[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- కె. రాఘవేంద్రరావు గారి ‘త్రిశూలం’ సినిమా హిందీలో ఏ పేరుతో వచ్చింది?
- ఎన్.టి.రామారావు గారి ‘వేటగాడు’ చిత్రం హిందీలో ఏ పేరుతో వచ్చింది?
- అక్కినేని నాగేశ్వరరావు గారి ‘ప్రేమాభిషేకం’ చిత్రం హిందీలో ఏ పేరుతో వచ్చింది?
- హిందీ చిత్రం ‘రోటీ కపడా ఔర్ మకాన్’ తెలుగులో ఏ పేరుతో వచ్చింది?
- హిందీ చిత్రం ‘హాథ్ కీ సఫాయి’ తెలుగులో ఏ పేరుతో వచ్చింది?
- హిందీ చిత్రం ‘నసీబ్’ (అమితాభ్) తెలుగులో ఏ పేరుతో వచ్చింది?
- హిందీ చిత్రం ‘లవ్ ఆజ్ కల్’ తెలుగులో ఏ పేరుతో వచ్చింది?
- హిందీ చిత్రం ‘దబాంగ్’ తెలుగులో ఏ పేరుతో వచ్చింది?
- 1973 సంవత్సరంలో వచ్చిన జయబాదురి చిత్రం ‘అనామిక’ తెలుగులో ఏ పేరుతో వచ్చింది?
- 1973 సంవత్సరంలో వచ్చిన రాజేష్ ఖన్నా హీరోగా వచ్చిన ‘దాగ్’ చిత్రం తెలుగులో ఏ పేరుతో వచ్చింది?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 డిసెంబరు 06వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 13 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2022 డిసెంబరు 11 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 11 జవాబులు:
1.కుముదం 2. పాశం 3. గాలిమేడలు 4. రాజపుత్ర రహస్యం 5. దొంగనోట్లు 6. గుడిగంటలు 7. సుమంగళి 8. భామా విజయం 9. వద్దంటే డబ్బు 10. సత్యజిత్ రాయ్ (దేవకీబోస్ బంగారు పాప సినిమా బెంగాలీ రీమేక్ దర్శకులు)
సినిమా క్విజ్ 11 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- జానకీ సుభద్ర పెయ్యేటి
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- ఎస్. సునీతా ప్రకాష్
- వనమాల రామలింగాచారి
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]