందరి’ (10-05-57) చిత్రానికి దర్శకుడు వేదాంతం రాఘవయ్య. ఈ చిత్రంలో ‘పార్వతి మాత’ గా నటించిన నటి ఎవరు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2024 సెప్టెంబర్ 17 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 106 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 సెప్టెంబర్ 22 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 104 జవాబులు:

1.రామనాథన్, పాండురంగం మరియు నాగయ్య 2. నమక్కళ్ రామలింగ కవిఙ్ఞర్ 3. రాజు పేద (1959) 4. ఆది ఎమ్. ఇరాని 5. మిస్సమ్మ (1955) 6. సంతోషం (1955) 7. విజయగౌరి (1955) 8. చింతామణి (1956) 9. జయం మనదే (1956) 10. ఎం.ఎల్.ఏ. (1957)

సినిమా క్విజ్ 104 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

Exit mobile version