[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- ఎస్. డి. లాల్ దర్శకత్వంలో కాంతారావు, రాజశ్రీ, దండమూడి రాజగోపాల్, ముక్కామల, హరనాథ్ నటించిన ‘భీమాంజనేయ యుద్ధం’ (1966) సినిమాలో ఆంజనేయస్వామి పాత్రధారి ఎవరు?
- కె. బి. తిలక్ దర్శకత్వంలో జగ్గయ్య, కృష్ణకుమారి, వాసంతి నటించిన ‘ఉయ్యాల జంపాల’ (1965) చిత్రానికి ఆరుద్ర పాటలు రాశారు. ఈ సినిమాకి మూలమైన హిందీ సినిమా ఏది?
- తమిళ చిత్రం ‘దైవతాయి’ ఆధారంగా విజయ వారు తాపీ చాణక్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జమున, గుమ్మడి గార్లతో తీసిన ‘సి.ఐ.డి.’ (1965) చిత్రానికి కథ అందించనదెవరు?
- తాపీ చాణక్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., అంజలీదేవి, ఎస్.వి. రంగారావు నటించిన ‘బాల నాగమ్మ’ (1959) చిత్రంలో బాలవర్ధిగా నటించినదెవరు?
- జంపన చంద్రశేఖర రావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., అంజలీదేవి, కాంతారావు నటించిన ‘భట్టి విక్రమార్క’ (1960) చిత్రంలో ఇంద్రునిగా నటించినదెవరు?
- ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని (తొలిసారి ద్విపాత్రిభినయం) రాజసులోచన, ఇ.వి.సరోజ, గుమ్మడి, శారద నటించిన ‘ఇద్దరు మిత్రులు’ (1961) చిత్రానికి మూలం ‘తాషేర్ ఘర్’ (1957) ఆధారం. తెలుగు చిత్రానికి సంభాషణలు అందించినదెవరు?
- వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జగ్గయ్య, జమున, బి సరోజాదేవి, ఇ.వి.సరోజ, కన్నాంబ నటించిన ‘ఇంటికి దీపం ఇల్లాలే’ (1961) చిత్రానికి ప్రేరణ అయిన అమెరికన్ సినిమా ఏది?
- పి.ఎస్. రామకృష్ణారావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., సావిత్రి, యస్వీ రంగారావు, కన్నాంబ, రేలంగి, గిరిజ నటించిన ‘ఆత్మబంధువు’ (1962) చిత్రానికీ, 1960లో వచ్చిన తమిళ చిత్రం ‘పడిక్కాద మేదై’కీ మూలం, ప్రముఖ బెంగాలీ రచయిత్రి ఆశాపూర్ణాదేవి నవల ఆధారంగా రూపొందిన, బెంగాలీ చిత్రం ఏది?
- ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని, సావిత్రి, శోభన్ బాబు, కృష్ణకుమారి నటించిన ‘చదువుకున్న అమ్మాయిలు’ (1963) చిత్రానికి, డా. పి. శ్రీదేవి రచించిన ఏ నవల ఆధారం?
- 1959లో పి. పుల్లయ్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., సావిత్రి, రాజనాల నటించిన ‘బండరాముడు’ చిత్రంలో మహారాజుగా నటించినదెవరు?
~
ఈ ప్రశ్నలకు జవాబులను 2024 అక్టోబర్ 15వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 110 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 అక్టోబర్ 20 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 108 జవాబులు:
1.వదిన 2. కామరాజు 3. జి.కె. రాము 4. ఎం. కామేశ్వరరావు 5. చిట్టి తమ్ముడు (1962) 6. ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ (The Taming of the Shrew) 7. గుమ్మడి 8. ఆరుద్ర 9. వక్రించిన సరళరేఖలు 10. సాత్ పాకె బాంధా (1963)
సినిమా క్విజ్ 108 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- సిహెచ్.వి. బృందావన రావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- పి.వి. రాజు
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- వనమాల రామలింగాచారి
- జి. స్వప్న కుమారి
- మాచ గోవర్ధన్
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]
[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]