Site icon Sanchika

సినిమా క్విజ్-116

‘సినిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. సి.ఎస్. రావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., దేవిక, కృష్ణ, జయలలిత, నాగభూషణం నటించిన ‘నిలువుదోపిడి’ (1968) సినిమాలో మంత్రివర్యుని పాత్ర పోషించిన నటుడెవరు?
  2. కన్నడంలో ‘దుడ్డు దొడ్డప్ప’ పేరుతో వచ్చిన సినిమాని వి.మధుసూదనరావు దర్శకత్వంలో ఎస్.వి. రంగారావు, అంజలీదేవి, శోభన్ బాబు, కృష్ణ, భారతి, వాణిశ్రీలతో తెలుగులో ఏ పేరుతో రీమేక్ చేశారు? (క్లూ: ‘ధనమేరా అన్నిటికి మూలం’ అనే పాట ఇందులోనిదే)
  3. హిందీలో ‘దస్ లాఖ్’ పేరుతో వచ్చిన సినిమాని తెలుగులో తాతినేని రామారావు దర్శకత్వంలో హరనాథ్, విజయనిర్మల, నాగభూషణం లతో ఏ పేరుతో రీమేక్ చేశారు? (క్లూ: ‘ఆకలిమంటలు బాబు ఇవి ఆరని మంటలు బాబు’ అనే పాట ఇందులోనిదే)
  4. హిందీలో ‘దూర్ గగన్ కీ ఛావోం మే’ పేరుతో వచ్చిన సినిమా ఆధారంగా ఎ.వి.ఎం. వారు తెలుగు, తమిళంలో ఒకేసారి ‘రాము’ అనే సినిమా తీశారు. తెలుగులో ఎన్. టి. ఆర్., జమున, మాస్టర్ రాజ్‍కుమార్, రాజనాల, రేలంగి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి మూల కథ అందించినదెవరు?
  5. శ్రీకాంత్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు, సావిత్రి, రాం మోహన్, పద్మనాభo నాగభూషణం నటించిన ‘తల్లిప్రేమ’ (1968) చిత్రాన్ని 1971లో తమిళంలో ‘కులమా గుణమా’ అనే పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమానే తిరిగి 1991లో ‘నా ఇల్లే నా స్వర్గం’ పేరుతో తీశారు. ఈ సినిమాకి మూలకథ అందించినదెవరు?
  6. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కాంతారావు, అంజలీదేవి, అర్జా జనార్ధన రావు, ఎస్. వి. రంగారావు నటించిన ‘వీరాంజనేయ’ (1968) చిత్రంలో అర్జునుడి పాత్ర పోషించిన నటుడెవరు?
  7. వి.మధుసూదనరావు దర్శకత్వంలో అక్కినేని, వాణిశ్రీ, చంద్రమోహన్ నటించిన ‘ఆత్మీయులు’ (1969) చిత్రానికి కథ అందించినదెవరు?
  8. హిందీలో వచ్చిన ‘చైనా టౌన్’ అనే సినిమాని తెలుగులో బి. ఎ. సుబ్బారావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కె. ఆర్. విజయ, రేలంగి, రాజనాల గార్లతో ‘భలే తమ్ముడు’ (1969) పేరిట రీమేక్ చేశారు. ఈ సినిమాలో ‘పాల్’ అనే పాత్రలో నటించినదెవరు?
  9. హిందీలో వచ్చిన ‘ఆంచల్’ అనే సినిమాని తెలుగులో సావిత్రి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., సావిత్రి, శోభన్‍బాబులతో ‘మాతృదేవత’ (1969) పేరిట రీమేక్ చేశారు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్. కూతురిగా నటించినదెవరు?
  10. అక్కినేని సంజీవి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, షావుకారు జానకి, విజయనిర్మల నటించిన ‘అక్కాచెల్లెలు’ (1970) చిత్రానికి మూలం శాండో చిన్నప్పదేవర్ 1969లో నిర్మించిన అక్కై-తంగై అనే తమిళ సినిమా. ఈ సినిమాకి మూలకథ అందించినదెవరు?

~

ఈ ప్రశ్నలకు జవాబులను 2024 నవంబర్ 26వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 116 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 డిసెంబర్ 01 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 114 జవాబులు:

1.అనాడి (రాజ్‍కపూర్, నూతన్) 2. కన్‌కండ దైవమ్ 3. బంగారు పిచిక 4. బ్రహ్మచారి 5. The Remarkable Mr. Pennypacker 6. నెల్లూరు కాంతారావు 7. పింగళి నాగేంద్రరావు 8. శ్రీకృష్ణార్జున యుద్ధం 9. శాంతి నివాసం 10. డి. వి. నరసరాజు

సినిమా క్విజ్ 114 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.
  2. ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version