సినిమా క్విజ్-15

0
1

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. అక్కినేని నాగేశ్వరరావు నటించిన 60వ చిత్రం ఏది?
  2. అక్కినేని నటించిన నూరవ చిత్రం తమిళ చిత్రం కాగా, ఎన్.టి.ఆర్. నటించిన 100వ చిత్రం తెలుగులోనిది. ఆ సినిమాల పేర్లు?
  3. ‘జంబలకిడిపంబ’ అనే ఊతపదం రేలంగి గారు ఏ చిత్రంలో వాడారు?
  4. ‘భైరవద్వీపం’ చిత్రంలో మాంత్రికుడు తన మంత్రదందం ఎక్కుపెట్టి చెప్పే మంత్రం ఏది?
  5. ‘వీరపాండ్య కట్టబ్రహ్మన్న’ చిత్రంలో శివాజీ గణేశన్‍కు గళం యిచ్చిన వారు?
  6. ‘పాండవ వనవాసం’ చిత్రంలో ఆంజనేయస్వామి పాత్రధారి ఎవరు?
  7. ‘రాజనందిని’ చిత్రంలో ‘చిక్కావులేరా చక్కని రాజా’ పాటను ‘జిక్కి’తో పాడినది ఎవరు?
  8. ‘మిస్టర్ మద్రాస్’గా బిరుదు నందుకున్న యీ నటుడు పెక్కు చిత్రాలలో నటించారు. ఎవరాయన?
  9. నేపథ్య గాయని పి.జి.కృష్ణవేణి ____ గా ప్రసిద్ధులు.
  10. ‘జరిగిన కథ’ (కృష్ణ, జగ్గయ్య) చిత్రం నిర్మించిన కె. బాబూరావ్ ఏ ప్రముఖ దర్శకుని వద్ద అసిస్టెంట్‌గా పని చేశారు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 డిసెంబరు 20వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 15 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2022 డిసెంబరు 25 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 13 జవాబులు:

1.నయా కదం 2. నిషానా 3. ప్రేమ్ తపస్య 4. జీవన పోరాటం 5. మనుషులు చేసిన దొంగలు 6. త్రిమూర్తులు 7. తీన్‍మార్ 8. గబ్బర్ సింగ్ 9. కల్పన 10. విచిత్ర జీవితం

సినిమా క్విజ్ 13 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • బి. మణి నాగేంద్ర రావు
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • శంభర వెంకట రామ జోగారావు
  • వనమాల రామలింగాచారి
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here