Site icon Sanchika

సినిమా క్విజ్-112

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. డి. యోగానంద్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., జమున, సి.ఎస్.ఆర్. నటించిన ‘వచ్చిన కోడలు నచ్చింది’ (1959) చిత్రానికి కథ అందించినదెవరు?
  2. ఎస్. రజనీకాంత్ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి, సావిత్రి, గుమ్మడి నటించిన ‘దీపావళి’ (1960) చిత్రంలో దేవమాత అదితిగా నటించినదెవరు?
  3. కృష్ణారావు దర్శకత్వంలో జగ్గయ్య, కృష్ణకుమారి, రామకృష్ణ దేవిక నటించిన ఈ చిత్రం ద్వారా ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకులుగా పరిచయమయ్యారు. అది ఏ సినిమా? (క్లూ: ‘ఈ రేయి హాయి ఈ పూల తావి నీలాల నీడల’ అనే పాట ఈ సినిమాలోనిదే).
  4. కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో అక్కినేని, కృష్ణకుమారి నటించిన ‘పునర్జన్మ’ (1963) చిత్రానికి గుల్షన్ నందా రచించిన ఏ నవల ఆధారం?
  5. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., బి. సరోజాదేవి, పద్మనాభం, గుమ్మడి నటించిన ‘దాగుడుమూతలు’ (1964) చిత్రం ప్లాట్‌కి ఏ అమెరికా సినిమా ప్రేరణ?
  6. వి. మధుసూదనరావు దర్శకత్వంలో అక్కినేని, భానుమతి, కృష్ణకుమారి నటించిన ‘అంతస్తులు’ (1963) చిత్రానికి ఆచార్య ఆత్రేయ సంభాషలు వ్రాశారు. కథ సమకూర్చినదెవరు?
  7. కె. హేమాంబరధర రావు దర్శకత్వంలో హీరో హీరోయిన్లుగా ఎన్‍.టి.ఆర్., సావిత్రితో పాటు ఎస్.వి.ఆర్, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, కాంతారావు, రాజబాబు, నగేష్, అంజలీదేవి, జమున, కృష్ణకుమారి, షావుకారు జానకి, వాణిశ్రీ కనబడిన చిత్రం ఏది? వీటూరి కథ అందించిన ఈ సినిమాకి ఎస్.పి. కోదండపాణి సంగీతం అందించారు. 24 జూలై 1965న విడుదలైన ఆ సినిమా ఏది? (క్లూ: ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి’ పాట ఈ సినిమాలోదే).
  8. బి. విఠలాచార్య దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., రాజశ్రీ, వాణిశ్రీ నటించిన ‘అగ్గిబరాటా’ (1966) చిత్రంలో ‘కొండబూచోడు’ పాత్ర పోషించిన నటుడెవరు?
  9. ఎస్.డి.లాల్ దర్శకత్వంలో ఎస్.వి.రంగారావు, హరనాథ్, కృష్ణకుమారి నటించిన ‘మొనగాళ్ళకు మొనగాడు’ (1966) చిత్రంలోని ఒక ఖవాలి జుగల్‌బందీ పాటలో అభినయించిన నటి ఎవరు?
  10. తాతినేని రామారావు దర్శకత్వంలో అక్కినేని సావిత్రి, గుమ్మడి నటించిన ‘నవరాత్రి’ (1966) చిత్రంలో నటీమణులు జయలలిత, కాంచన, జమున, గిరిజ, సూర్యకాంతం, ఛాయాదేవి, గీతాంజలి – అతిథి పాత్రలలో ఎక్కడ (ఏ సన్నివేశంలో) కనిపిస్తారు?

~

ఈ ప్రశ్నలకు జవాబులను 2024 అక్టోబర్ 29వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 112 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 నవంబర్ 03 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 110 జవాబులు:

1.కామినేని ఈశ్వరరావు 2. ఝూలా 3. కె. బాలచందర్ 4. మాస్టర్ సత్యనారాయణ 5. మిక్కిలినేని 6. కొర్రపాటి గంగాధర రావు 7. సబ్రీనా (1954) 8. జోగ్ బియోగ్ 9. కాలాతీత వ్యక్తులు 10. రేలంగి

సినిమా క్విజ్ 110 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]

Exit mobile version