[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- తమిళ చిత్రం ‘చెళ్లపిళ్లయ్’ (1955)ను తెలుగులో ఎవిఎమ్ వారు అక్కినేని, సావిత్రి లతో ఎం.వి. రామన్ దర్శకత్వంలో రీమేక్ చేశారు. తోలేటి వెంకటరెడ్డి మాటలు అందించిన ఆ సినిమా ఏది?
- ఎన్.టి.ఆర్., అక్కినేని, భానుమతి, జమున నటించిన ‘తెనాలి రామకృష్ణ’ (1956) చిత్రంలో, అప్పాజీగా నాగయ్య నటించగా, బాబర్ చక్రవర్తిగా నటించినదెవరు?
- ఎం.జి.రామచంద్రన్ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ (1958, తమిళంలో ‘నాడోడి మన్నన్’) అనే డబ్బింగ్ సినిమాలో ఎం.జి.ఆర్., భానుమతి, బి. సరోజాదేవి నటించారు. కొంత కలర్‍లో తీసిన ఈ సినిమా ఛాయాగ్రాహకుడెవరు?
- ఎన్.టి.ఆర్. తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘సీతారామ కల్యాణం’ (1961) చిత్రంలో రామునిగా హరనాథ్, రావణునిగా ఎన్.టి.ఆర్. నటించారు. ఈ సినిమాలో బ్రహ్మ పాత్ర పోషించినదెవరు?
- చార్లెస్ డికెన్స్ వ్రాసిన ఆంగ్ల నవల ‘ఆలివర్ ట్విస్ట్’ (1838) ఆధారంగా తెలుగులో కె.బి. తిలక్ దర్శకత్వంలో కాంతారావు, జగ్గయ్య, రామకృష్ణ, రాజసులోచన నటించిన చిత్రానికి కథ, మాటలు కొండేపూడి లక్ష్మీనారాయణ రాశారు. ఆ సినిమా ఏది? (క్లూ: ‘ఏస్కో నా రాజా ఏస్కో అహా ఏస్కో నా రాజా ఆకేస్కో’ పాట ఈ సినిమా లోదే)
- కె. కామేశ్వరరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., అక్కినేని, ఎస్.వి.ఆర్., సావిత్రి జమున నటించిన ‘గుండమ్మ కథ’ (1956) చిత్రానికి డి. వి. నరసరాజు వ్రాశారు. విలియం షేక్‌స్పియర్ రచించిన ఏ నాటకం ఈ సినిమా కథకి ఆధారం?
- బి. విఠలాచార్య దర్శకత్వంలో రాజనాల, కాంతారావు, రాజసులోచన నటించిన ‘ఖైదీ కన్నయ్య’ (1962) చిత్రానికి నిర్మాత డూండీ. ఈ సినిమాలో జైలర్ పాత్ర పోషించిన నటుడెవరు?
- ఎం. మల్లికార్జున రావు దర్శకత్వంలో వచ్చిన ‘గూఢచారి 116’ (1966) చిత్రంలో కృష్ణ, జయలలిత నటించారు. తెలుగులో తొలి స్పై మూవీగా పరిగణించబడే ఈ చిత్రానికి కథ అందించినదెవరు?
- ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1965 లో వచ్చిన తొలి సాంఘిక వర్ణ చిత్రం ‘తేనెమనసులు’. నూతన నటీనటులు కృష్ణ, రామ్‌మోహన్, సుకన్య, సంధ్యారాణి నటించిన ఈ చిత్రానికి కె.ఆర్.కె మోహన్ రచించిన ఏ నవల ఆధారం?
- పి.ఎస్. రామకృష్ణ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., భానుమతి నాగయ్య నటించిన ‘వివాహబంధం’ (1964) చిత్రానికి ఏ బెంగాలీ సినిమా ఆధారం??
~
ఈ ప్రశ్నలకు జవాబులను 2024 అక్టోబర్ 01వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 108 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 అక్టోబర్ 06 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 106 జవాబులు:
1.శ్రీవత్స 2. చంచల 3. షావుకారు జానకి 4. భానుమతి 5. వల్లభజోశ్యుల శివరాం 6. డా. కామరాజు 7. గోవిందరాజుల సుబ్బారావు 8. కంచి నరసింహా రావు 9. కె.వి.ఎస్.శర్మ 10. ఇ.వి. సరోజ
సినిమా క్విజ్ 106 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- సిహెచ్.వి. బృందావన రావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- కృష్ణప్రియ ఆకుల
- పి.వి. రాజు
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]
[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]