[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- తమిళచిత్రం ‘పాపమణిప్పు’ ఆధారంగా, 1970లో ఏ. భీమ్‌సింగ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే కుటుంబం’ చిత్రంలో ఎన్.టి.ఆర్., కాంతారాఅవు, లక్ష్మి, రాజశ్రీ, నాగభూషణం తదితరులు నటించారు. ఈ సినిమాలో ‘ఇస్మాయిల్’ పాత్రలో నటించినదెవరు?
- శూద్రకుడు రచించిన 5వ శతాబ్దపు నాటకం ‘మృచ్ఛకటికం’ ఆధారంగా బి.ఎస్. రంగా దర్శకత్వంలో, అక్కినేని, అంజలీదేవి, పద్మిని (తెలుగులో ఆఖరి చిత్రం) నటించిన ఈ 1967నాటి చిత్రానికి మాటలు సదాశివబ్రహ్మం, సంగీతం ఎస్. రాజేశ్వరరావు అందించారు. ఈ చిత్రంలో వసంతసేనగా నటించినదెవరు?
- కమలాకర కామేశ్వరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., దేవిక, రామకృష్ణ, శోభన్ బాబు, ఎస్. వరలక్ష్మి నటించిన ‘శ్రీకృష్ణావతారం’ (1967) సినిమాలో జాంబవతిగా నటించినదెవరు?
- అంజలీదేవి సతీ సుమతిగా, సతీ అనసూయగా ద్విపాత్రిభియనం చేసిన ‘సతీ సుమతి’ (1967) చిత్రంలో అక్కినేని, జగ్గయ్య, సావిత్రి, జమున, కృష్ణకుమారి అతిథి పాత్రలలో కనిపిస్తారు. ఈ సినిమాలో ఈశ్వరునిగా నటించినదెవరు?
- సి.ఎస్. రావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కాంతారావు, కైకాల సత్యనారాయణ, సావిత్రి, ఉదయ్ కుమార్, నాగయ్య తదితరులు నటించిన ‘కంచుకోట’ (1967) చిత్రంలో శౌర్యవర్మ కుమార్తె జయంతి పాత్రలో నటించినదెవరు?
- విజయారెడ్డి దర్శకత్వంలో కాంతారావు, శారద నటించిన ‘శ్రీమతి’ (1966) చిత్రానికి మాటలు వీటూరి అందించారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు?
- బి. హరినారాయణ దర్శకత్వంలో 1970లో కాంతారావు (తొలిసారి ద్విపాత్రాభినయం), రాజశ్రీ, రాజనాల, లక్ష్మి నటించిన ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల. కథ మాటలు జి. కృష్ణమూర్తి. ఈ సినిమా పేరేమిటి? (క్లూ: ‘భళిరా భళిరా ఫణం ఫణం’ పాట ఇందులోనిదే)
- హిందీ సినిమా ‘పాకెట్ మార్’ (1956) ఆధారంగా, సి.ఎస్. రావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కైకాల సత్యనారాయణ, చలం, విజయనిర్మల నటించిన ఈ చిత్రానికి రచన భమిడిపాటి రాధాకృష్ణ. సంగీతం టి.వి. రాజు. ఈ సినిమా పేరేమిటి?
- డి. యోగానంద్ దర్శకత్వంలో 1970లో అక్కినేని, కృష్ణంరాజు, భారతి (ద్విపాత్రాభినయం), సూర్యకాంతం, జి.వరలక్ష్మి నటించిన ‘జై జవాన్’ చిత్రానికి కథ అందించినదెవరు?
- బసవరాజు పద్మనాభం దర్శకత్వంలో వాణిశ్రీ, హరనాథ్, శోభన్ బాబు నటించిన ‘కథానాయిక మొల్ల’ (1970) చిత్రానికి ఎస్. పి. కోదండపాణి సంగీతం అందించారు. ఈ సినిమాలో శ్రీకృష్ణదేవరాయలిగా నటించినదెవరు?
~
ఈ ప్రశ్నలకు జవాబులను 2024 డిసెంబర్ 17వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సినిమా క్విజ్ 119 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 డిసెంబర్ 22 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 117 జవాబులు:
1.కైకాల సత్యనారాయణ 2. పెళ్ళిరోజు 3. భలే రంగడు 4. సి. నారాయణరెడ్డి 5. రేలంగి 6. షెరేడ్ (Charade) 7. వ్యాసుడు 8. లోగుట్టు పెరుమాళ్ళకెరుక 9. రమణారెడ్డి 10. స్వర్ణ
సినిమా క్విజ్ 117 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- మంజుల దత్త కె., ఆదోని
- పి.వి.రాజు
- రామకూరు నాగేశ్వరరావు
- రామలింగయ్య టి, తెనాలి
- సునీతా ప్రకాశ్, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
- వనమాల రామలింగాచారి, యాదగిరిగుట్ట
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.
- ఈ సినిమా క్విజ్కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
- క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.