[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- 1968లో దర్శకుడు అద్దాల నారాయణరావు – కృష్ణ, జమునలతో తీసిన ‘అమాయకుడు’ చిత్రానికి మూలమైన హిందీ చిత్రం ఏది?
- ఎస్. వి. రంగారావు దర్శకత్వంలో, ధూళిపాళ, సావిత్రి, ఎస్. వి. రంగారావు, లక్ష్మి నటించిన ‘బాంధవ్యాలు’ (1968) చిత్రానికి ఏ తమిళ సిమినా మూలం?
- దర్శకులు బాపు 1994లో నరేష్, దివ్యవాణి లతో ‘పెళ్ళికొడుకు’ అనే సినిమా తీశారు. కానీ ఇదే కథతో 1968లోనే బాపు దర్శకత్వంలో వచ్చిన సినిమాలో చంద్రమోహన్, విజయనిర్మల నటించారు. ఆ సినిమా ఏది?
- 1967లో విడుదలైన తమిళ చిత్రం ‘పెణ్ణి నీ వాళ్గ’ చిత్రం ఆధారంగా తెలుగులో, టి. రామారావు దర్శకత్వంలో అక్కినేని, జయలలితలతో రూపొందిన చిత్రం ఏది? (క్లూ: ‘ఒక్కసారి సిగ్గుమాని నన్ను చూడండి శ్రీవారు’ అనే పాట ఇందులోనిదే)
- వి. మధుసూదనరావు దర్శకత్వంలో అక్కినేని, కృష్ణ, జానకి, విజయనిర్మల నటించిన ‘మంచి కుటుంబం’ (1968) సినిమాకి ఏ అమెరికన్ సినిమా ఆధారం?
- వి. రామచంద్రరావు దర్శకత్వంలో కృష్ణ, కాంచన, కృష్ణంరాజు, నాగభూషణం, చంద్రమోహన్ నటించిన ‘నేనంటే నేనే’ (1968) సినిమాకి తమిళ చిత్రం ‘నాన్’ (1967) ఆధారం. తెలుసు వెర్షన్‍లో భూపతి (డాన్) పాత్రలో నటించినదెవరు?
- జి. విశ్వనాథం దర్శకత్వంలో కాంతారావు, రాజశ్రీ, గుమ్మడి, రాజనాల నటించిన ‘అగ్గిమీద గుగ్గిలం’ (1968) చిత్రానికి సంభాషణలు వ్రాసినదెవరు?
- చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి ‘గయోపాఖ్యానం’ నాటకం ఆధారంగా కె. వి. రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., అక్కినేని, బి. సరోజ, ఎస్. వరలక్ష్మిలతో 1963 తీసిన తెలుగు సినిమా ఏది?
- సి.ఎస్. రావు దర్శకత్వంలో అక్కినేని, కృష్ణకుమారి, రాజసులోచన, కాంతారావు నటించిన ‘శాంతి నివాసం’ (1960) చిత్రానికి పాలగుమ్మి పద్మరాజు గారి ఏ నాటకం ఆధారం?
- బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., రాజసులోచన, కన్నాంబ, గుమ్మడి, పద్మనాభం నటించిన ‘రాజ మకుటం’ (1960) చిత్రానికి కథ, మాటలు అందించినదెవరు?
~
ఈ ప్రశ్నలకు జవాబులను 2024 నవంబర్ 12వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 114 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 నవంబర్ 17 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 112 జవాబులు:
1.ఆచార్య ఆత్రేయ 2. ఋష్యేంద్రమణి 3. కన్నకొడుకు (1961) 4. పత్తర్ కీ హోంట్ 5. Mr. Deeds Goes to Town (1936) 6. జావర్ సీతారామన్ 7. దేవత 8. ముక్కామల 9. సావిత్రి 10. పిచ్చాసుపత్రిలో రోగులుగా
సినిమా క్విజ్ 112 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- సిహెచ్.వి. బృందావన రావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- మంజులదత్త కె
- పి.వి. రాజు
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి
- శంభర వెంకట రామ జోగారావు
- సునీతా ప్రకాష్
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]
[ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 సంప్రదించగలరు]