[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- సి.ఎస్. రావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., రాజసులోచన, గిరిజ నటించిన ‘మంచి మనసుకు మంచి రోజులు’ (1958) చిత్రానికి ఆధారమైన తమిళ చిత్రం ఏది?
- కోవెలమూడి భాస్కర రావు దర్శకత్వంలో బాలయ్య, కృష్ణకుమారి, గిరిజ నటించిన ‘మనోరమ’ (1959) చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు?
- చంద్రమోహన్ దర్శకత్వంలో అమర్‍నాథ్, కృష్ణకుమారి, కాంతారావు, రాజనాల నటించిన ‘సతీ సుకన్య’ (1959) చిత్రంలో నారదుని పాత్ర పోషించినదెవరు?
- కైకాల సత్యనారాయణ పరిచయమైన ‘సిపాయి కూతురు’ (1959) సినిమాలో జమున, గుమ్మడి నటించగా, పి. చంగయ్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఆధారమైన, అదే పేరుతో ఉన్న నవలని రాసినది ఎవరు?
- సముద్రాల సీనియర్ దర్శకత్వంలో కాంతారావు, జమున నటించిన ‘భక్త రఘునాథ్’ (1960) సినిమాలో శ్రీకృష్ణుని పాత్రలో నటించినదెవరు?
- పి.ఎస్. రామకృష్ణ దర్శకత్వంలో అక్కినేని, భానుమతి, షావుకారు జానకి నటించిన ‘బాటసారి’ (1961) సినిమాలో ధారాపురం జమీందారుగా నటించినదెవరు?
- బి.ఎ. సుబ్బారావు దర్శకత్వంలో, ఎన్.టి.ఆర్., అంజలీదేవి, కాంతారావు, హరనాథ్ నటించిన ‘భీష్మ’ (1962) సినిమాలో కర్ణుడి పాత్ర పోషించిన నటుడు ఎవరు?
- బి. విఠలాచార్య దర్శకత్వంలో కాంతారావు, కృష్ణకుమారి నటించిన ‘గురువును మించిన శిష్యుడు’ (1963) సినిమాలో గురువు పాత్రధారి ఎవరు?
- కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో, ఎన్.టి.ఆర్., సావిత్రి, ఎస్.వి. రంగారావు, ముక్కామల నటించిన ‘నర్తనశాల’ (1963) సినిమాలో ఊర్వశి పాత్ర పోషించిన నటి ఎవరు?
- బి.ఎస్. నారాయణ దర్శకత్వంలో, ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి, రాజసులోచన నటించిన ‘శ్రీ తిరుపతమ్మ కథ’ (1963) సినిమాలో వేంకటేశ్వర స్వామిగా నటించినదెవరు?
~
ఈ ప్రశ్నలకు జవాబులను 2024 సెప్టెంబర్ 24 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 107 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 సెప్టెంబర్ 29 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 105 జవాబులు:
1. ఆడపెత్తనం (1958) 2. మహంకాళి వెంకయ్య 3. గురజాడ అప్పారావు గారి ‘సారంగధర’ 4. ముద్దు బిడ్డ (1956) 5. ఎం.ఎ. రహిమాన్, ప్రసాద్ మరియు రాజామణి. 6. రాజనాల 7. పి. భానుమతి 8. పాలగుమ్మి పద్మరాజు 9. నాగభూషణం 10. శోభ (1958)
సినిమా క్విజ్ 105 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- సిహెచ్.వి. బృందావన రావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- కృష్ణప్రియ ఆకుల
- మంజుల దత్త కె
- పి.వి. రాజు
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- సునీతా ప్రకాశ్
- శంభర వెంకట రామ జోగారావు
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]
[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]