Site icon Sanchika

సినిమా క్విజ్-109

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., ఎస్. వి. రంగారావు, దేవిక నటించిన ‘ఆడబ్రతుకు’ (1965) చిత్రంలో షేర్ ఖాన్ పాత్రలో నటించినదెవరు?
  2. సి.ఎస్. రావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., రఘురామయ్య, రాజసులోచన, లీలావతి నటించిన ‘వాల్మీకి’ (1963) చిత్రంలో లక్ష్మీదేవి పాత్రలో నటించినదెవరు?
  3. తాపీ చాణక్య దర్శకత్వంలో కాంతారావు, జగ్గయ్య, కృష్ణకుమారి నటించిన ‘కానిస్టేబుల్ కూతురు’ (1963) చిత్రంలో తెలుగులో బాలనటిగా తొలిసారి నటించిన హీరోయిన్ ఎవరు?
  4. పి. పుల్లయ్య దర్శకత్వంలో అక్కినేని, సావిత్రి, గుమ్మడి, వాసంతి నటించిన ‘సిరి సంపదలు’ (1962) చిత్రానికి ఛాయాగ్రాహకుడెవరు?
  5. సి.ఎస్. రావు దర్శకత్వంలో కాంతారావు, జగ్గయ్య, జమున, రామకృష్ణ నటించిన ‘పెళ్ళి కాని పిల్లలు’ (1961) చిత్రానికి మాతృక మరాఠీలో వచ్చిన ‘అవగాచి సంసార్’. ఈ చిత్రానికి ప్రేరణ అయిన ఆంగ్ల నవల ఏది?
  6. ముక్కామల కృష్ణమూర్తి దర్శకత్వంలో హరనాథ్, రాజసులోచన, గుమ్మడి నటించిన ‘ఋష్యశృంగ’ (1961) సినిమాలో ఇంద్రునిగా నటించినదెవరు?
  7. కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో అక్కినేని, కృష్ణకుమారి, రేలంగి, పద్మనాభం నటించిన ‘భార్యాభర్తలు’ (1961) సినిమాకి ‘పెణ్‌మానం’ అనే తమిళ నవల మూలం. ఈ నవలని వ్రాసిన రచయిత్రి ఎవరు?
  8. పి. పుల్లయ్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., సావిత్రి, ఎస్. వరలక్ష్మి నటించిన ‘శ్రీ వేంకటేశ్వర మహత్యం’ (1960) చిత్రంలో ఆకాశరాజు పాత్రలో నటించినదెవరు?
  9. ఎస్. ఎం. శ్రీరాములు దర్శకత్వంలో తెలుగులో ఎన్.టి.ఆర్., సావిత్రి, రాజనాలతో ‘విమల’ (1960) పేరుతోనూ, తమిళంలో శివాజీ గణేశన్, పద్మినీలతో ‘మరగతం’ పేరుతోనూ వచ్చిన సినిమాకి మూలమైన ఆంగ్ల నవల ఏది? రచించినదెవరు?
  10. ఐ.ఎన్. మూర్తి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., బాలయ్య, గుమ్మడి, శోభన్ బాబు, కృష్ణకుమారి, గిరిజ, నిర్మలమ్మ, రేలంగి నటించిన ‘ఇరుగుపొరుగు’ (1963) చిత్రంలో ‘కాంచన మాల’ పాత్రలో నటించినదెవరు?

~

ఈ ప్రశ్నలకు జవాబులను 2024 అక్టోబర్ 08వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 109 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 అక్టోబర్ 13 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 107 జవాబులు:

1) థాయ్ పిరంధాల్ వాజి పిరక్కుమ్ 2) రమేష్ నాయుడు 3) పద్మనాభం 4) కొవ్వలి లక్ష్మీ నరసింహారావు 5) ఎన్.టి.రామారావు 6) దొరైస్వామి 7) గుమ్మడి 8) ముక్కామల 9) పద్మినీ ప్రియదర్శిని 10) రామకృష్ణ

సినిమా క్విజ్ 107 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

Exit mobile version